• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కైకాల పార్థివదేహానికి సీఎం నివాళులు

  సినీ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు. అనంతరం కైకాల సత్యనారాయణ కుమారులను, కూతుళ్లను, కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. నటుడిగా, ఎంపీగా ఉన్న కైకాలతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. ‘‘సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గొప్ప వ్యక్తి. ఈరోజు వారు మరణించడం చాలా బాధాకరం. చలనచిత్ర రంగంలో విభిన్న పాత్రలు పోషించారు. తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్నిచూరగొన్నారు. కైకాల మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు” అని … Read more

  పార్లమెంటులో జారిపడిన శశిథరూర్

  కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాలికి గాయమైంది. పార్లమెంటులో మెట్లపై నుంచి దిగుతుండగా ఆయన జారి పడ్డారు. దీంతో ఎడమ కాలు మడమ కాస్త బెణికింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘మెట్లపై నుంచి జారిపడ్డాక పెద్దగా పట్టించుకోలేదు. కానీ, సమస్య తీవ్రమైంది. ఆసుపత్రికి వెళ్లడంతో కట్టు కట్టారు. ఈ ఘటనతో అసౌకర్యానికి గురయ్యా. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా. నియోకవర్గంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కాలేక పోతున్నా’ అంటూ ట్విటర్‌లో వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

  మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి

  స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు మంత్రివర్గంలోకి ప్రవేశించారు. యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రిగా ఉదయనిధి బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఉదయనిధితో ప్రమాణ స్వీకారం చేయించారు. చెపాక్- తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఉదయనిధి స్టాలిన్ గతేడాది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ గౌరవాన్ని మంత్రి పదవిలా కాకుండా.. ఓ బాధ్యతలా స్వీకరిస్తానని ఉదయనిధి ట్విటర్ వేదికగా వెల్లడించారు. డీఎంకే మంత్రివర్గంలో ఉదయనిధికి చోటు కల్పించాలని పార్టీ నేతలు, ఎమ్మెల్యేల నుంచి ఎం.కె.స్టాలిన్ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. దీంతో కుమారుడిని మంత్రివర్గంలోకి చేర్చుకోక తప్పలేదు. ఉదయనిధి … Read more

  అమెరికా అధ్యక్ష బరిలో ట్రంప్

  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దేశం మళ్లీ పురోగమిస్తుందన్నారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చానని..మిగతా అధ్యక్షుల్లా కాకుండా వాటిని నిలబెట్టుకున్నానని వెల్లడించారు. రెండు సంవత్సరాల క్రితం అమెరికా గొప్ప దేశమని.. ఇప్పుడు మరోసారి అలా మారుతుందన్నారు. దేశ ప్రజల కలల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. దేశ గౌరవాన్ని, కీర్తిని తిరిగి తీసుకురావటానికి మళ్లీ అధ్యక్షుడిని అవుతానని పేర్కొన్నారు.

  ఏంటీ ఒక్క సీటుకే

  మునుగోడులో గెలుపుతో తెరాస నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసి వస్తే ప్రజాతీర్పు కోరామని…12 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా లాక్కున్న కేసీఆర్‌ వారితో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. ఉపఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పాగా వేసి ఓటుకు రూ. 10 వేలు పంచారని ఆరోపించారు. అయినా.. తెరాసకు వచ్చిన మెజార్టీ 11 వేలే అన్నారు.

  కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: బండి

  మునుగోడు ఉపఎన్నిక ఫలితాల వెల్లడిలో సీఈఓ వికాస్ రాజ్ తీరు అనుమానస్పదంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెరాస ఆధిక్యంలోకి వస్తే తప్పా ఫలితాలు ఇవ్వడం లేదన్నారు. భాజపా లీడింగ్ లోకి వచ్చినా చెప్పట్లేదని పేర్కొన్నారు.మెుదటి రౌండ్ తర్వాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలు చెప్పేందుకు ఎందుకు ఆలస్యం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫలితాల్లో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

  మునుగోడు గెలుపు ధీమాతోనే సీఎం ప్రెస్‌మీట్‌

  తెలంగాణ, ఏపీ, దిల్లీ, రాజస్థాన్‌ ప్రభుత్వాలను కూల్చేందుకు భాజపా కుట్ర చేసిందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి మోదీ, అమిత్‌ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నిక ముగియటంతో పాటు ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ అనుకూలంగా రావటంతో సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టారని కొందరు చర్చిస్తున్నారు. తెరాస గెలుస్తుందనే ధీమాతోనే ఘాటుగా స్పందించారని భావిస్తున్నారు. మరి నిజంగా ఎవరు గెలుస్తారో తెలియాలంటే నవంబర్‌ 7వ తేదీ వరకు ఆగాల్సిందే.

  కేసీఆర్‌కు కిషన్‌ రెడ్డి కౌంటర్‌

  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తెరాసకు ఆదరణ తగ్గుతుండటంతోనే అసహనానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో చెప్పిందే చెప్పారని వ్యాఖ్యానించారు. అమిత్‌ షా, జేపీ నడ్డా, సంతోష్‌లపై ఆరోపణలను ఖండించారు. ఈ విషయంలో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్యం గురించి కేసీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు.

  జగన్‌ రెడ్డి రాక్షసుడు: చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ రెడ్డి రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ఆయన్ను అరెస్ట్‌ చేయడం బాధ కలిగించిందన్నారు. అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని..ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని పేర్కొన్నారు. పోలీసులు దొంగల్లా ఇళ్లమీదపడి అరెస్ట్‌ చేయటం దారుణమని వ్యాఖ్యానించారు.

  ఎమ్మెల్యేల కొనుగోలుపై పాన్‌ ఇండియా చిత్రం: కేటీఆర్‌

  తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో త్వరలోనే పాన్‌ ఇండియా చిత్రం చూపిస్తామంటూ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నలుగురిని మునుగోడు సభలో భాజపాలో చేర్చుకుందామనుకున్నారని…అలా జరగకపోవటంతో జేపీ నడ్డా సభ రద్దు చేశారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగిందన్నారు. తెరాసను దెబ్బతీయాలన్న కమలం కుట్రలను సీఎం కేసీఆర్‌ తిప్పికొట్టారని కేటీఆర్‌ వెల్లడించారు.