తెలంగాణలో పోటీపై 2 రోజుల్లో చెప్తా: పవన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈసారి పోటీ చేయకపోతే.. క్యాడర్ బలహీనమయ్యే ప్రమాదం ఉందని పవన్‌కు నేతలు వివరించారు. అయితే కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తానన్న పవన్, రెండు మూడు రోజుల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్.. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎన్నికల్లో కలిసి వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.