పూరీ జగన్నాథ్ ఒక మాస్ డైరెక్టర్‌గా గతంలో బెస్ట్ డైరెక్టర్స్‌గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిజం చూపించాలంటే, హీరోలతో పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పించాలంటే అది పూరీనే. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరూ ఆయనతో ఒక్క సినిమా చేయాలని అనుకునేవారు. పూరీ హీరోల ఎలివేషన్ మామూలుగా ఉండదు. రవితేజ, అల్లు అర్జున్, మహేశ్ బాబును మాస్ హీరోలుగా మార్చింది పూరీ అనే చెప్పుకోవాలి. ఇక టెంపర్‌లో కూడా ఎన్‌టీఆర్ ఒక విభిన్నమైన పాత్రలో చూపించాడు. పోకిరి సినిమాను సల్మాన్‌ఖాన్ హిందీలో వాంటెడ్‌గా తెరకెక్కించాడు. ఆ సినిమాతో సల్మాన్ కెరీర్ మళ్లీ పుంజుకుంది. కానీ అలాంటి స్టోరీ ఇచ్చిన పూరీ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. అతడు చెప్పే కథల్లో క్లారిటీ ఉండట్లేదు అంటున్నారు. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కోవడంతో పాటు ఆర్థికంగా నష్టాల్లో మునిగిపోయాడు.
టెంపర్ తర్వాత పూరీ కథల్లో క్లారిటీ మిస్ కావడంతో పెద్ద హీరోలెవరూ ఆయనతో సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో చిన్న హీరోలతో సినిమాలు చేయడం ప్రారంభించాడు. అలా చేసిన హార్ట్ఎటాక్, ఇజం, రోగ్, లోఫర్, పైసా వసూల్ ఇలా సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిల్చాయి. ఆ సమయంలో రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తీసి కాస్త కోలుకున్నాడు. కానీ ఆ సినిమాతో పూరీ కంటే రామ్‌కు ఎక్కువగా పేరొచ్చింది. అయితే నిర్మాతగా మాత్రం పూరీ జగన్నాద్ లాభపడ్డాడు.
2020లో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ లైగర్ కథ గురించి చర్చించుకున్నారు. అప్పుడే ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించారు. కానీ కరోనా రావడంతో సినిమా చాలా ఆలస్యమయింది. ప్రారంభం నుంచి లైగర్‌పై భారీ అంచనాలను పెంచుకుంటూ వచ్చారు. పోస్టర్లు, టీజర్లతో ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేశారు. మొదటిసారిగా ఇండియన్ సినిమాలో మైక్ టైసన్ నటిస్తున్నాడని చెప్పడంతో అందరూ ఒక రేంజ్‌లో ఊహించుకున్నారు. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డితో అప్పటికే సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా క్రేజ్ వచ్చింది. ఇక దానికి పూరీ తోడుకావడం, పాన్ఇండియా సినిమా అని ప్రకటించడంతో ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
కానీ లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మారడంతో పూరీతో పాటు పూరీ కనెక్ట్స్ సహ నిర్మాత ఛార్మీ కోట్లలో నష్టపోయారు. రూ.70 కోట్లు పెట్టి సినిమా తీస్తే రూ.30 కోట్లు కూడా రాలేదు. డిస్ట్రిబ్యూటర్లకు ఇది భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ పూరీ కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆయనతో సినిమా చేసేందుకు హీరోలెవరూ ముందుకొస్తారో చూడాలి. రామ్‌తో మళ్లీ ఒక సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రచారం జరిగింది. కానీ లైగర్ డిజాస్టర్ తర్వాత రామ్ పూరీతో సినిమా చేస్తాడా. ఎందుకంటే రామ్ గత సినిమాలు రెడ్, ది వారియర్ కూడా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు విజయ్, పూరీ కాంబోలో ప్రకటించిన జనగణమన సినిమాను కూడా నిలిపివేశారు.
దీంతో లైగర్ ఫ్లాప్ అందరికంటే ఎక్కువగా పూరీకి ఎఫెక్ట్ అయిందనే చెప్పాలి. ఆయన తర్వాత చేయబోయే సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలి. వేరే ఆప్షన్ లేదు. కానీ అసలు ఏ హీరో పూరీకీ డేట్స్ ఇస్తాడు. ఏ నిర్మాత ముందుకొస్తాడో చూడాలి. మంచి సినిమాతో పూరీ మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు, త్వరలో అది జరగాలని కోరుకుందాం.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!