రేపటి నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొదలు కానున్న నేపథ్యంలో టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో టీ20 సిరీస్ కు అందుబాటులో ఉండడని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాహుల్ కెప్టెన్ గా తప్పుకోవడంతో పంత్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సిరీస్ లో సీనియర్లు లేరు..