• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మీ జీవితానికి మీరే హీరో; పూరీ జగన్నాథ్

  వచ్చిన అవకాశాలను వదులుకోకూడదని, మీ జీవితాలకు మీరే హీరో అని డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్‌’లో యూత్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘యువతలో విపరీతమైన బలం ఉంటుంది. వద్దన్న పనే చేస్తారు. భవిష్యత్‌పై బెంగ ఉండదు. మీలాంటి యువతే మేథావులకు కావాలి. కానీ ధర్నాలు, ఉద్యమాలు అంటూ మిమ్మల్ని కొంతమంది పక్కదోవ పట్టిస్తారు. కానీ మీరు గుర్తించి తిరగాలి. జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు.’’ అంటూ పూరీ పేర్కొన్నారు.

  పూరీ ‘తడ్కా’ మ్యూజింగ్

  దర్శకుడు పూరీ జగన్నాథ్ తన మ్యూజింగ్స్‌ను మళ్లీ ప్రారంభించారు. లైగర్ సినిమా కారణంగా కొంత విరామం ఇచ్చిన పూరీ తడ్కా అనే విషయం గురించి ప్రస్తావించారు. తడ్కా అంటే తాలింపు అని అర్థం. కానీ, పూరీ మాత్రం దీన్ని మనుషుల ప్రవర్తనకు లింక్ పెట్టాడు. ఏదైనా పనికోసం ఓ వ్యక్తిని మరొకరి దగ్గరికి పంపిస్తే అవతలి వ్యక్తి ఏమన్నాడో తప్పా మిగతాదంతా చెబుతుంటారని పూరి తెలిపారు. ప్రతి ఒక్కరూ తడ్కా స్పేషలిస్టులంటూ వ్యాఖ్యానించారు.

  ‘టెంపర్’ క్లైమాక్స్ అది కాదట..!

  నటుడిగా జూ.ఎన్టీఆర్ విశ్వరూపం చూపించిన సినిమా ‘టెంపర్’. విభిన్న షేడ్స్‌ని చూపిస్తూ మాస్ డైలాగులతో అలరించాడు. ఈ సినిమాకు క్లైమాక్స్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అయితే, తొలుత దర్శకుడు పూరీ జగన్నాథ్ క్లైమాక్స్‌ని వేరే విధంగా ప్లాన్ చేశాడట. కోర్టు బయట ఫైట్ సీన్‌తో సినిమాను ముగించేద్దామని అనుకున్నాడట. కానీ, ఈ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ చేసిన సూచన మేరకు సన్నివేశాలను మార్చాడట. రేప్ కేసులో తనని 5వ నిందితుడిగా ఎన్టీఆర్ ప్రకటించే ఆలోచనని వంశీనే ఇచ్చాడట. ఈ సీన్‌తో ప్రేక్షకుడు … Read more

  పార్టీ మూడ్‌లో ఇస్మార్ట్ శంకర్ భామ

  పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో వరంగల్ అమ్మాయిగా నటించి ప్రేక్షకుల మెప్పును పొందిన హీరోయిన్ నభా నటేశ్. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బతుకే సో బెటర్ వంటి సినిమాల్లో కనిపించి అలరించింది. తాజాగా ఈ అమ్మడి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలో నభా నటేశ్ చిల్ అవుతోంది. కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం నభా నటేశ్ చేతిలో ప్రాజెక్టులేమీ లేవు. అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అప్పట్లో … Read more

  పూరీ జగన్నాథ్‌కి చిత్రపరిశ్రమ మద్దతు

  లైగర్‌ సినిమా డిస్టిబ్యూటర్ల వ్యవహారంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు చిత్రపరిశ్రమ మద్దతుగా నిలుస్తోంది. డబ్బులు తిరిగి చెల్లించడం నిర్మాతలకు చెందిన అంశమని వారి ఇష్టం, ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించమనే హక్కు డిస్టిబ్యూటర్లకు లేదన్నారు. వారు నిర్మాతలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. లైగర్‌ ఫ్లాప్‌ పరిహారం కోసం పూరీ ఇంటివద్ద ధర్నా చేసేందుకు ప్రయత్నించగా.. జగన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  జిమ్‌లో 100 స్క్వాట్లు తీశా: పూరీ

