పవన్ కళ్యాణ్.. సినిమా సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిన కెరటం. ఆయన సినిమా తీస్తే.. ప్రేక్షకులకు పండగొస్తుంది. చిరునవ్వు నవ్వితే.. అందరి మొఖాల్లో ఆనందమొస్తుంది. మెడపై చేయి నిమిరితే.. అభిమానులకు కొండంత బలమొస్తుంది. సినీ ఇండస్ట్రీలో తనొక ఫైటర్. అమ్మాయిల మదిని దోచే లవర్. విలన్లకు చెమట పుట్టించే ఫయర్.
ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఆయన సొంతం. అయితే, పవన్ వద్దనుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బ్లస్టర్లుగా నిలిచాయి. అందులో నటించిన వారికి గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా YouSay తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ కథనం మీకోసం.
ఇడియట్..పోకిరి..
బద్రి వంటి బంపర్ హిట్ ని పవర్ స్టార్ కి అందించారు పూరీ జగన్నాథ్. అయితే పూరీ తీసిన పోకిరి, ఇడియట్, అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి.. వంటి చిత్రాలూ మహేశ్ బాబు, రవితేజ కెరీర్ లను మలుపుతిప్పాయి. ఈ మూడింటినీ పవన్ వద్దనుకున్నారట. స్క్రిప్టులు నచ్చినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారని దర్శకుడు పూరీ చెబుతుండేవారు. అవే సినిమాలను పవన్ చేసి ఉంటే.. ఊహకే అందని స్టార్ డమ్ దక్కేదేమో..!
అతడు.. ద మోస్ట్ వాంటెడ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ చాలా దగ్గరి మిత్రులన్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. అయితే, వీటి కంటే ముందు త్రివిక్రమ్ అతడు కథను వినిపించారట. కథ వింటుండగా పవన్ నిద్రపోయారని.. దీంతో తాను అక్కడినుంచి వెనుదిరిగినట్లు త్రివిక్రమ్ గతంలో చెప్పారు. టెలివిజన్ రేటింగులలో అతడు సినిమా పెను విధ్వంసమే సృష్టించింది. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్ లు, మహేశ్ బాబు నటన, ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లాజికల్ కామెడీ.. ప్రేక్షకుడిని టీవీకి కట్టిపడేశాయి.
సీతమ్మ వాకిట్లో.. చిన్నోడిగా..!
కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యమిచ్చే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. నవతరంలో మల్టీస్టారర్ సినిమాకు ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అయితే చిన్నోడిగా నటించి అలరించిన మహేశ్ బాబు స్థానంలో మొదటగా పవన్ నే తీసుకుందామని అనుకున్నారట. పవన్ వద్దనుకోవడంతో మహేశ్ బాబు ఖాతాలోకి ఈ విజయం వెళ్లిపోయింది.
మిరపకాయ్ ఘాటు మిస్సయింది
మాస్ ఆడియెన్స్ ను తన టేకింగ్ తో మెప్పించే హరీశ్ శంకర్.. తన మిరపకాయ్ సినిమాను పవన్ తోనేే తీద్దామని అనుకున్నాడట. స్వతహాగా పవన్ అభిమాని అయిన హరీశ్ శంకర్.. మిరపకాయ్ కథను పవన్ కు వినిపించారట. సినిమాలో పవన్ టెంపరితనం బాగా పండి.. మిరపకాయ్ ఘాటెక్కిస్తుందని అనుకున్నాడట దర్శకుడు. కానీ పవర్ స్టార్ తిరస్కరించడంతో రవితేజతో తీసి మంచి విజయాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పవన్ కెరీర్ నే మలుపుతిప్పాడు ఈ యువ డైరెక్టర్.
ఇవి వస్తే ఇంకెలా ఉండేదో..!
పవన్ సైన్ చేసిన సినిమాల్లో కొన్ని పట్టాలెక్కలేదు. వివిధ కారణాల వల్ల ఇవి అర్ధంతరంగా ఆగిపోయాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలోని ‘కోబలి’, ఏఎమ్ రత్నం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘సత్యాగ్రాహి’, కాహో నా ప్యార్ హై రీమేక్ ‘చెప్పాలని వుంది’ వంటి సినిమాలున్నాయి. ఈ సినిమాలు పూర్తయితే పవన్ కి మంచి విజయాలు వచ్చుండేవని సినీ వర్గాల్లో చర్చ నడిచింది.
పవన్ తిరస్కరించిన సినిమాల్లో నటించి ఉంటే ఎంతో బాగుండేదని అభిమానులు ఇప్పటికీ అనుకుంటుంటారు. కానీ ఏం చేస్తాం.. బ్యాడ్ లక్. అయితేనేం, చిత్రసీమ ఎన్నటికీ మరచిపోని ఇండస్ట్రీ హిట్లను పవన్ అందించారు. ఎవరూ అందుకోని స్టార్ డమ్ ను ఆయన సొంతం చేసుకున్నారు. హ్యాట్సాఫ్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి