• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధమాకా నుంచి మరో పాట విడుదల

    రవితేజ హీరోగా డ్యుయల్ రోల్‌లో వస్తున్న చిత్రం ‘ధమాకా’. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘డు..డు..వీడు ల్యాండుమైను లెక్క’ అంటూ సాగే ఈ పాటను పృథ్వీ చంద్ర ఆలపించారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. కాగా, ఈ సినిమాలోని మిగతా పాటలకు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. డిసెంబరు 23న మూవీ రిలీజ్ కానుంది.

    ఆకట్టుకుంటున్న ‘ధమాకా’ సాంగ్

    మాస్ మహారాజా హీరోగా నటించిన ‘ధమాకా’ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ‘వాట్స్ హ్యాపెనింగ్’ పాటను మూవీ మేకర్స్ విడుదల చేయగా, శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ విడుదల చేయడంతో రవితేజ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లోని మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించగా, డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు.

    ‘లచ్చి గాని పెళ్లి’ సాంగ్ లాంచ్ చేసిన రవితేజ

    సంజయ్, ప్రణవి మానుకొండ హీరో హీరోయిన్లుగా AR శ్రీధర్ తెరకెక్కించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. తాజాగా ఈ మూవీ నుంచి ‘లచ్చి గాని పెళ్లి’ అంటూ సాగే మొదటి పాటను మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించి పాటను పాడగా.. కాసర్ల శ్యామ్ బాణీలు అందించారు. జిత్తు మాస్టర్ కోరియోగ్రఫీ చేశాడు.

    పవర్ స్టార్ వద్దన్న సినిమాలు.. ఇండస్ట్రీ హిట్లు..!

    పవన్ కళ్యాణ్.. సినిమా సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిన కెరటం. ఆయన సినిమా తీస్తే.. ప్రేక్షకులకు పండగొస్తుంది. చిరునవ్వు నవ్వితే.. అందరి మొఖాల్లో ఆనందమొస్తుంది. మెడపై చేయి నిమిరితే.. అభిమానులకు కొండంత బలమొస్తుంది. సినీ ఇండస్ట్రీలో తనొక ఫైటర్. అమ్మాయిల మదిని దోచే లవర్. విలన్లకు చెమట పుట్టించే ఫయర్.  ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఆయన సొంతం. అయితే, పవన్ వద్దనుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బ్లస్టర్లుగా నిలిచాయి. అందులో నటించిన వారికి గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా YouSay … Read more

    ‘ధ‌మాకా!’ నుంచి రొమాంటిక్ గ్లింప్స్‌

    ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ధ‌మాకా మూవీ నుంచి నేడు రొమాంటిక్ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. హీరో-హీరోయిన్ ఇద్ద‌రు ఈ వీడియ‌లో క్యూట్ రొమాంటిక్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో అల‌రించారు. త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్‌మీడియా ఫ్యాక్ట‌రీ దీన్ని నిర్మిస్తుంది. త్వ‌ర‌లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    ‘డింపుల్ హయతి’ అందాల దమయంతి

    ‘డింపుల్‌ హయతి’, తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన అందాల తార. క్రాక్‌ సినిమాలో మాస్‌ సాంగ్‌తో కుర్రకారుకు మరింత దగ్గరైంది. తనది పాల వర్ణంతో మెరిసే చర్మ సౌందర్యం కాకపోయినా, మత్తు కళ్లు, మతి పోగొట్టే తేజస్సుతో కుర్రాళ్ల మనసు దోచేసింది. సినిమాల్లోనే కాకుండా సోషల్‌ మీడియాలోనే అందాల కనువిందు చేస్తుంటుంది. తాజాగా వంకాయ పువ్వు వర్ణంలో యద అందాలను ఆరబోస్తూ చేసిన ఓ ఫోటోషూట్‌ మగువలే ఈర్షపడేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.! Courtesy Instagram:dimple hayati

    ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫుల్ రివ్యూ

    నేడు ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దివ్యాంశ కౌశిక్, ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. శామ్ సీఎస్ సంగీతం అందించాడు. ట్రైల‌ర్‌, పాట‌ల‌తో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. మ‌రి సినిమా ఎలా ఉంది? అంచ‌నాల‌ను అందుకుందా లేదా? తెలుసుకుందాం కథేంటంటే.. 1995లో జ‌రిగిన క‌థ‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. రామారావు (ర‌వితేజ‌) అవినీతిని … Read more

    అదిరిపోయిన ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటిస్’

    మాస్ మహారాజ రవితేజ హీరోగా, శరత్ మండవ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, పాటలకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్’ అనే వీడియోను విడుదల చేశారు. ఫుల్ మాస్‌గా ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక … Read more

    థియేట‌ర్‌లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీమ్ ముచ్చ‌ట్లు

    ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ జులై 29న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం వ‌రుస‌గా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటుంది. తాజాగా డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ‌, ర‌వితేజ‌, వేణు తొట్టెంపుడి ఒక సినిమా థియేట‌ర్‌లో కూర్చొని రామారావు ఆన్ డ్యూటీ గురించి ముచ్చ‌టించారు. డైరెక్ట‌ర్ ప్ర‌శ్న‌లు వేస్తుండ‌గా ర‌వితేజ, వేణు ఫ‌న్నీగా స‌మాధానాలు చెప్తూ ఎంట‌ర్‌టైన్ చేశారు.

    ‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ సాంగ్ రిలీజ్

    ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ సాంగ్ రిలీజైంది. ఈ ప‌వ‌ర్‌ఫుల్ సాంగ్‌ను ల‌వితా లోబో పాడారు. శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిచాడు. ర‌జిషా, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా న‌టించారు. వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాకు శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రం జులై 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.