నేడు రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ థియేటర్లలో విడుదలైంది. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించాడు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. శామ్ సీఎస్ సంగీతం అందించాడు. ట్రైలర్, పాటలతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా లేదా? తెలుసుకుందాం
కథేంటంటే..
1995లో జరిగిన కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. రామారావు (రవితేజ) అవినీతిని అస్సలు సహించని రెవన్యూ ఆఫీసర్. ఒకరోజు అతడు తన మాజీ ప్రేయసి మాలిని (రజిషా విజయన్)ను కలుస్తాడు. తన భర్త మిస్ అయ్యాడని తనకు సాయం చేయాలని ఆమె కోరుతుంది. దీంతో రామారావు మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్‌లో సంచలన నిజాలు బయటపడతాయి. ఆ ఊర్లో అదేవిధంగా చాలామంది కనిపించకుండా పోయారని, గందపు చెక్కల స్మగ్లింగ్ దీనికి కారణమని తెలుసుకుంటాడు. మరి దీని వెనక ఎవరు ఉన్నారు. రామారావు ఈ కేసును ఎలా ఛేదిస్తాడనేదే కథ
విశ్లేషణ:
దర్శకుడు శరత్ మండవకు ఇది తెలుగులో మొదటి సినిమా. కథ, డైలాగ్స్ అన్ని సొంతంగా రాసుకున్నాడు. కథలో చాలా థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. అయితే వాటిని తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. కేవలం కథ ఆధారంగానే సినిమాను నడిపిస్తే బాగుండేది. కానీ రవితేజ మాస్ హీరో కావడంతో కమర్షియల్ మూవీకి కావాల్సిన హంగులను అన్నింటిని జోడించాడు. దీంతో కథ దారితప్పింది. మొదటి భాగంలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనప్పటినుంచి కథలో వేగం పెరుగుతుంది. రెండో భాగంలో దాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ అనవసరమైన యాక్షన్ సీన్స్, రవితేజ హీరోయిజాన్ని చూపించే ప్రయత్నం చేశారు. తొట్టెంపూడి వేణు చాలాకాలం తర్వాత రీ-ఎంట్రీ ఇవ్వడంతో ఆయన పాత్రపై ఆసక్తి పెరిగింది. కానీ ఆ రేంజ్‌లో వేణుకు పేరు తెచ్చే క్యారెక్టర్ అయితే కాదనే చెప్పాలి. కథానాయకుడికి ధీటుగా విలన్ పాత్ర బలంగా లేకపోడంతో కథ అంత ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదు.
ఎవరెలా చేశారంటే..
రవితేజ ఆయన పాత్రకు న్యాయం చేశాడు. యాక్షన్ సీన్సలో మరోసారి తన హీరోయిజాన్ని చూపించాడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో కూడా బాగా నటించాడు. హీరోయిన్లు రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. వేణు తొట్టెంపూడి నటన బాగున్నప్పటికీ అంత బలమైన పాత్ర కాదు. ఇక నాజర్, తణికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, తణికెళ్ల భరణి, నరేశ్, పవిత్రా లోకేశ్ వీళ్ల పాత్రలు పెద్ద చెప్పుకోతగ్గవి కాదు.
సాంకేతిక విషయాలు:
సినిమా నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. 1995 వాతావరణాన్ని చక్కగా చూపించాడు. శ్యామ్ సీఎస్ అందించిన పాటలు నిరాశపరిచాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కాస్త ఫర్వాలేదనిపించింది. మొత్తానికి దర్శకుడు శరత్ మండవ మొదటి సినిమాతోనే అటు కమర్షియల్ సినిమా, ఇటు కంటెంట్ సినిమా కాకుండా ఒక బోరింగ్ కథను తెరకెక్కించాడు.
బలాలు:
రవితేజ
ఇన్వెస్టిగేషన్ సీన్స్
బీజీఎం
బలహీనతలు:
స్క్రీన్‌ప్లే
కథనం
అనవసరమైన హంగులు
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం