• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 

  ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 2022లో జరిగిన విషయాలేంటో ఓ సారి చూద్దాం. దివికేగిన దిగ్గజాలు ఈ ఏడాది వినోదరంగంలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్‌ స్టార్ కృష్ణ, లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచారు. గ్రేట్ సింగర్స్‌ కేకే అనుకోకుండా చనిపోవటం, సిద్దూ మూసేవాలా హత్య ఫ్యాన్స్‌ను కన్నీటి పర్యంతం చేశాయి. కెేరాఫ్ బ్లాక్ బస్టర్స్‌ 2022లో వివిధ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. RRR, KGF-2, బ్రహ్మస్త్ర, విక్రమ్, PS-1, కాంతారా వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. … Read more

  పూరీ ఇంటికి పోలీసుల భద్రత

  తన ఇంటిపై దాడిచేసేందుకు కుట్ర పన్నుతున్నారని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు భద్రత కల్పించారు. లైగర్ సినిమా పరాజయం వల్ల డబ్బులు తిరిగి చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్లు వరంగల్ శీను, శోభన్ బాబులు వేధిస్తున్నారని పూరీ జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తన ఇంటి ముట్టడికి ప్లాన్ చేస్తున్నారని పూరీ మాట్లాడిన ఆడియో వైరల్ అయింది. అయితే ప్రస్తుతం పూరీ ఇంటి దగ్గర లేకపోవడంతో ధర్నాకు దిగలేదు. దీనిపై న్యాయపోరాటానికి కోర్టు మెట్లు ఎక్కాలని డిస్ట్రిబ్యూటర్ల భావిస్తున్నారు.

  పూరీ జగన్నాథ్‌కు కొత్త చిక్కులు

  ‘లైగర్‌’ ఫ్లాప్‌తో దర్శకుడు పూరీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆయనకు మరో సమస్య వచ్చిపడింది. పూరీ సినిమాలకు ఫైనాన్సింగ్‌ చేయకూడదని టాలివుడ్‌ ఫైనాన్షియర్లు అంతర్గతంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎగ్జిబిటర్లు ఆయన ఇంటిముందు ధర్నా చేయాలని నిర్ణయించగా…పూరీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. పరువు తీస్తే ఎవడికీ రూపాయి కూడా ఇవ్వబోనని స్పష్టం చేశారు. పూరీ అభిమానులు మాత్రం ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఒక్క హిట్‌ కొడితే అంతా సెట్‌ అవుతుందంటూ కామెంట్లు పోస్టులు పెడుతున్నారు.

  సైనికులతో ఉత్సాహంగా రౌడీబాయ్

  దీపావళి సందర్భగా ఓ ఛానల్ నిర్వహిస్తున్న ‘జై జవాన్’ కార్యక్రమంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా వివిధ క్రీడలు ఆడుతూ ఉత్సాహ పరిచాడు. సైనికులతో కలిసి టగ్ ఆఫ్ వార్ ఆడాడు. వాలీబాల్ గేమ్‌లో పాల్గొని అలరించాడు. కాసేపు షూటింగ్ చేశాడు. అంతేకాకుండా ఓ రాత్రి మొత్తం సైనికులతో కలిసి పెట్రోలింగ్ చేయనున్నాడు. లైగర్ పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ ఇలా ఉత్సాహంగా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. #NDTVExclusive … Read more

  జిమ్‌లో 100 స్క్వాట్లు తీశా: పూరీ

  లైగర్ పరాజయాన్ని చూసి బాధపడలేదని.. సినిమా చేస్తున్నంత కాలం చాలా ఎంజాయ్ చేశానని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెప్పాడు. చిరంజీవిని ఇన్‌స్టాగ్రాంలో ఇంటర్వ్యూ చేసే సమయంలో తన మనసులో మాటని పూరీ పంచుకున్నాడు. శుక్రవారం సినిమా విడుదలైతే.. సోమవారం జిమ్‌కి వెళ్లి 100 స్క్వాట్లు తీశానని పూరీ చెప్పాడు. తరువాతి సినిమాకు మరింత బలంగా సన్నద్ధం కావడం కోసమే ఇలా చేశానన్నాడు. ఓటమి గురించి నెల రోజుల కంటే ఎక్కువగా ఆలోచించనన్నాడు. కాగా, భారీ అంచనాల మధ్య విడుదలై లైగర్ పరాజయాన్ని మూటగట్టుకుంది.