  లైగర్ పరాజయాన్ని చూసి బాధపడలేదని.. సినిమా చేస్తున్నంత కాలం చాలా ఎంజాయ్ చేశానని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెప్పాడు. చిరంజీవిని ఇన్‌స్టాగ్రాంలో ఇంటర్వ్యూ చేసే సమయంలో తన మనసులో మాటని పూరీ పంచుకున్నాడు. శుక్రవారం సినిమా విడుదలైతే.. సోమవారం జిమ్‌కి వెళ్లి 100 స్క్వాట్లు తీశానని పూరీ చెప్పాడు. తరువాతి సినిమాకు మరింత బలంగా సన్నద్ధం కావడం కోసమే ఇలా చేశానన్నాడు. ఓటమి గురించి నెల రోజుల కంటే ఎక్కువగా ఆలోచించనన్నాడు. కాగా, భారీ అంచనాల మధ్య విడుదలై లైగర్ పరాజయాన్ని మూటగట్టుకుంది.

  చిరుతో పూరీ జగన్నాథ్ సినిమా..?

  చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుంది. చిరు రీఎంట్రీ సినిమాగా ప్లాన్ చేసిన ‘ఆటోజానీ’ స్టోరీని మించి కొత్త కథ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వెల్లడించాడు. గాడ్‌ఫాదర్‌ సక్సెస్ అనంతరం చిరంజీవిని పూరీ జగన్నాథ్ ఇంటర్వ్యూ చేశారు. చర్చా సమయంలో ‘ఆటోజానీ’ని ఏం చేశావ్ అని పూరీని చిరు అడిగారు. ‘అది పాత కథ. ఇప్పుడు అంతకంటే మంచి కథను మీకోసం రెడీ చేస్తా. త్వరలో మిమ్మల్ని కలిసి వినిపిస్తా’ అని పూరీ బదులిచ్చాడు. మరి … Read more

  ‘పూరీ’ యాక్టింగ్ చేయాల్సిందే..!

  ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ‘పూరీ జగన్నాథ్’. ఈ దర్శకుడిలో మంచి నటుడు ఉన్నాడని.. కెమెరా వెనకాలే కాకుండా తెరపై కూడా రాణించగలడని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. తాజాగా విడుదలైన ‘గాడ్‌ఫాదర్‌’లో జర్నలిస్టుగా పూరీ అదరగొట్టాడు. అంతకుముందు ఒకట్రెండు సినిమాల్లోనూ కాసేపు మెరిశారు. కానీ, చిరు సినిమాతో ఈ డైరెక్టర్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఏంటో తెలిసిపోయిందని చెబుతున్నారు. దర్శకత్వంపైనే కాకుండా నటనపై కూడా దృష్టి సారించాలని పూరీకి సూచిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా పూరీ గడ్డు కాలం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ వాదన బలంగా వినిపిస్తోంది.

  పూరి తరువాతి సినిమా అతనితోనే ?

  ‘లైగర్’ మూవీ అట్టర్ ఫ్లాప్ అవడంతో పూరి సైలెంట్ అయిపోయాడు. తన తరువాతి సినిమా ఎవరితో చేయాలనే దానిపై సందిగ్ధంలో పడ్డాడు. పలువురు హీరోలను సంప్రదించినా ఎవరూ రెస్పాండ్ కాకపోవడంతో, తన కొడుకుతోనే సినిమా చేసేందుకు పూరి సిద్దమయ్యాడట. అందుకోసం గోవా వెళ్లి కథ సిద్ధం చేస్తున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

  మరో ప్రాజెక్టును వదులుకున్న రౌడీ బాయ్?

  లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ అంచనాలన్నీ తలకిందుల య్యాయి. ఈ సినిమా అనంతరం విజయ్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పూరీతో చేయబోయే ‘జనగణమన’ సినిమాకు నో చెప్పాడు. తాజాగా సుకుమార్‌తో చేయబోయే సినిమాను కూడా విజయ్ వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని విజయ్‌తో చేయాలని సుక్కుకు బన్నీ ప్రతిపాదించాడట.