ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన తెలంగాణలో ఎంతో మంది రాజకీయ నేతలు దేశ రాజకీయాలను శాసించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన P.V నరసింహారావు ఏకంగా దేశానికి ప్రధానిగా చేసి అనేక సంస్కరణలకు నాంది పలికారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న నేతలంతా ఒకప్పుడు యువనేతలుగా రాణించినవారే. ఈ నేపథ్యంలో పలువురు యువనేతలు తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్దమవుతున్నారు. తమ తల్లి తండ్రుల నుంచి వారసత్వాన్ని అందిపుచ్చుకొని గొప్ప నేతలుగా ఎదిగేందుకు శ్రమిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ యువనేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
కేటీఆర్
తెలంగాణలో యూత్ లీడర్ అనగానే ముందుగా సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ గుర్తుకువస్తారు. కేసీఆర్ నుంచి రాజకీయ వారసత్వం తీసుకున్న ఆయన రాష్ట్రాభివృద్ధిలో కీలకపోత్ర పోషిస్తున్నారు. ఐటీ మంత్రిగా ప్రపంచస్థాయి కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నారు. ఐటీ మంత్రి అంటే కేటీఆర్ లాగే ఉండాలన్న స్థాయికి ఆయన ఎదిగారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన నేపథ్యంలో కేటీఆర్ ముఖ్యమంత్రి న్నారని గత కొంత కాలంలో రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.
తలసాని సాయికిరణ్ యాదవ్(Thalasani Saikiran Yadav)
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. నూతన రాష్ట్రం ఏర్పాడ్డక మంత్రిగా వ్యవహరిస్తూ రాష్ట్రాభివృద్దిలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వారసుడిగా తలసాని సాయికిరణ్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగా తండ్రి బిజీగా ఉండటంతో నియోజక వర్గ బాధ్యతలను సాయికిరణ్ దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా సాయికిరణ్ క్రియాశీల రాజకీయాల్లోకి రావొచ్చని ప్రచారం జరుగుతోంది.
రవిచంద్ర నాయక్(Ravichandra Naik)
మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో డి.ఎస్. రెడ్యా నాయక్ బలమైన ముద్ర వేశారు. 2019లో డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన BRS తరపున సీనియర్ నేతగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం డోర్నకల్ నియోజక వర్గంలో ఆయన కుమారుడు రవిచంద్ర నాయక్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి రాజకీయ పరంపరను కొనసాగిస్తూ యువనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వయోభారం కారణంగా ఈసారి పోటీ నుంచి తాను తప్పుకుని తన కొడుకు రవిచంద్ర నాయక్ ను బరిలో నిలపాలని రెడ్యా భావిస్తున్నారు. అయితే ఇదే నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న సత్యవతి రాథోడ్ భారసలోనే మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిన ఆమె…. వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి బీఆర్ఎస్ అధిష్టానం ఎవరివైపు మెుగ్గు చూపుతుందో చూడాలి.
రామేశ్వర్ గౌడ్ (Rameshwar Goud)
BRS పార్టీ సీనియర్ నేతల్లో పద్మారావు గౌడ్ ఒకరు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పద్మారావు గౌడ్… తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆయన కుమారుడు రామేశ్వర్ గౌడ్ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరిగే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పద్మారావు గౌడ్ రాజకీయాల నుంచి తప్పుకుంటే సికింద్రాబాద్ స్థానం నుంచి రామేశ్వర్ బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కార్తిక్ రెడ్డి (Karthik Reddy)
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి యువనేతగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లోనే రాజకీయ అరంగేట్రం చేసిన కార్తిక్ రెడ్డి 2019లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే తన తల్లి మహేశ్వరం స్థానం నుంచి పోటీకి దిగడంతో ఫ్యామిలీకి ఒకే టికెట్ షరతు వల్ల ఆయన బరిలో దిగలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈసారైన కార్తిక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. సబితా ఇంద్రారెడ్డి రాజకీయ వారసత్వం కార్తిక్ తీసుకుంటారని తెలుస్తోంది.
విష్ణువర్ధన్ రెడ్డి (P Vishnuvardhan Reddy)
కాంగ్రెస్ నేత పి.జనార్ధన్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన విష్ణువర్ధన్ రెడ్డి హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ ఎమ్మెల్యేగా 2019లో గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ యువనేతల్లో ఒకరిగా విష్ణువర్ధన్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. తన తండ్రి పి. జనార్ధన్ రెడ్డి పేరును కొనసాగిస్తూ సేవ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విష్ణువర్దన్ రెడ్డి కీలక పాత్ర పోషించే అవకాశముంది.
కుందూరు రఘవీర్ రెడ్డి (Kunduru Raghaveer Reddy)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ నేతల్లో జానా రెడ్డి ఒకరు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేసిన ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు కుందూరు రఘవీర్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వయోభారంతో జానారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆయన పరంపరను సమర్థవంతంగా కొనసాగించగలనని ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ కార్యక్రమాల్లో క్రీయాశీలకంగా పనిచేస్తున్న రఘవీర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind)
భాజపాలో బలమైన యువనేతగా ధర్మపురి అరవింద్ ఎదిగారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ శ్రీనివాస్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అరవింద్.. భాజపా తరపున నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు అరవింద్ మరింత కీలకం కానున్నారు. ఇప్పటికే తన మాటల తూటాలతో బీఆర్‌ఎస్‌ను బలంగా ఎదుర్కొంటూ భాజపాలో కీలక నేతగా అరవింద్ గుర్తింపు సంపాదించారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం