టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్ హిట్ కావాలన్న రూల్ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్, ఫ్లాప్స్‌గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
Contents
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man)
నితీన్ (Nithiin) – శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్ కేరీర్‌లో ఎక్కువగా ట్రోల్స్ గురైన చిత్రంగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ నిలిచింది.
శాకుంతలం (Shakunthalam)
సమంత (Samantha) లీడ్ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.
రాధే శ్యామ్ (Radhe Shyam)
ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌తో స్మార్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్‌ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్‌కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్‌కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి.
వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover)
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా… రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్‘. హీరో విజయ్‌పై ఈ సినిమా నుంచే ట్రోల్స్ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్ తప్ప కథ లేదని ట్రోల్స్ వచ్చాయి. విజయ్ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.
బ్రహ్మోత్సవం (Brahmotsavam)
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్‌కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు.
సన్ ఆఫ్ ఇండియా (Son Of India)
దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్‌లో రెండే టికెట్లు బుక్ కావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘సన్ ఆఫ్ ఇండియా’ నిలిచింది.
వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama)
రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్ స్ప్రెడ్ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్ అంటూ చూసిన వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి బిహార్‌కు వెళ్లడం.. హీరో విలన్ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.
లైగర్ (Liger)
విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి.
శక్తి (Shakthi)
తెలుగులో డిజాస్టర్ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్ రమేష్‌ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో తారక్ లుక్ అసలు సూట్ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్ వెంకటేష్‌తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మేహర్ రమేష్ రీసెంట్ చిత్రం ‘భోళా శంకర్’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.
సలీం (Saleem)
మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D’Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!