• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అదిరిపోయిన రావణాసుర ట్రైలర్

  రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం రావణాసుర. ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతుండటంతో ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలో లాయర్‌గా నటిస్తున్నాడు రవి. ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుుకుంటోంది. ఇందులో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్, అను ఇమాన్యూయెల్ నటిస్తున్నారు.

  దూసుకెళ్తున్న ‘ప్యార్‌లోన పాగల్’ సాంగ్

  రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల విడుదలైన ‘ప్యార్‌లోన పాగల్’ సాంగ్‌ యూట్యూబ్‌లో 30లక్షలకు పైగా వ్యూస్‌‌ని సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్దన్ రామేశ్వర్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఇందులోని ‘దశకంఠా రావణా’ టైటిల్‌ సాంగ్‌ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. రెండో పాటగా ఈ ‘ప్యార్‌లోన పాగల్’ అలరిస్తోంది. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  ధమాకా నుంచి దండ కడియాల్ సాంగ్ రిలీజ్

  శ్రీలీల, రవితేజ జోడికట్టి నటించిన సూపర్ హిట్ మూవీ‘ధమాకా’. ఈ మూవీ నుంచి తాజాగా ‘దండ కడియాల్’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ త్రినాథ్‌రావు డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ధమకా చిత్రంలో ఈ పాట మంచి మాస్ బీట్‌తో రూపొందింది. ఈ పాటను మీరు చూసేయండి.

  రవితేజ ‘రావణాసుర’ ఫస్ట్‌ గ్లింప్స్‌

  మాస్‌ మహారాజా రవితేజ బర్త్‌డే సందర్బంగా ఆయన నూతన చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైంది. ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘రావణాసుర’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  ఈ వారం(January 20) విడుదలవుతున్న తెలుగు చిత్రాలు, ఓటీటీ విడుదలలు 

  సంక్రాంతికి విడుదలైన సినిమాల మేనియా ఈ వారం కూడా కొనసాగుతోంది. పండుగకి విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో మరికొన్ని రోజుల పాటు విజయవంతంగా ఈ సినిమాలు థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి. అయితే, ఈ వారం పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. కానీ, ఓ సినిమా మాత్రం అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. విద్యవాసుల అహం- జనవరి 20 రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘విద్యవాసుల అహం’. మనికాంత్ దర్శకత్వం వహించాడు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన … Read more

  2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

  2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

  LIVE: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్

  మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విశాఖలో ఘనంగా జరుగుతోంది. ఆంధ్రా యూనివర్సిటీలో కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ ఇద్దరు కలిసి వేడుకకు హాజరయ్యారు. శృతిహాసన్‌కు అనారోగ్యం కారణంగా రాలేదని తెలుస్తోంది. చిత్రానికి బాబి దర్శకత్వం వహించగా…దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. జనవరి 13న సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

  విడుదలైన ‘మెగా మాస్’ పాట

  మెగాస్టార్, మాస్ మహారాజ కాంబినేషన్ పాట విడుదలైంది. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ పాట హుషారుగా సాగుతోంది. వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన నాలుగో పాట ఇది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రోల్ రైడా లిరిక్స్ రాయడంతో పాటు పాటను ఆలకించారు. మరో మాస్ సింగర్ రామ్ మిరియాల కూడా పాటను పాడాడు. కాగా, వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

  బండ్లన్న స్పీచ్‌.. మళ్లీ ఇరగదీశాడు

  బండ్ల గణేశ్ స్పీచ్‌కి అభిమానులు చాలామందే ఉంటారు. ఎందుకంటే ఆ మాటలు అలా పూణకాలు తెప్పిస్తుంటాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లలో స్పీచ్‌తో అలరించిన బండ్ల గణేశ్…రవితేజ ధమాకా సక్సెస్‌ మీట్‌లోనూ అదేస్థాయిలో రెచ్చిపోయారు. ఈ వేడుకకు తానే వస్తానని ఫోన్‌ చేసి నిర్మాతలకు చెప్పినట్లు వెల్లడించారు. రవితేజ ఎంతోమంది దర్శకులకు జీవితం ఇచ్చాడన్నారు. తనదైన ప్రాసలు, పంచ్‌లతో మరోసారి బండ్లన్న స్పీచ్‌ ఇరగదీశాడు అంటున్నారు.

  రవితేజ ‘ధమాకా’ ట్రైలర్ విడుదల

  రవితేజ డ్యుయల్ రోల్‌లో నటిస్తున్న ‘ధమాకా’ ట్రైలర్ విడుదలైంది. రెండు క్యారెక్టర్లలో రవితేజ ఒదిగిపోయాడు. మాస్ మహారాజ కామెడీ టైమింగ్ నవ్వులు పూయిస్తోంది. ఉద్యోగాలిచ్చే పారిశ్రామికవేత్తగా ఒక పాత్రలో.. ఉద్యోగం కోసం ఎదురు చూసే యువకుడిగా రవితేజ అదరగొట్టాడు. వీరిద్దరూ కలిసి ఒకే వేదికపైకి వచ్చిన తర్వాత ఏం జరిగబోతోందనే సస్పెన్స్‌తో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్‌గా శ్రీలల మరోసారి అలరించింది. కాగా, ఈ సినిమాను త్రినాథరావు నక్కిన తెరకెక్కించగా.. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.