ఐపీఎల్-2023 సీజన్ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లతో పూర్తి వినోదాన్ని పంచింది. ఫలితం కోసం చివరి బంతి వరకూ వెళ్లిన మ్యాచ్‌లు ఈ సీజన్‌లో ఎన్నో ఉన్నాయి. రూ.కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టార్ ఆటగాళ్లు ఈ ఏడాది విఫలం కాగా, సరిగ్గా పేరు కూడా తెలియని యంగ్‌స్టర్స్ ధూమ్ ధామ్ ఇన్నింగ్స్‌లతో చెలరేగి ఆడారు. తమ ధనాధన్ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను కట్టిపడేశారు. గత సీజన్లతో పోలిస్తే ఈ ఐపీఎల్‌లో పరుగుల వరద పారింది. పలు రికార్డులు సైతం బద్దలయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
అత్యధిక సిక్సర్లు
గత ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో అన్ని జట్లు కలిపి 1124 సిక్సర్లు బదాయి. దీంతో గతేడాది నమోదైన 1062 సిక్సర్ల రికార్డు కనుమరుగైంది.
అత్యధిక ఫోర్లు
సిక్సర్లతో పాటు ఫోర్లు కూడా ఈ సీజన్‌లోనే భారీ సంఖ్యలో నమోదయ్యాయి. 2022లో 2018 ఫోర్లు కొట్టగా, ఈసారి ఏకంగా 2174 బౌండరీలు వచ్చాయి.
హైస్కోర్ ఛేజింగ్
IPL 2023లో 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరును 8 సార్లు చేజ్ చేశారు. ఇదే ఇప్పటివరకు అత్యధికం. 2014లో 200+ స్కోరును 3 సార్లు చేజ్ చేయగా ఇప్పటివరకూ అదే రికార్డుగా ఉండేది.
బ్యాటింగ్ రికార్డు
ఈ ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఓవర్‌కు సగటున 8.99 పరుగులు చేశారు. దీంతో 2018లో ఓవర్‌కు సగటున చేసిన 8.65 పరుగుల రికార్డు మాయమైంది.
సెంచరీలు
ఈ ఐపీఎల్‌లోనే అత్యధిక సెంచరీలు సైతం రికార్డయ్యాయి. బ్యాటర్లు 12 శతకాలతో కదం తొక్కారు. దీంతో 2022లో వచ్చిన 8 సెంచరీల రికార్డు బద్దలయ్యింది.
అన్‌క్యాప్డ్ ప్లేయర్ల సెంచరీలు
ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు అన్ క్యాప్డ్ ఆటగాళ్లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో యశస్వి జైస్వాల్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఫైనల్స్‌లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ 96 పరుగులు వద్ద ఔటై త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
హాఫ్ సెంచరీలు
గత సీజన్‌లో నమోదైన అత్యధిక హాఫ్ సెంచరీ (118) రికార్డు ఈ ఏడాది తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఐపీఎల్‌లో 153 అర్ధశతకాలతో బ్యాటర్లు చెలరేగారు.
యావరేజ్ స్కోర్
ఐపీఎల్-2023 సీజన్‌లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 183గా ఉంది. ఇప్పటివరకూ జరిగిన అన్ని సీజన్లతో పోలిస్తే ఇదే అత్యధికం. 2018లో నమోదైన 172 తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరును ఇది చెరిపేసింది.
బౌలర్ల రికార్డు
ఐపీఎల్ సీజన్‌లో ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బౌలర్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇదే తొలిసారి. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు షమీ, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించారు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..