• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గెలిస్తే 24 గంటలూ తాగునీరు: కేటీఆర్‌

  తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తాజ్‌ డెక్కన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. పెట్టుబడులు వస్తేనే నగరంలో సంపద పెరుగుతోందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు రాకపోకలు చాలా సులువుగా జరగాలన్నారు. త్వరలో ప్రతిరోజూ తాగునీరు ఇచ్చేలా చూస్తామని చెప్పారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమించామని కేటీఆర్‌ చెప్పారు.

  కేటీఆర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

  మంత్రి కేటీఆర్‌కు తృటిలోొ ప్రమాదం తప్పింది. కేటీఆర్ ప్రచార వాహనంలో ఉండగా డైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ప్రచారరథం రెయిలింగ్ విరగడంతో మంత్రి ముందుకు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్‌ను పట్టకున్నారు. ఈ ప్రమాదంలో ఎంపీ సురేష్ రెడ్డి వాహనంపై నుంచి జారి కిందపడటంతో స్వల్ఫ గాయాలయ్యాయి. ఆర్మూరు ర్యాలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

  రష్మికను కించపరచడం దారుణం: KTR

  రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో అంశంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌స్పందించారు. రష్మిక మందన్నాకు ఎదురైన చేదు అనుభవం వార్తల ద్వారా నేను తెలుసుకున్నానని తెలిపారు. ‘ఒక సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం దారుణం. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకురావాలి. డీప్ ఫేక్‌పై కేంద్ర కఠిన నిబంధనలు తీసుకువస్తే మా రాష్ట్రంలో అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

  BRS గెలవకపోతే అభివృద్ది ఆగిపోతుంది: KTR

  కేసీఆర్‌ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్ర అభివృద్ది ఆగిపోతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన హైదరాబాద్‌లో అభివృద్ధి అందరికీ కనిపిస్తోందన్నారు. కానీ విపక్షాలకు అది కనిపించట్లేదని విమర్శించారు. కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే పెరుగుతున్న హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలని తెలిపారు. ఈ పోరాటం దిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.

  ఇప్పుడు ఎట్లా ఉంది అని అడగాలి: కేటీఆర్

  హైదరాబాద్ మహా నగరంను విశ్వ నగరంగా మార్చే క్రమంలో అడుగులు ముందుకు వేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ప్రజలను కలిసినప్పుడు 2014లఎట్లా ఉండే… ఇప్పుడు ఎట్లా ఉంది అని అడగాలి. గతంను మరిచి పోయి గందరగోళం పడిపోతాం. ఇది మానవ నైజం. 2014కు ముందు 10 గంటలు కరెంట్ పోయిన అడిగేవాడు వాడు… చెప్పే వాడు లేడు. ఇప్పుడు 10 నిముషాలు కరెంట్ పోతే ఇదేనా బంగారు తెలంగాణ అని సోషల్ మీడియాలో పెడుతున్నారు. కర్ణాటకలో ప్రజలు కరెంట్ లేక రోడ్లు ఎక్కుతున్నారు’ అని … Read more

  డీకే శివకుమార్‌కు కేటీఆర్ కౌంటర్

  కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘కర్ణాటకలు రైతులకు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వని మీరు.. ఇక్కడ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న మమ్మల్ని తప్పుపడుతారా? అధికారంలోకి వచ్చిన మీరు ఒక్క హామీని అయినా అమలు చేస్తున్నారా? బెంగుళూరులోనూ కరెంట్ కట్‌లతో పరిశ్రల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ముందు మీ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూసుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు.

  అభివృద్దిని చూసి ఓటేయండి: కేటీఆర్

  సిరిసిల్ల నియోజవర్గంలో అభివృద్దిని చూసి ఓటేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్ల ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. కొందరు సోషల్ మీడియాలో నియోజవర్గ అభివృద్దిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ జరిగిన అభివృద్ధి సోషల్ మీడియాల్లో చూపించి వారికి ప్రజలే బుద్ది చెప్పాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, కేజీ టూ పీజీ క్యాంపస్‌లు వచ్చాయి.. సిరిసిల్ల అభిృద్ధిని చూసి ప్రతిపక్షాలు అసూయపడుతున్నాయి’. అని కేటీఆర్ పేర్కొన్నారు.

  నేడు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన

  TG: ఐటీ మంత్రి కేటీఆర్‌ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో భారాస ఆధ్వర్యంలో జరగనున్న యువ ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో రెండు వేలకు పైగా యువత పాల్గొనే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డు నుంచి 50 మంది చొప్పున 39 వార్డులకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడించారు.

  వారికి రాహుల్‌‌ను విమర్శించే స్థాయి లేదు: ఉత్తమ్

  సీఎం కేటీఆర్ పై కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైరయ్యారు. రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌, కవితలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. రాహుల్‌ విమర్శించే స్థాయి వారికి లేదన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని కొనియాడారు, తెలంగాణను దోపిడీ చేసిన కుటుంబం కల్వకుంట్లదేనని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని పేర్కొన్నారు, తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

  ప్రజలు భారాసతో ఉన్నారు: కేటీఆర్

  TG: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో, తొమిదేళ్ల పాలన ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు. కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. సంస్కారమంటే ఏమిటో కాంగ్రెస్‌ నుంచి నేర్చుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని కేటీఆర్‌ అన్నారు. కిషన్‌రెడ్డి ఎన్నికల రణరంగంలో వెన్నుచూపి పారిపోయారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. భాజపాకు 100.. కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు తమతోనే ఉన్నారని కేసీఆర్‌ చెప్పారు.