ఐపీఎల్-2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. చివరి రెండు బంతులకు 10 పరుగులు కావాల్సిన సమయంలో జడేజా సిక్స్, ఫోర్‌గా మలచడంతో చెన్నై శిబిరం సంబరాల్లో మునిగితేలింది.
ఎప్పుడు కూల్‌గా ఉంటూ హావభావాలను ప్రదర్శించని ధోని.. చెన్నై విజయంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చివరి రెండు బంతుల సమయంలో కళ్లు మూసుకుని ఉండడం కెమెరాల్లో కనిపించింది. జడేజా తనదైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించడంతో ధోనీ సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. జడేజాను ఆనందంతో హత్తుకొని ఉద్వేగానికి గురయ్యాడు. గ్రౌండ్‌లో తిరుగుతూ ప్రేక్షకులకు విజయానందాన్ని పంచాడు
మరోవైపు అంబటి రాయుడు రిటైర్మెంట్ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్‌ను అతడి చేతుల మీదుగానే చెన్నై అందుకొంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జైషా రాయుడికి ట్రోఫి అందజేశారు. ఇక ట్రోఫి అందుకున్న సమయంలో చెన్నై ఆటగాళ్లు చిన్నపిల్లలుగా మారి కేరింతలు కొట్టారు. పెద్దగా కేకలు వేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. కోచింగ్ సిబ్బంది కూడా వారితో కలిసి డ్యాన్స్ చేసింది.
మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడిన ధోని తన కెరీర్‌కు చివరి దశ కావడంతో కాస్త భావోద్వేగానికి గురైనట్లు చెప్పాడు. ఈ ఏడాది ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకుల నుంచి భారీగా ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. ‘ఇలాంటప్పుడు అందరికీ థాంక్స్ అని చెప్పడం చాలా సులువు. అయితే, నాకు కష్టమైన విషయం ఏంటంటే మరో 9 నెలలు శ్రమించి కనీసం వచ్చే సీజన్ అయినా ఆడాలి. ఇదంతా నా శరీరంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది’ అని ధోని అన్నాడు.
ట్రోఫి అందుకున్న అనంతరం ధోని కెమెరాపై సంతకం చేసి నవ్వులు పూయించాడు. ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో చెన్నై ఆటగాళ్లు బిగ్గరగా అరుస్తూ ధోనిని ఎంకరేజ్ చేశారు.
గెలుపు అనంతరం ధోని, జడేజా, రాయుడు ఆనందంలో మునిగిపోయారు. ముగ్గురు ఒకరినొకరు హత్తుకొని ఆనందాన్ని పంచుకున్నారు.
మ్యాచ్ విన్నర్ రవీంద్ర జడేజా ఫ్యామిలీ మైదానంలో సందడి చేసింది. ఐపీఎల్ ట్రోఫీ పట్టుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా తన ప్రేయసితో కలిసి మైదానంలో హల్‌చల్ చేశాడు.
ఆమెతో కలిసి ట్రోఫీతో ఫొటోలు దిగాడు.
ఈ సీజన్‌లో చెన్నై తరపున అద్భుతంగా రాణించిన అజింక్యా రహానే కూడా తన కుటుంబంతో గ్రౌండ్‌లో మెరిశాడు.
చెన్నై బ్యాటర్ శివం దూబే తన భార్య, కుమారుడుతో కలిసి ఐపీఎల్ ట్రోఫీతో తళుక్కుమన్నాడు.
చెన్నై విధ్వంసక ఓపెనర్ డెవాన్ కాన్వే సైతం తన భార్యతో కలిసి ట్రోఫితో ఫొటో దిగాడు.
ధోని, జడేజా కూతుర్లు ఐపీఎల్ ట్రోఫీని పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సమయంలో రహానే కూతురు కూడా పక్కనే ఉంది. చిన్నారులు ట్రోఫిని పట్టుకున్న సమయంలో CSK బృందం కేరింతలు కొట్టింది.
జడేజా వరుసగా సిక్స్, ఫోరు బాది చెన్నైను విజేతగా నిలపగా ఆ మధుర క్షణాలను ఐపీఎల్ టీమ్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. జడేజా విన్నింగ్ షాట్ కొట్టగానే CSK డగౌట్ మెుత్తం మైదానంలోకి పరుగెత్తుకెళ్లడం వీడియో కనిపిస్తుంది.
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!