• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ పార్టీలకు అభ్యర్థులే లేరు: కేటీఆర్

    ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని చెప్పారు. కేసీఆర్‌‌పై ప్రజలకు దృఢమైన విశ్వాసం ఉందన్నారు. అభ్యర్థులకు బీఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని తెలిపారు. ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్‌.. ఫలితాల్లోనూ ముందే ఉంటామని వెల్లడించారు. కాంగ్రెస్‌కు 40చోట్ల అభ్యర్థులు లేరని చెప్పారు, బీజేపీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని కేటీఆర్ జోష్యం చెప్పారు.

    లోకేష్ ట్వీట్ బాధ కలిగించింది: KTR

    చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై లోకేష్ ట్వీట్ బాధను కలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కుమారుడిగా లోకేష్ ఆవేదన ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకు ఆందోళన కలిగిందని చెప్పారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే చంద్రబాబు అరెస్టుపై ఆందోళనలు వద్దంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

    తెలంగాణలో ‘స్కామ్ గ్రెస్‌’కు చోటు లేదు: KTR

    కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఓటర్లను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ కర్ణాటక నుంచి డబ్బులు తలిస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని విమర్శించారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘స్కామ్ గ్రెస్‌’కు తెలంగాణలో చోటు లేదని మంత్రి పేర్కొన్నారు.

    అందుకే రాజీనామా చేశా: పొన్నాల

    కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అమ్మకానికి పెట్టారు. గత రెండేళ్లుగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కార్యకలపాలు జరుగుతున్నాయి. సొంత పార్టీలోనే తాము పరాయి వాళ్లము అయ్యాం. మా బాధలు చెప్పుకునేందుకు 50 మంది బీసీ నేతలం వెళ్తే ఏఐసీసీ అపాయింట్ మెంట్ ఇవ్వదు. ఎక్కడైనా రేవంత్‌కు నమస్తే పెడితే కనీసం స్పందించడు అని ఆవేదన వ్యక్తం చేశారు.

    పొన్నాలకు జనగామ టికెట్?

    జనగామ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాలను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించేందుకు స్వయంగా కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లనున్నారు. జనగామ టికెట్‌పై ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించలేదు. పొన్నాల బీఆర్ఎస్‌లోకి చేరికతో ఆ టికెట్ ఆయనకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరెడ్డి ప్రచారంలో ఉన్నారు. ఇటీవలే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య హరీష్ సయోధ్య కుదిర్చిన సంగతి తెలిసిందే.

    ‘బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు’

    రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా 54 మందితో కూడిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే 45 రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

    హరీష్, కేటీఆర్‌తో సీఎం కేసీఆర్ కీలక భేటీ!

    ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌తో కీలక సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇద్దరితో కేసీఆర్ సమాలోచనలు జరపనున్నారు. ఎన్నికలకు ముందే పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించడం, మేనిఫెస్టోపై తుది కసరత్తు, పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై కేసీఆర్ ఆలోచనలు పంచుకోనున్నారు. ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ లుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశంపైనా చర్చించనున్నారు.

    రేవంత్ సీటుకు రేటెంత: కేటీఆర్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ ఫైరయ్యారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఎన్నికలంటే ఏటీఎం అని విమర్శించారు. రేవంత్ గతంలో ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు నోటు తీసుకుంటున్నాడని ఆరోపించారు. రేవంత్‌ను రేవంత్‌ అని పిలవడం లేదని రేటెంత.. రేటెంత.. అని అంటున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మళ్లీ పోటీ చేస్తున్నాడన్నాడన్నారు.. 60 ఏళ్లు అధికారంలో ఉన్న తెలంగాణకు ఏమీ చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు.

    అమిత్‌ షా అన్నీ అబద్దాలే: కేటీఆర్

    కేంద్ర మంత్రి అమిత్‌ షాకి తెలంగాణలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమిత్‌ షా ప్రసంగమంతా అబద్ధాలేనని మండిపడ్డారు. బీజేపీకి మళ్లీ భాజపాకు 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు ఖాయమన్నారు. పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతుల్లో ఉందని కేటీఆర్ విమర్శించారు.

    డబ్బుకాదు.. డాలర్లు అడగండి: కేటీఆర్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు లెక్క కుదిరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నవంబర్ 30న ఎన్నికలు డిసెంబర్ 3 కౌండింగ్ రెండు కలిపితే 6 ఇది మాకు అచ్చొచ్చిన నంబర్ అని తెలిపారు. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తారని అవి కాకుండా డాలర్లు కావాలని అడగండని ప్రజలకు కేటీఆర్ సూచించారు.