• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రపంచకప్‌లో వైఫల్యంపై స్పందించిన పాక్ కెప్టెన్

    ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ వైఫల్యంపై వస్తున్న విమర్శలపై కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ స్పందించారు. టీవీలో మాటలు చెప్పడం సులువని వ్యాఖ్యానించాడు. ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే తనకు నేరుగా ఫోన్‌ చేయొచ్చన్నారు. మూడేళ్లుగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. సారథ్యాన్ని ఎప్పుడూ భారంగా భావించలేదని చెప్పారు. ‘ప్రపంచకప్‌లో ఆడుతున్నప్పుడు ఒత్తిడిలో లేను. ఫీల్డింగ్‌లో నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు పరుగులు రాబట్టి జట్టుకు విజయాన్ని అందించాలని ఆలోచిస్తా’. అని బాబర్‌ వివరించాడు.

    రోహిత్ ఆటతీరు అద్భుతం: పాక్ కెప్టెన్

    మ్యాచ్ అనంతరం పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్‌ చేశాడని కొనియాడాడు. అతడిని నిలువరించడం కష్టంగా మరిందన్నాడు. ‘తొలుత మాకు శుభారంభమే లభించింది. రిజ్వాన్‌, నేనూ నార్మల్‌గానే ఆడాలనుకున్నాం. కానీ అకస్మాత్తుగా మా​ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. సరైన రీతిలో ఇన్నింగ్స్‌ ముగించలేకపోయాం’ అని బాబర్ చెప్పుకొచ్చాడు. .