• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Kumari Aunty: హైదరాబాద్‌ ఫేమస్‌ కుమారి ఆంటీ.. స్ట్రీట్‌ ఫుడ్‌తో రోజుకు రూ.30,000 వేలు సంపాదన!

  హైదరాబాద్‌ అనగానే ప్రధానంగా గుర్తుకువచ్చేది ‘ధమ్‌ బిర్యానీ’. ఘుమ ఘుమలాడే బిర్యానీతో పాటు ఎన్నో రకాల స్ట్రీట్‌ ఫుడ్స్‌కు భాగ్యనగరం ఫేమస్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి ‘హైదరాబాద్‌ ఫేమస్ ఆంటీ’ (Hyderabad Famous Aunty) అనే పేరుతో ఓ మహిళ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎన్నో రకాల నాన్‌వెజ్‌ వంటకాలను తక్కువ ధరకే అందిస్తూ ఫుడ్‌ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె సంపాదన ఎంత? ఏ వంటకం ధర ఎలా ఉంది? అన్నది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

  ఇంతకీ ఆమె ఎవరు?

  ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి.. 2011లో ఈ స్ట్రీట్‌ఫుడ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌ మాధాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ (ITC Kohenur) ఎదురు ఈ స్ట్రీట్‌ఫుడ్‌ బిజినెస్‌ను ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే రుచికరమైన వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను అందిస్తూ ఆమె ఎంతో ఫేమస్‌ అయ్యారు. తొలుత 5 కేజీలతో ప్రారంభమైన కుమారి ఫుడ్‌ బిజినెస్‌.. ప్రస్తుతం రోజుకు క్వింటా (100 కేజీలు)కు పైగా అమ్ముడుపోయే స్థాయికి చేరింది. కొందరు యూట్యూబ్‌ ఫుడ్‌ వ్లాగర్స్‌ వరుసగా ఆమెపై వీడియోలు చేయడంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ ట్రెండింగ్‌లోకి వచ్చారు. 

  వంటకాలు ఇవే 

  తన వద్ద వైట్‌ రైస్‌, బగారా రైస్‌, గోంగూర రైస్‌, గోబీ రైస్‌, టమాటా రైస్‌, లెమన్‌ రైస్‌, జీరా రైస్‌, పెరుగన్నం వంటి రైస్‌ ఐటెమ్స్‌ ఉన్నాయని కుమారి (Hyderabad Famous Aunty) తెలిపారు. నాన్‌వెజ్‌కు వచ్చే సరికి చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, లివర్‌ కర్రీ, బోటీ కర్రీ, మటన్‌ కర్రీ, మటన్‌ లివర్‌, మటన్‌ హెడ్‌, ఫిష్‌ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్‌ కర్రీని సేల్‌ చేస్తున్నట్లు చెప్పారు. వెజ్‌లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, రెండు చట్నీలతో పాటు పప్పు, సాంబారు, మజ్జిగను ఫుడ్‌ లవర్స్‌కు అందిస్తున్నట్లు చెప్పారు. 

  ధర ఎంతంటే?

  హోటల్స్, రెస్టారెంట్లతో పోలిస్తే తన వద్ద వెజ్‌, నాన్‌వెజ్‌ ధరలు తక్కువేనని కుమారి స్పష్టం చేశారు. చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, బోటీ కర్రీ, ఫిష్‌ కర్రీ, ఫిష్‌ ఫ్రైలలో ఏదో ఒక కర్రీతో ప్లేటు తీసుకుంటే రూ.100 అని కుమారి తెలిపింది. నాన్‌ వెజ్‌లో రెండు కర్రీలు తీసుకుంటే ప్లేటు రూ.150, మూడు తీసుకుంటే రూ.200 అలా ఐటెమ్‌ను బట్టి రేటు ఉంటుందని ఆమె (Hyderabad Famous Aunty) చెప్పారు. నాన్‌వెజ్‌లో కర్రీతో కాకుండా ఫ్రై ఐటెమ్‌ తీసుకుంటే ప్లేటుకు రూ.150 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కేవలం వెజ్‌ మాత్రమే తింటే ప్లేటు రూ.80 అవుతుందని అన్‌లిమిటెడ్‌గా తినొచ్చని కుమారి స్పష్టం చేశారు. 

  రోజుకు ఎంత ఆదాయమంటే?

  ప్రతి రోజు మ.12 గంటలకు ఫుడ్‌కోర్టును ప్రారంభిస్తామని కుమారి (Hyderabad Famous Aunty) తెలిపారు. రోజుకు 600 నుంచి 700 మంది తమ వద్ద ఆహారం తింటారని పేర్కొన్నారు. నాన్‌వెజ్‌ తినాలనుకునేవారు కాస్త తొందరగా రావాల్సి ఉంటుంది. లేదంటే అన్ని ఐటెమ్స్‌ దొరకవని కుమారి తెలిపారు. ఇలా రోజుకు రూ.30 వేల వరకూ వ్యాపారం జరుగుతున్నట్లు చెప్పారు. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.2,50,000 – 3,00,000 వరకూ ఆమెకు లాభం ఉండవచ్చని చెబుతున్నారు. 

  ఎగబడుతున్న ఫుడ్‌ లవర్స్‌

  కుమారి ఆంటీ (Hyderabad Famous Aunty) అందించే రుచికరమైన ఆహారాన్ని తినేందుకు హైదరాబాద్‌ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం ఫుడ్‌ లవర్స్‌ తరలివస్తున్నారు.  కుమారి ఫుడ్స్‌ గురించి యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకొని మరి వెళ్తున్నారు. తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన ఫుడ్‌ను ఆమె అందిస్తోందని ప్రశంసిస్తున్నారు. రెస్టారెంట్లకు మించి టేస్ట్ ఉందని చెబుతున్నారు. పెద్దఎత్తున వస్తున్న ఫుడ్‌లవర్స్‌తో కుమారి పుడ్‌ సెంటర్‌ నిత్యం రష్‌గానే ఉంటుంది. 

  సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు మించి కుమారి ఆంటీ (Hyderabad Famous Aunty) సంపాదిస్తుండంతో సోషల్‌మీడియాలో ఆమె వైరల్‌గా మారారు. చాలా మంది నెటిజన్లు ఆమెతో తమ జీవితాన్ని పోల్చుకుంటూ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంత చదువు చదివి రూ.20-30 వేలకు పనిచేయడం కన్నా ఆమెలాగా ఫుడ్‌కోర్టు పెట్టుకుంటే లైఫ్‌లో సెటిల్‌ అవ్వవచ్చని పోస్టులు పెడుతున్నారు. 

  సందీప్‌ కిషన్‌ హల్‌చల్‌

  యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ (Sandeep Kishan).. హైదరాబాద్‌ ఫేమస్‌ ఆంటీ (Hyderabad Famous Aunty) ఫుడ్‌కోర్టుకి వెళ్లి అక్కడి వారిని సర్‌ప్రైజ్‌ చేశాడు. ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్లు వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), కావ్య థాపర్‌ (Kavya Thapar), డైరెక్టర్‌ వీఐ ఆనంద్‌ (Vi Anand)తో కలిసి సందీప్‌.. కుమారి ఆంటీ దగ్గరకు వెళ్లారు. అక్కడ చిత్రం బృందం తమకు ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకొని ఎంచక్కా లాంగించేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv