• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Heeramandi Secrets: ఓటీటీలో అదరగొడుతున్న ‘హీరామండి’.. ఈ సిరీస్‌ ప్రత్యేకతలు తెలుసా?

    ప్రముఖ బాలీవుడ్‌ సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్‌ బజార్‌ (Heeramandi: The Diamond Bazaar) వెబ్‌సిరీస్‌.. బుధవారం (మే 1) నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ నటీమణులు మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్‌ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్‌ నటించారు. భారతదేశ స్వాతంత్య్రానికి ముందు ఇప్పటి పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్న వేశ్యల జీవితం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. అయితే సినిమాకు సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    భారీ బడ్జెట్‌ సిరీస్‌

    హిరామండీ.. దేశంలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబడిన వెబ్‌సిరీస్‌గా గుర్తింపు పొందింది. ఈ సిరీస్‌ నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో నటించిన స్టార్‌ నటీమణులు, ఇతర నటుల రెమ్యూనరేషన్‌కే దాదాపు రూ.60 – 65 కోట్లు ఖర్చు అయ్యింది. వీరిలో అత్యధిక మెుత్తం సోనాక్షి సిన్హా (రూ.2 కోట్లు)కు చెల్లించారట. తర్వాత అదితిరావు హైదరీకి రూ.1.5 కోట్లు, మనీషా కోయిరాలాకు రూ.కోటి ఇచ్చారట.

    28 ఏళ్ల తర్వాత..

    స్టార్‌ నటి మనీషా కొయిరాలా (Manisha Koirala) గతంలో సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేశారు. 1996లో ఖామోష్‌: ది మ్యూజికల్‌ సినిమా వీరి కాంబోలో వచ్చింది. అయితే 28 ఏళ్ల తర్వాత తిరిగి వీరిద్దరు హీరామండీ కోసం వర్క్ చేశారు.

    షర్మిన్‌ సెగల్ ఎవరో తెలుసా?

    హీరామండి సిరీస్‌లో నటి షర్మిన్‌ సెగల్‌.. కీలక పాత్రలో నటించింది. తన అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆమె ఎవరో కాదు డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీకి స్వయానా మేన కొడలు. గాయకుడు బేలా సెగల్‌కు ఆమె కుమార్తె. 

    700 మంది 7 నెలలు

    భారత స్వాతంత్రానికి ముందు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ హీరామండి సిరీస్‌ను తెరకెక్కించారు. ఒకప్పటి హీరామండిని క్రియేట్‌ చేసేందుకు దాదాపు 700 మంది రేయింబవళ్లు శ్రమించారు. ఏడు నెలల పాటు పని చేసి అతి పెద్ద సెట్‌ను నిర్మించారు. డైరెక్టర్ భన్సాలీ తీసిన వాటిల్లో ఇదే అతిపెద్ద సెట్ కావడం విశేషం.

    300లకు పైగా కాస్ట్యూమ్స్‌

    హిరామండీ సిరీస్‌ను గమనిస్తే ఇందులోని హీరోయిన్లంతా విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో చాలా అందంగా కనిపిస్తారు. వారు అలా గ్లామర్‌గా ముస్తాబు అవ్వడం వెనక ప్రముఖ డిజైనర్లు రింపుల్‌, హర్‌ప్రీత్‌ల కృషి ఎంతో ఉంది. వీరు రెండేళ్ల పాటు పనిచేసి 300లకు పైగా కాస్ట్యూమ్స్‌ను ఈ సిరీస్‌ కోసం రూపొందించారు. ఈ సిరీస్‌ మెుత్తానికి ఆ కాస్ట్యూమ్స్‌నే వినియోగించారు. 

    సంగీతం కూడా అతడే!

    సంజయ్‌ లీలా భన్సాలీ మల్టీ టాలెంటేడ్‌ డైరెక్టర్ అని చెప్పవచ్చు. అద్భుతమైన డైరెక్షన్‌తో పాటు వినసంపైన సంగీతాన్ని కూడా ఆయన అందించగలరు. అయితే ఈ హిరామండీ సిరీస్‌కు ఆయన మ్యూజిక్ అందించడం విశేషం. 

    మేకప్‌కి 3గం.ల సమయం

    హీరామండి సిరీస్‌లో ప్రధానంగా ఆకర్షించే అంశం హీరోయిన్ల మేకప్‌. స్టార్‌ నటీమణులు తమ పాత్రకు తగ్గట్లు రెడీ కావడానికి దాదాపు 2-3 గంటల సమయం పట్టేదట. షూటింగ్‌లో సగం సమయం తారాగణం మేకప్‌లకే పట్టేదని యూనిట్‌ తెలిపింది. అందుకే ఈ సిరీస్‌ పూర్తి కావడానికి 380 రోజులు పట్టిందని పేర్కొంది. 

    ఆభరణాల డిజైన్‌

    హీరామండి సిరీస్‌లోని ప్రతీ పాత్ర.. ఒంటిపై ఆర్షణీయమైన అభరణాలతో కనిపిస్తుంది. అయితే ప్రతీ పాత్రకు తగ్గట్లు ప్రత్యేకంగా ఆభరణాలు డిజైన్‌ చేశారట. ఈ సిరీస్‌ కోసం 10 వేలకు పైగా వివిధ రకాల ఆభరణాలను మేకర్స్‌ డిజైన్‌ చేయించారు. వీటి మెుత్తం బరువు 300 కేజీలపైనే ఉండేదని యూనిట్ తెలిపింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv