గీతాగోవిందం సీక్వెల్ పనులు ప్రారంభం!
టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గీత గోవిందం’ సీక్వేల్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నాగ చైతన్యతో చేయాల్సిన సినిమా రద్దు కావడంతో డైరెక్టర్ పరుశురామ్ సీక్వేల్‌పై దృష్టిసారించినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా చకచకా రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. హిట్ కోసం ఎదురుచూస్తున్న గీతాఆర్ట్స్‌కు, లైగర్‌తో ఫ్లాప్ అందుకున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా కీలకం కానుంది. గీతా గోవిందం-2 నిర్మాణ వ్యయం 130కోట్లుగా ఉండొచ్చని చిత్ర బృందం అంచనా వేస్తోంది.