  ‘పూరీ’ యాక్టింగ్ చేయాల్సిందే..!

  ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ‘పూరీ జగన్నాథ్’. ఈ దర్శకుడిలో మంచి నటుడు ఉన్నాడని.. కెమెరా వెనకాలే కాకుండా తెరపై కూడా రాణించగలడని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. తాజాగా విడుదలైన ‘గాడ్‌ఫాదర్‌’లో జర్నలిస్టుగా పూరీ అదరగొట్టాడు. అంతకుముందు ఒకట్రెండు సినిమాల్లోనూ కాసేపు మెరిశారు. కానీ, చిరు సినిమాతో ఈ డైరెక్టర్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఏంటో తెలిసిపోయిందని చెబుతున్నారు. దర్శకత్వంపైనే కాకుండా నటనపై కూడా దృష్టి సారించాలని పూరీకి సూచిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా పూరీ గడ్డు కాలం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ వాదన బలంగా వినిపిస్తోంది.

  పూరి కొడ్తే ఏ సినిమా మిగలదు: V.V.వినాయక్

  లైగర్ ప్లాఫ్‌పై స్టార్ డైరెక్టర్ వీ.వీ.వినాయక్ స్పందించారు. ‘లైగర్ మూవీ ఏమీ పూరి జగన్నాథ్ జీవితాన్ని మార్చలేదు. ఇంతకు ముందు కూడా పూరీ ప్లాపులు, హిట్స్ చూశాడు. ఓ టైంలో పూరి ఇక లేడన్నారు. మళ్లీ పోకిరితో కొడ్తే ఏ సినిమా కనిపించలేదు. సినిమాల్లో ఆర్థిక సమస్యలు సహజం. అన్నింటికీ ప్రిపేర్ అయ్యే పూరి ఉంటాడు. తన కేపాసిటీ నాకు తెలుసు. మళ్లీ పూరి గట్టిగా కొడ్తే ఏ సినిమా మిగలదు’ అని కామెంట్ చేశారు.

  తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి: విజయ్ దేవరకొండ

  విజయ్ దేవరకొండ నటించి ‘లైగర్’ మూవీ ఇటీవల విడుదలై నిరాశపరిచింది. కనీస వసూళ్లను కూడా రాబట్టకుండా ఆల్ టైం ఇండస్ట్రీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కొన్నిరోజులు సోషల్ మీడియాకు దూరమైన విజయ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అందులో ‘లైగర్’ షూటింగ్ కోసం విజయ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. దానికి ‘కష్టపడి పని చేయండి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి, మీరు చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. మీకు ఎలా కావాలో అలా జీవించండి’ అంటూ క్యాప్షన్ … Read more

  కష్టపడండి.. విజయం సాధించండి

  రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. లైగర్ సన్నాహకాల్లో భాగంగా చేసిన వీడియోను విజయ్ షేర్ చేశాడు. ‘కష్టపడండి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. నూతన నైపుణ్యాలు తెలుసుకోండి. తప్పుల నుంచి నేర్చుకోండి. విజయాన్ని సాధించండి. ఆనందంగా జీవించండి’ అని అందులో రాశాడు. ఈ పోస్టు స్ఫూర్తి కలిగించేలా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోని చూడటానికి Watch On బటన్‌పై క్లిక్ చేయండి. View this post on Instagram A post … Read more

  కరణ్ వల్లే లైగర్ ఫ్లాప్; వర్మ

  లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం చిత్ర నిర్మాత కరణ్ జోహార్ అని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్‌లో బాయ్‌కాట్ లైగర్ ఉద్యమం రావడానికి కరణ్ ఒక కారణం. అతనికి ఈ సినిమాకు సంబంధం ఉండడం వల్లే బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కరణ్ సినిమాలను అన్నింటినీ బాలీవుడ్ ప్రజలు బహిష్కరిస్తున్నారు. మరో వైపు విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కూడా వారికి నచ్చి ఉండకపోవచ్చు’’ అని … Read more