• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నా మనసంతా అక్కడే ఉంటుంది: హార్థిక్

  గాయం కారణంగా టీమిండియా జట్టు నుంచి వైదొలగడంపై ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘వరల్డ్‌కప్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని జీర్ణించుకోవడం లేకపోతున్నా? జట్టుకు దూరంగా ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది. కష్టకాలంలో నాపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా హార్థిక్ ఆవేదనను వ్యక్తం చేశారు. వన్డే వరల్డ్‌కప్‌ నుంచి ఇలా అర్ధంతరంగా నిష్క్రమించడం బాధగా ఉందని ఉద్వేగానికి గురయ్యాడు.

  టీమిండియాకు బిగ్‌ షాక్‌

  టీమిండియాకు బిక్ షాక్ తిగిలింది. గాయం కారణంగా హార్దిక్‌ పాండ్య టోర్నీకి దూరమయ్యాడు. ఈ మేరకు ఐసీసీ ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో హార్దిక్ గాయపడ్డాడు. చీలమండ గాయం కావడంతో అతడు NCAకి వెళ్లిపోయాడు. గాయం తీవ్రత కారణంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు హార్దిక్‌ దూరమైనట్లు ఐసీసీ ధ్రువీకరించింది. అతడి స్థానంలో యువ పేసర్ ప్రసిధ్‌ కృష్ణను తీసుకుంది.

  టీమిండియాకు మరో గుడ్‌ న్యూస్‌

  వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు మరో శుభవార్త అందింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య త్వరగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. నొప్పి నుంచి ఉపశమనం పొంది ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ కూడా ప్రారంభించినట్లు సమాచారం. లీగ్‌ దశ ముగిసేనాటికి పూర్తిగా కోలుకొని సెమీస్‌ సమయానికి జట్టుతో హార్దిక్‌ కలుస్తాడని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. హార్దిక్‌ ఇప్పటికే రెండు నెట్‌ సెషన్స్‌లో పాల్గొన్నాడని పేర్కొన్నాయి. కాగా, నవంబర్‌ 15 నుంచి వరల్డ్‌కప్‌లో నాకౌట్‌ దశ మెుదలవుతుంది.

  టీమిండియా కూర్పులో గందరగోళం

  ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయంతో దూరం కావడంతో టీమిండియా కూర్పులో గందరగోళం నెలకొంది. రేపు ఇంగ్లాండ్‌తో లక్నో వేదికగా మ్యాచ్ జరగనుంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండనుండటంతో థర్డ్‌ స్పిన్నర్‌గా అశ్విన్‌ను తీసుకునే ఛాన్స్‌ కనిపిస్తోంది. అదే జరిగితే పేసర్లలో బుమ్రాకు తోడుగా షమీ లేదా సిరాజ్‌లలో ఎవర్నీ తీసుకోవాలన్న సందిగ్దం నెలకొంది. అటు బ్యాటింగ్‌లో కివీస్‌ మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్‌ను కొనసాగించాలా? లేదా ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌కు చోటివ్వాలా అన్న ప్రశ్న టీమిండియాకు ఎదురవుతోంది.

  వరల్డ్‌కప్‌ నుంచి హార్దిక్‌ ఔట్‌..!

  వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత్‌కు బిగ్‌ షాక్‌ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. గాయంతో కివీస్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్‌ పాండ్య టోర్నీ మెుత్తానికి దూరమయ్యే ఛాన్సెస్‌ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. హార్దిక్‌ది చీలమండ గాయమని భావించినప్పటికీ లిగమెంట్‌లోనూ చీలిక బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలే వాస్తవమైతే హార్దిక్‌కు కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరం ఉంటుంది. అప్పుడు ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు సైతం హార్దిక్‌ దూరం కావచ్చు.

  టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ!

  చీలమండ గాయంతో కివీస్‌తో మ్యాచ్‌కు దూరమైన భారత ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య మరో రెండు మ్యాచ్‌లకు సైతం అందుబాటులో ఉండడని సమాచారం. 29న ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, తాజా అప్‌డేట్‌ ప్రకారం ఇంగ్లాండ్‌తోనే కాకుండా ఆ తర్వాత శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు సైతం హార్దిక్‌ దూరమవుతాడని తెలుస్తోంది. ప్రస్తుతం హార్దిక్‌ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. అతడు వేగంగా కోలుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

  స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా హార్దిక్‌ పాండ్య

  గాయంతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పునరాగమనం చేయనున్నాడు. హార్దిక్‌ను స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఆడించే అవకాశాల్ని జట్టు మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తోంది. చీలమండ గాయంతో బాధపడుతున్న హార్దిక్‌.. బెంగళూరులోని NCAలో వేగంగా కోలుకుంటున్నాడు. ఈనెల 29న ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. లక్‌నవూ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో సిరాజ్‌కు బదులు అశ్విన్‌ను ఆడించే ఛాన్స్‌ ఉంది. సూర్యకుమార్‌ స్థానంలో హార్దిక్‌ జట్టులోకి రావొచ్చు.

  హార్దిక్ దెబ్బకు బాబర్ షాక్.. ఇదెక్కడి స్వింగ్‌రా మామ!

  ఆసియాకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో.. పాక్ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను బోల్తా కొట్టించాడు. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హార్దిక్‌ బంతితో మ్యాజిక్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ పడిన బంతిని బాబర్ ఢిపెన్స్‌ ఆడేందుకు యత్నించాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్‌ అయ్యి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఒక్కసారిగా బాబర్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. https://x.com/UllahIkhtasham/status/1701244803743162855?s=20

  చాహల్ బ్యాటింగ్‌లో అయోమయం.. వీడియో వైరల్

  వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం నెట్టింట వైరల్‌గా మారింది. కుల్‌దీప్‌ యాదవ్‌ ఔటై పెవిలియన్‌కు చేరాడు. అతడి స్థానంలో ముందు చాహల్‌ మైదానంలోకి అడుగు పెట్టాడు. అయితే కెప్టెన్, ముకేశ్‌ కుమార్‌ను పంపించాలని భావించాడు. ఈ విషయాన్ని ఉమ్రాన్‌ మాలిక్‌ ద్వారా చాహల్‌కు తెలిపాడు. ఆ వెంటనే చాహల్ తిరిగి డగౌట్‌ వైపు వస్తుండగా అంపైర్లు అతడిని పిలిచారు. మైదానంలోకి వచ్చాక అలా వెళ్లడం రూల్స్‌కు విరుద్దమని … Read more

  హార్దిక్‌ని గేలి చేసిన విరాట్

  నేడు వెస్టిండీస్‌తో భారత్ తొలి వన్డే ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. నెట్స్‌లో విరాట్ బ్యాటింగ్ చేస్తుండగా హార్దిక్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్‌ని విరాట్ గేలి చేశాడు. హార్దిక్ వేసిన బంతిని కవర్స్ దిశగా బాది ఫోర్ వెళ్తుందన్నట్లుగా సిగ్నల్ ఇస్తూ ఎద్దేవా చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బార్బడోస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. Virat Kohli having fun in nets with Hardik Pandya. pic.twitter.com/2KQ9BHHLkK — Mufaddal Vohra (@mufaddal_vohra) … Read more