సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఈ ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా బన్నీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై అతడు సైతం ప్రెస్‌మీట్ పెట్టి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు జేఏసీ నాయకులు బన్నీ ఇంటిపై దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో అల్లు అర్జున్‌ను అధికార కాంగ్రెస్ పార్టీ కావాలనే టార్గెట్ చేస్తోందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. బన్నీపై చీప్ పాలిటిక్స్ ఆపాలంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బన్నీ ఇంటిపై సీఎం రేవంత్ అనుచరులే దాడి చేశారంటూ కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు.
హీరో అల్లు అర్జున్‌పై తెలంగాణ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని అతడి అభిమానులు ఆరోపిస్తున్నారు. #StopCheapPoliticsOnALLUARJUN, #CongressFailedTelangana హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు.
తెలంగాణలో 50 మందికి పైగా చిన్నారులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతే దానికి బాధ్యులు ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తరహాలో వాటిపైన ఎందుకు స్పందించరని నిలదీస్తున్నారు. చిన్నారుల మరణాలపై ఎందుకు మౌనమని నిలదీస్తున్నారు.
హైడ్రా కూల్చివేతల కారణంగా వందల కుటుంబాలు హైదరాబాద్‌లో నష్టపోయాయని బన్నీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. బాధితులు కన్నీరు పెట్టుకున్న వీడియోలను కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైరల్ చేస్తున్నారు.
అదే సమయంలో అల్లు అర్జున్ మంచితనానికి సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక పెద్దావిడన విజయవాడ వెళ్లి మరి బన్నీని కలిసిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.
ఆదివారం (డిసెంబర్ 22) బన్నీ ఇంటిపై దాడి చేసిన వారిలో ప్రధాన వ్యక్తులైన ఓయూ జేఏసీ నేతలుగా చెప్పుకుంటున్న రెడ్డి శ్రీను ముదిరాజ్, బుద్దా ప్రేమ్ కుమార్ గౌడ్‌లు.. సీఎం రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితులని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డితో వారు దిగిన ఫొటోలను వైరల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టేషన్‌లో వారు దర్జాగా కూర్చొని మెుబైల్స్ యూజ్ చేస్తున్న ఫొటోను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి వెనుక ఓ ప్రముఖ మీడియా ఛానల్ ఉందని బన్నీ అభిమానులు ఆరోపిస్తున్నారు. నిరసనకారులతో కలిసి మెుదట ఆ ఛానెల్ ప్రతినిధే వెళ్లడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్‌పై పోలీసులు, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును విపక్ష BRS ఎండగడుతున్న వీడియోలను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అంత అత్యవసరంగా సంధ్యా థియేటర్ వీడియోను రిలీజ్ చేయాల్సిన అవసరం సీపీకి ఏం వచ్చిందని నిలదీస్తున్నారు.
సంధ్యా థియేటర్ ఘటనపై పబ్లిక్ ఓపినియన్ వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీ పక్షాన కొందరు పౌరులు మాట్లాడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు.
అల్లు అర్జున్ వల్ల ఓ ప్రాణం పోయిందని మాట్లాడుతున్న రాయకీయ నాయకులు.. ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు, స్టూడెంట్స్‌పై ఎందుకు స్పందిచరని ఓ నెటిజన్ ప్రశ్నించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
గతంలో ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. బెయిల్‌పై విడుదలైన అనంతరం చాలా మంది నేతలు అతడ్ని పరామర్శించడానికి ఇంటికి వెళ్లారు. ఆ వీడియోను తాజాగా పోస్టు చేసిన ఓ ఫ్యాన్ ‘అతని కాలు పోయిందా, కన్నుపోయిందా, చెయ్యి పోయిందా’ అంటూ అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను రిపీట్ చేశాడు.
సంధ్యా థియేటర్ లోపల నుంచి బన్నీని బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చిందన్న పోలీసుల వ్యాఖ్యలను ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. బన్నీ బయటకు వస్తున్న క్రమంలో చుట్టూ అభిమానులు తప్ప పోలీసులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి