• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టైగర్ నాగేశ్వరరావు ట్విట్టర్ రివ్యూ

  మాస్ మహారాజ రవితేజ నటించిన టైగర్‌నాగేశ్వరరావు మూవీ నేడు విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ కామెంట్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘రవితేజ మాస్ యాక్షన్ అదిరిపోయింది. ఫస్టాఫ్ విజువల్ ఫీస్ట్. హీరో ఇంట్రడక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. లవ్‌ ట్రాక్ బాలేదు. సెకండాఫ్ సాగదీసినట్లు ఉంది. పాటలు మెప్పించవు. లెంగ్తీ రన్‌ టైం సినిమాకు మైనస్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. పూర్తి రివ్యూ మరికాసేపట్లో..

  టైగర్ నాగేశ్వరరావు రన్ టైం ఫిక్స్

  దసరా బరిలో నిలవనున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి U/A క్లీన్ సర్టిఫికెట్ పొందింది. ఇక సినిమా టోటల్ రన్‌ టైం 2 గంటల 52 నిమిషాలకు కుదించారు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని డెరెక్టర్ వంశీ తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వజ హీరోయిన్లుగా నటించారు. రేణుదేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

  టైగర్ నాగేశ్వరరావు ‘రన్ టైం’ లాక్

  మాస్ మహారాజా రవితేజ నుపుర్ సనన్ జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా రన్ టైం తాజాగా లాక్‌ అయింది. టైగర్ నాగేశ్వరరావు రన్‌ టైం 3 గంటల 2 నిమిషాల నిడివితో కట్‌ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. సినిమా ప్రమోషన్లు సైతం జోరుగా సాగుతున్నాయి. హిందీలో ప్రమోషన్ కోసం రవితేజ స్వయంగా రంగంలోకి దిగాడు.

  క్రికెట్ కామెంటరీతో అలరించిన రవితేజ

  ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రవితేజ క్రికెట్ కామెంటరీ చెప్పారు. ఇతర వ్యాఖ్యాతలతో కలిసి ఓ వరల్డ్ కప్ మ్యాచ్‌కు రవితేజ కామెంటరీ చెప్పడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. విరాట్ కోహ్లీ యాటిట్యూడ్, దూకుడు అంటే తనకు ఇష్టమని ఈ సందర్భంగా రవిజేత అన్నారు. క్రికెటర్స్ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే సిరాజ్ బయోపిక్‌లో నటిస్తానని చెప్పారు. కాగా, వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్

  బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. గత సీజన్లకు భిన్నంగా ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపించి ఆశ్చర్యపరిచారు. వరుసగా 5 వారాల పాటు ఐదుగురు మహిళా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్ ఈ వారం శుభశ్రీ, గౌతమ్ కృష్ణలను ఒకేసారి ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. అంబటి అర్జున్, అశ్వినీశ్రీ, నయని పావని, పూజా మూర్తి, భోలే షావలి హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజతో పాటు హీరోయిన్స్ హౌజ్‌లో సందడి … Read more

  రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ విడుదల

  మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి రేణు దేశాయ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రేణు.. హేమలత లవణం అనే పాత్రలో నటిస్తున్నారు. ఈమేరకు ఆమె పేరుతో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు. మరి చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత నటిస్తున్న రేణు దేశాయ్.. సినిమాలో ఎలాంటి పాత్ర చేయనున్నదో అని ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నారు.

  టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ డేట్‌పై పోల్

  మాస్ మహారాజ రవితేజ హీరోగా నపూర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ట్విట్టర్‌ పోల్ నిర్వహించారు. టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్‌ను ఎప్పుడు విడుదల చేయాలో చెప్పాలంటూ రెండు డేట్స్ పెట్టి ఫ్యాన్స్‌ను కోరారు. అక్టోబర్ 3, సెప్టెంబర్ 27 తేదీల్లో ఎక్కువ మంది 27కు ఓటు వేశారు. మరి ఫ్యాన్స్ రెస్పాన్స్‌కు గౌరవమిచ్చి 27కు ట్రైలర్ రిలీజ్ చేస్తారో లేదో … Read more

  రూల్స్ రంజన్ సాంగ్ రిలీజ్ చేసిన రవితేజ

  యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నెహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రం నుంచి తాజాగా నాలుగో సింగిల్ లిరికల్ ‘దేఖో ముంబై సాంగ్‌’ను మాస్ మాహారాజ రవితేజ విడుదల చేశారు. సాంగ్ బాగుందని ప్రశంసించిన రవితేజ.. చిత్రం మంచి విజయం సాధించాలని ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. నాలో నేనే లేను, సమ్మోహనుడా పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా ఈ సినిమాకు అమ్రిష్ గణేష్ సంగీతం అందించారు. అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది. https://youtube.com/watch?v=R3LZx2fidU%26t%3D12s

  ఫ్యాన్స్‌తో రవితేజ ఫన్నీ చిట్ చాట్

  మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ ప్రమోషన్‌ను వినూత్నంగా చేపట్టారు. మూవీ రిలీజ్‌కు మరో 3 రోజులే సమయం ఉండటంతో అభిమానులను #ASKRAVANASURA ట్యాగ్‌తో ట్విట్టర్‌లో పలకరించాడు. కాసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెప్పి అలరించాడు. ఓసారి ఫ్యాన్స్‌కు రవితేజ మధ్య జరిగిన చిట్ చాట్ పరిశీలిద్దాం. చాట్ చూసేందుకు పైన YouSay Webపై క్లిక్ చేయండి. ASK RAVANASURA: రావణాసుర సినిమాలో ఆ క్యారెక్టరే నా ఫెవరేట్… ఫ్యాన్స్‌తో రవితేజ ఫన్నీ చిట్‌ చాట్

  యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న రావణాసుర ట్రైలర్

  మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. ఇప్పటికే 10 మిలియన్‌కి పైగా వ్యూస్‌ సాధించింది. ఈ సినిమాలో క్రిమినల్ లాయర్‌ పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌లో రవి కనిపించనున్నాడు. ఏప్రిల్‌ 7న విడుదలవుతున్న చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌ వర్క్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యూయేల్‌, దక్షా నగార్కర్‌, మేఘా ఆకాశ్, పూజిత పొన్నాడ ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు.