• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబుతో పవన్‌ కీలక భేటి

    HYD: తెదేపా అధినేత చంద్రబాబును జనసేనాని పవన్‌ కల్యాణ్ హైదరాబాద్‌లో కలిశారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గంటన్నరకు పైగా 2 రాష్ట్రాల రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఏపీకి సంబంధించి 10 అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణపై నేతలు చర్చించారు.

    ‘అందుకే వరుణ్‌ పెళ్లికి వెళ్లడం లేదు’

    వరుణ్‌ తేజ్‌ పెళ్లికి తాను ఎందుకు హాజరుకావడం లేదో నటి రేణూ దేశాయ్‌ ఓ ఇంటర్యూలో తెలిపారు. ‘వరుణ్‌ నా ముందే పెరిగాడు. నా ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయి. నిహారిక పెళ్లికి కూడా నేను వెళ్లలేదు. పిల్లల్ని పంపించా. ఒకవేళ వరుణ్‌ పెళ్లికి వెళ్తే అసౌకర్యంగా ఫీలవుతారు’ అని పేర్కొన్నారు. వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం నవంబరు 1న ఇటలీలో జరగనుంది. ఇప్పటికే వరుణ్‌, లావణ్యల కుటుంబాలు, పవన్‌, రామ్‌ చరణ్‌, ఉపాసన అక్కడికి … Read more

    భార్యతో ఇటలీ బయల్దేరిన పవన్‌

    వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిల పెళ్లి కోసం పవన్‌ కల్యాణ్ కుటుంబసమేతంగా ఇటలీ బయల్దేరారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌ విమానాశ్రయంలో పవన్ సింపుల్ లుక్‌లో కనిపించారు. పవర్‌ స్టార్‌ న్యూలుక్‌ బాగుందంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. హీరో వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్‌ 1న ఇటలీలో జరగనుంది. ఇప్పటికే రామ్‌ చరణ్‌, ఉపాసన అక్కడికి చేరుకున్నారు. అలాగే నిన్న వరుణ్ తేజ్‌, లావణ్య కూడా ఇటలీ వెళ్లారు. Off to Italy 🔥🔥✈️✈️@PawanKalyan pic.twitter.com/hxXxyJRgjv — Pawanism Holics (@PawanismHolics) … Read more

    తెలంగాణలో కలిసి పనిచేద్దాం: అమిత్‌షా

    తెలంగాణలో భాజపాతో కలిసి పనిచేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూచించారు. నిన్న అమిత్‌షాతో భేటి అయిన పవన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 40 నిమిషాలపాటు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్‌షా సూచించినట్లు తెలిసింది. అందుకు కిషన్‌రెడ్డి, పవన్‌ అంగీకరించారని సమాచారం. అంతర్గతంగా పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని వారు అమిత్‌షాకు చెప్పినట్లు సమాచారం. జనసేన 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది.

    నేడు భాజపా అగ్రనేతలతో పవన్ భేటి

    తెలంగాణ ఎన్నికల వేళ భాజపాతో పొత్తు అంశంపై చర్చించేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. భాజపా పెద్దలతో చర్చించనున్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ కూడా ఈ భేటిలో పాల్గొంటారని సమాచారం. ఇందులో GHMC సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, జనసేన నేతలు ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని భాజపా నేతలు వ్యక్తపరుస్తున్నారు.

    నేడు టీడీపీ, జనసేన జేఏసీ తొలి భేటీ

    నేడు రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ భేటికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ హాజరవుతారు. మ. 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ భేటిలో పవన్‌, లోకేశ్‌తో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొంటారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహార్‌ సమావేశానికి హాజరవుతారు.

    టీడీపీ- జనసేన తొలి భేటీ డేట్ ఖరారు

    టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 23న రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి సమావేశం జరగనుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లోకేశ్- పవన్ కళ్యాణ్‌ల అధ్యక్షతన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు ప్రకటించాయి.

    జనసేన నేతలతో నేడు పవన్ భేటీ

    జనసేన ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్‌ నేడు సమావేశం కానున్నారు. టీడీపీ, జనసేన నేతల సమన్వయ కమిటీ సమావేశంపై చర్చ జరిపే అవకాశం ఉంది. దసరా తరువాత వారాహి యాత్ర చేపట్టే యోచనలో పవన్‌ ఉన్నారు. షెడ్యూల్ ఖరారుపై పార్టీ నేతలతో జనసేనాని మాట్లాడనున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు నేపథ్యంలో పార్టీ నాయకులు వ్యవహరించాల్సిన తీరుపై సూచనలు చేయనున్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు దిశానిర్దేశం చేయనున్నారు.

    తెలంగాణలో పోటీపై 2 రోజుల్లో చెప్తా: పవన్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈసారి పోటీ చేయకపోతే.. క్యాడర్ బలహీనమయ్యే ప్రమాదం ఉందని పవన్‌కు నేతలు వివరించారు. అయితే కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తానన్న పవన్, రెండు మూడు రోజుల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్.. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎన్నికల్లో కలిసి వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

    అకీరా నందన్‌ను హీరో చేయాలి: విజయేంద్ర ప్రసాద్

    పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ల కొడుకు అకీరా నందన్‌పై దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘రేణు దేశాయ్ గారు మీరు తెలుగు సినిమాలు చేయకపోయినా, తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు. కానీ మీరు మాత్రం మీ అబ్బాయి అకీరా నందన్‌ను హీరోగా చేయాలి. అకీరా నందన్ చేసే మూవీలో అతని తల్లి పాత్రను కూడా మీరే చేయాలనేదే నా మాట’ అంటూ తన మనసులో మాట బయట … Read more