ప్రస్తుతం ఐపీఎల్ 2021లో ఒక్క ప్లే ఆఫ్ బెర్తు కోసం హోరాహోరి పోరు జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలను కన్ఫర్మ్ చేసుకోగా ఇక మిగిలిన రెండు బెర్త్ ల కోసం 4 జట్లు పోటీపడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే రేసు నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక వారిని పక్కన పెడితే 4 వ స్థానం కోసం కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య విపరీతమైన పోరు నెలకొంది. మరి ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం…
ముంబై ఇండియన్స్
తామాడిన 12 మ్యాచ్లలో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ఏడవ స్థానంలో నిలిచారు డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్. అయితే రేస్ లో ఉన్న పంజాబ్ తో పోలిస్తే ముంబై కు ఒక మంచి అవకాశం ఉంది. వారు ఆడే మిగిలిన రెండు మ్యాచ్లను గెలిస్తే, కోల్ కతా, రాజస్థాన్ చివరి లీగ్ మ్యాచ్ ఓడిపోతే ఎటువంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తారు. కాబట్టి ముంబై మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే ప్లే- ఆఫ్ బెర్తు కన్ఫర్మ్. ఇక వారు కేవలం ఒక మ్యాచ్ గెలిస్తే కోల్ కతా, రాజస్థాన్ వారి రెండు మ్యాచ్ లు ఓడిపోవాలి.
అప్పుడు ముంబై నేరుగా ప్లే ఆఫ కు 12 పాయింట్లతో అర్హత సాధిస్తుంది. ఇక ముంబై వరుసగా రాజస్థాన్ రాయల్స్ తో, సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది.
కోల్ కతా నైట్ రైడర్స్
కోల్ కతా వారికి కావాల్సిందల్లా చివరి లీగ్ మ్యాచ్ ను గెలవడమే. ఎందుకంటే ముంబై, రాజస్థాన్ లో ఒక్క రెండు జట్లుకే 14 పాయింట్లు ఉంటాయి. కోల్ కతా నెట్ రన్ రేట్ ముంబై, రాజస్థాన్ ల కంటే ఎంతో ఎక్కువగా ఉంది. నైట్రైడర్స్ తమ తర్వాత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఆడుతారు. అయితే కోల్ కతా రాజస్థాన్ తో ఓడిపోయి… తర్వాత రాజస్థాన్, ముంబై చెరో మ్యాచ్ లో ఓడిపోయినా కోల్ కతా అధిక రన్ రేట్ తో ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకుంటుంది.
పంజాబ్ కింగ్స్
టోర్నమెంటులో పడుతూ లేస్తూ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ మ్యాచ్ లు అందించే పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి ప్లే ఆఫ్ రేసు లో ఉంది. పంజాబ్ చెన్నై ఆడబోయే మ్యాచ్ లో గెలిస్తే 12 పాయింట్లకు చేరుకుంటారు. అయితే మిగిలిన ముంబై కనీసం ఒక మ్యాచ్ ఓడి, కోల్ కతా రాజస్థాన్ చిత్తుగా ఓడిపోయి, రాజస్థాన్ ఆ తర్వాత లీగ్ మ్యాచ్ లో ఘోరంగా ఒక మాదిరిగా ఓడినా పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్ళిపోతుంది. ఇక పంజాబ్ తప్పనిసరిగా గెలవాల్సిన ఆ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్ రేసు నుండి అవుట్ అవుతుంది. పంజాబ్ తమ తర్వాతి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతుంది.
రాజస్థాన్ రాయల్స్
ఇక పైన ఉన్న జట్లు అన్నింటిలో అతి తక్కువ అవకాశాలు ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై పై ఘన విజయంతో ప్లే ఆఫ్ రేసులోనికి వచ్చింది. అయితే వీరు మిగిలిన రెండు మ్యాచ్ లు భారీ తేడాతో విజయం సాధిస్తే అవకాశాలు ఎంతో మెరుగవుతాయి. అప్పుడు కూడా పంజాబ్, కోల్ కతా వారికి మిగిలిన ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా… ముంబై రెండింటిలో, ఒకటి ఓడిపోయినా… రాజస్థాన్ రెండు మ్యాచ్ లు గెలిస్తేనే ప్లే ఆఫ బెర్త్ పక్కా.
అదీ సంగతి. వచ్చే ఆదివారం నాటికి టాప్ – 4 జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. ఇంతకీ మీరు అనుకునే ఆ నాలుగు జట్లు ఏవి?
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది