హైదరాబాద్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ (Kumari Aunty) షాపు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ట్రాఫిక్ జామ్ అవుతుందని, అనుమతులు లేవనే కారణంగా ట్రాఫిక్ పోలీసులు నిన్న (మంగళవారం) ఈ సెంటర్‌ను మూసివేయించారు. దీంతో ఈ వ్యవహారం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం రాజకీయరంగు పులుముకోవడంతో పాటు పోలీసుల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి.. యధావిధిగా ఆమె షాపును కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
కుమారి ఆంటీ స్టాల్‌కు వస్తా: సీఎం
పోలీసుల చర్యతో కుమారి ఆంటీకి (#KumariAunty) అన్యాయం జరిగిందన్న కామెంట్లు వస్తున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించి ఆమెకు బాసటగా నిలిచారు. కుమారి ఫుడ్ స్టాల్ అక్కడి నుంచి తీసేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆమె ఫుడ్ స్టాల్‌ను మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు. కుమారిపై పెట్టిన కేసు విషయాన్ని కూడా పునఃపరిశీలన చేయాలని డీజీపీకి దిశానిర్దేశం చేశారు. మెున్నటి వరకు కుమారి ఎక్కడైతే స్టాల్ పెట్టుకుందో ఆ స్థానంలోనే వ్యాపారం చేసుకునేదుకు అవకాశం ఇవ్వాలని MAUD అధికారులను కూడా సూచించారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న సీఏం.. త్వరలోనే ఆమె స్టాల్‌ను సందర్శిస్తానని చెప్పారు. ఈ మేరకు సీఎంవో నుంచి ప్రభుత్వ సీపీఆర్వో అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు.
కుమారి అంటీ ఫుడ్ స్టాల్ మూసివేయడం…
వైసీపీ vs టీడీపీ
కుమారి ఆంటీ (#KumariAunty) ఫుడ్ స్టాల్ తొలగించారన్న వార్త బయటకొచ్చినప్పటి నుంచి అమెకు మద్దతుగా పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే ఏపీలోని (AP Politics) వైసీపీ, టీడీపీ (YCP vs TDP) మధ్య ట్విట్టర్‌లో పెద్ద యుద్ధమే జరిగింది. కుమారి ఆంటీది స్వస్థలం ఏపీ కాగా.. జగనన్న కట్టించిన ఇంట్లో తాను ఉంటున్నానని గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పటమే రెండు పార్టీల మధ్య యుద్ధానికి కారణమైంది. చంద్రబాబు శిష్యుడైన రేవంత్.. తెలంగాణ సీఎంగా ఉండటంతో కక్షతోనే కుమారి ఆంటీ మీద కేసు నమోదు చేశారని వైసీపీ ఆరోపించగా.. దానికి టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.
అందుకే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా?
ఇలా సోషల్ మీడియాతో పాటు.. ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. కావాలనే టీడీపీ నేతలు సీఎం రేవంత్‌తో చెప్పి.. కుమారి అంటీ షాపును మూసివేయించారని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపైనా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఆమెకు బాసటగా నిలిచారు. చిన్న వ్యాపారుల మీద ప్రభుత్వ చర్యలు తగవని హితవు పలికారు. పలువురు నెటిజన్లు రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు. కేటీఆర్ ఉన్నప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని పలు ఉదంతాలు తీసుకొచ్చారు. దీంతో సమస్యను గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి కుమారి అంటీకి అండగా నిలబడినట్లు తెలుస్తోంది.
ఆమె ఎలా ఫేమస్ అంటే?
ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి.. 2011లో ఈ స్ట్రీట్‌ఫుడ్ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ మాధాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ (ITC Kohenur) ఎదురు ఈ స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్‌ను ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే రుచికరమైన వెజ్, నాన్‌వెజ్ వంటకాలను అందిస్తూ ఆమె ఎంతో ఫేమస్ అయ్యారు. తొలుత 5 కేజీలతో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్.. ప్రస్తుతం రోజుకు క్వింటా (100 కేజీలు)కు పైగా అమ్ముడుపోయే స్థాయికి చేరింది. కొందరు యూట్యూబ్ ఫుడ్ వ్లాగర్స్ వరుసగా ఆమెపై వీడియోలు చేయడంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ ట్రెండింగ్‌లోకి వచ్చారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం