డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘లైగర్’ స్టోరీని రివీల్ చేశాడు. లైగర్ అనే ఒక కరీంనగర్ కుర్రాడికి దేశంలోనే బెస్ట్ ఫైటర్ కావాలని ఉంటుంది. అతడి తల్లి సపోర్ట్‌తో ఆశించినదానికంటే ఎక్కువగా సక్సెస్ వస్తుంది. దీంతో ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ స్థాయికి చేరుతాడు. ఈ ప్రయాణంలో లైగర్ ముంబయిలో బాగా డబ్బు ఉన్న ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. వీళ్లిద్దరు దగ్గరవుతున్న సమయంలో మైక్‌టైసన్ ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది మైక్ టైసన్‌కు, లైగర్‌కు సంబంధం ఏంటి అదే మొత్తం స్టోరీ అని పూరీ చెప్పాడు.
దీంతో లైగర్ స్టోరీపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. లైగర్‌లో విజయ్‌కి తల్లిగా రమ్యకృష్ణ ఊరమాస్ పాత్రలో నటించింది. కొడుకును సపోర్ట్ చేస్తూనే..తప్పు చేస్తే తాట తీసే క్యారెక్టర్‌లో కనిపించింది. విషు రెడ్డి విలన్ పాత్రలో నటించాడు. మరి మైక్ టైసన్ విలన్‌గా కనిపించనున్నాడా? లేదా లైగర్‌కు తండ్రిగా నటించాడా? అనేది తెలియాల్సి ఉంది.
ట్రైలర్‌లో సినిమా స్టోరీ పాయింట్ ఏమాత్రం రివీల్ చేయలేదు. కేవలం యాక్షన్, డైలాగ్స్‌తో నింపేశారు. ఇది ఒక మ్యూజిక్ వీడియోలా ఉంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఉద్దేశపూర్వకంగానే కథను తెలియనివ్వలేదని చిత్రబృందం ఇటీవల తెలిపింది. స్టోరీ ఏంటో చెప్తే సినిమా చూసేటప్పుడు ఆ కిక్ ఉండదు. అందుకే సస్పెన్స్‌లో పెట్టినట్లు తెలిపారు. ట్రైలర్ చేయాల్సిన పని అది చేసింది. చాలామందికి రీచ్ అయింది అని అన్నారు.
ట్రైలర్‌లో అసలు మేము ఏం చెప్పలేదు. సినిమా చూసినప్పుడు మీరు సర్‌ప్రైజ్ అవుతారని విజయ్ తాజాగా చెప్పాడు. అదేవిధంగా మైక్‌టైసన్‌ను సినిమా కోసం చాలా ఉపయోగించుకున్నాము. ఆయన సినిమాకు చాలా ప్లస్ అవుతాడని తెలిపాడు. ఇలా ట్రైలర్‌లో స్టోరీ తెలియలేదు అని ప్రేక్షకుల నుంచి వచ్చిన కామెంట్స్‌కి సమాధానంగానే డైరెక్టర్ పూరీ కథలో కొంత కంటెంట్‌ను రివీల్ చేశాడు. కానీ అసలు స్టోరీ తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అన్నాడు.
కరోనాకు ముందు ప్రారంభమైన లైగర్ సినిమా షూటింగ్ చాలాకాలం వాయిదా పడ్డ తర్వాత మొత్తానికి ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కాబోతుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. చిత్రబృందం సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉంది. మరికొన్ని గంటల్లో దీని ఫలితం ఏంటో తేలిపోనుంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?