• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తొలిసారి ఆలౌట్ అయిన ముంబై

  వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తొలిసారిగా ఆలౌటైంది. యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌లో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేలీ మ్యాథ్యూస్(35), ఇస్సీ వాంగ్(32), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(25) మినహా ముంబై అమ్మాయిల్లో ఎవరూ రాణించలేదు. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 3, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పేసర్ అంజలి శర్వాణి ఒక వికెట్ పడగొట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే యూపీ జట్టుకు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం.

  డబ్ల్యూపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా

  వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. సాయంత్రం 3.30గంటలకు ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ తలపడనుంది. అనంతరం 7.30గంటలకు బెంగుళూరుతో గుజరాత్ జెయింట్స్ పోటీ పడనుంది. ముంబై ఇండియన్స్ ఇదివరకే క్వాలిఫైయర్స్‌లోకి అడుగు పెట్టింది. 3వ స్థానం కోసం యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు రెండేసి విజయాలతో 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు, రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుని ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది.

  ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టిన ముంబై

  వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై జట్టు ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 55 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లడమే కాకుండా ప్లే ఆఫ్‌లోకి అడుగు పెట్టింది. టోర్నీలో ఓటమి ఎరుగకుండా 5 మ్యాచుల్లో విజయాలతో ప్లే ఆఫ్‌లోకి అడుగు పెట్టిన జట్టు ఇదే. దిల్లీ క్యాపిటల్స్ 4 విజయాలతో రెండో స్థానంలో ఉంది. దాదాపు ఈ జట్టు కూడా ప్లేఆఫ్‌లోకి చేరుకున్నట్లే కనిపిస్తోంది. టేబుల్ టాపర్ నేరుగా … Read more

  ముంబై గల్లీల్లో నం.1 క్రికెటర్ బ్యాటింగ్

  [VIDEO:](url) టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ముంబై గల్లీల్లో క్రికెట్ ఆడాడు. బ్యాట్ పట్టి స్కూప్ షాట్ ఆడాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపిక అయినప్పటికీ సూర్య తొలి టెస్టులో మాత్రమే ఆడాడు. శ్రేయస్ అయ్యర్ రాకతో రెండు, మూడు టెస్టుల్లో సూర్యని తప్పించారు. అయితే, సూర్య ఏకాగ్రత ఇప్పుడు పూర్తిగా వన్డే సిరీస్‌పైనే ఉంది. ఈ నెలలోనే ఆసీస్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. అనంతరం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు. … Read more

  ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్

  మహిళల ప్రీమియర్ లీగ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్‌ని ఎంపిక చేయడం సంతోషంగా ఉందని జట్టు యజమాని నీతా అంబానీ వెల్లడించారు. భారత జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం హర్మన్‌కు ఉందని గుర్తు చేశారు. జాతీయ జట్టు విజయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను హర్మన్ చవిచూసిందని నీతా చెప్పారు. హర్మన్‌ని వేలంలో రూ.1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. మార్చి 4న గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కానుంది.

  IPL: ముంబయికి గుడ్‌ న్యూస్.. స్టార్ ప్లేయర్‌ వచ్చేస్తున్నాడు!

  ఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ 2023 సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉంటాడని కన్ఫర్మ్‌ అయ్యింది. జస్ప్రీత్‌ ఆర్చర్‌ పూర్తి సీజన్‌నుకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు ముంబై ఇండియన్స్‌ వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న ఆర్చర్‌ అక్కడ ఇంగ్లాండ్‌ తరపున 3 వన్డేలు, 3 టీ20ల ఆడనున్నాడు. అనంతరం నేరుగా భారత్‌కు చేరుకోనున్నాడు.

  ముంబై ఇండియన్స్ జెర్సీ విడుదల

  మహిళల ఐపీఎల్.. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌‌కు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్ల జెర్సీని విడుదల చేసింది. నీలి, ఎరుపు, గోల్డ్ రంగులను ఈ జెర్సీ కలిగి ఉంది. ఈ మేరకు ముంబై ఇండియన్స్ ఓ వీడియోను విడుదల చేసింది. మార్చి 4న గుజరాత్ జెయింట్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తొలి సమరం మొదలు కానుంది. జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుండగా భారత మాజీ ప్లేయర్ జులన్ గోస్వామి మెంటర్‌గా ఎంపికైంది. ముంబైతో పాటు గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ … Read more

  బుమ్రా ఆడకపోతే ప్రపంచమేమీ ఆగదు; మాజీ క్రికెటర్

  ముంబై ఇండియన్స్ తరఫున భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగకపోతే ప్రపంచమేమీ ఆగిపోదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. ‘‘బుమ్రా జాతీయ ఆస్తి కాబట్టి భారత్ తరఫున ఆడాలి. ఆ తర్వాతే ప్రాంచైజీ ప్లేయర్. బుమ్రా ఐపీఎల్‌లో ఆడేది లేదని బీసీసీఐ.. ముంబై ఇండియన్స్‌కు చెప్పేయాలి. ప్రస్తుతం బుమ్రా పూర్తి ఫిట్‌గా లేడు. అలాంటప్పుడు ఐపీఎల్‌లో ఎలా బరిలోకి దించుతారు.‘‘ అంటూ ఆకాశ్ ప్రశ్నించాడు. కాగా వెన్నునొప్పితో బుమ్రా 6 నెలలుగా భారత్ తరఫున బరిలోకి దిగలేదు.

  కెప్టెన్లు ఇద్దరూ ఒక గూటికే..

  డబ్ల్యూపీఎల్ వేలం తర్వాత ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. భారత పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇద్దరూ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడనున్నారు. తాజాగా జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ రూ.1.8 కోట్లు వెచ్చించి హర్మన్‌ను సొంతం చేసుకుంది. మరో వైపు రోహిత్ దశాబ్దానికి పైగా ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతున్నాడు. ఇలా ఇరు జట్ల కెప్టెన్లు ముంబై టీమ్‌లో చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది. © ANI Photo © … Read more

  IPL 2021: ఒక ప్లే – ఆఫ్ బెర్టు కోసం నాలుగు జట్లు పోటీ..! ఎవరి అవకాశాలు ఎంత?

  ప్రస్తుతం ఐపీఎల్ 2021లో ఒక్క ప్లే ఆఫ్ బెర్తు కోసం హోరాహోరి పోరు జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలను కన్ఫర్మ్ చేసుకోగా ఇక మిగిలిన రెండు బెర్త్ ల కోసం 4 జట్లు పోటీపడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే రేసు నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక వారిని పక్కన పెడితే 4 వ స్థానం కోసం కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ … Read more

  Categories IPL