నటీనటులు: మోహన్‌లాల్, మాయా రావు వెస్ట్, తుహిన్ మేనన్, గోపాలన్, తదితరులు
దర్శకత్వం: మోహన్‌లాల్
సంగీతం: మార్క్ కిలియన్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్
ఎడిటర్: అజిత్‌కుమార్
నిర్మాణ సంస్థ: ఆశీర్వాద్ సినిమాస్
నిర్మాత: అంటోనీ పెరుబవూర్
విడుదల తేదీ: 25-12-2024
మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘బరోజ్ 3డీ’ (Barroz 3D). ఫాంటసీ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందింది. ‘గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్’ నవల ఆధారంగా ఈ సినిమాను మెహన్‌లాల్ తెరకెక్కించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీసు రాజు డి గామా వంశానికి చెందిన నిధి చుట్టూ కథ తిరుగుతుంది. రాజుకి నమ్మిన బంటు అయిన బరోజ్ (మోహన్ లాల్) నాలుగు శతాబ్దాలుగా నిధిని కాపాడుతుంటాడు. డి గామా వారసులు వస్తే వాళ్లకి నిధిని అప్పగించాలని ఎదురు చూస్తుంటాడు. ఎట్టకేలకి రాజవంశం పదమూడో తరానికి చెందిన ఇసబెల (మాయా రావు) తన తండ్రితో కలిసి గోవా వస్తుంది. మరి ఆమెకి బరోజ్ నిధిని అప్పగించాడా? లేదా? నాలుగు వందల ఏళ్లుగా బరోజ్ ఆ నిధిని ఎలా కాపాడుతూ వచ్చాడు? ఇసబెల అదే రాజవంశానికి చెందిన యువతి అని బరోజ్కు ఎలా కనుగొన్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
బరోజ్ పాత్రలో మలయాళ నటుడు మోహన్‌లాల్ చక్కగా ఒదిగిపోయాడు. కట్టప్ప తరహా లుక్‌లో ఆకట్టుకున్నాడు. కెరీర్లోనే విభిన్నమైన పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసాడు. నటన పరంగా లోటేమీ చేయలేదు. కానీ, ఆయన పాత్రలోనే బలం లేదు. ఇసబెల పాత్రలో మాయారావు కనిపించిన తీరు బాగుంది (Barroz 3D Review). ఆమె నటన ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. మిగిలిన పాత్రల్లో ఎక్కువగా హాలీవుడ్ నటులే కనిపించారు. వారు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
హాలీవుడ్ స్థాయిలో ఫాంటసీ ఎంటర్టైనర్ (Barroz 3D Review In Telugu)గా దర్శకుడు మోహన్‌లాల్ ఈ సినిమా రూపొందించారు. కథ బాగున్నప్పటికీ కథనం విషయంలోనే మోహన్‌లాల్ పూర్తిగా తడబడ్డారు. పోర్చుగీసు పాత్రలు, సంభాషణలు ఎక్కువగా కనిపించడంతో పాశ్చాత్య ప్రేక్షకులే లక్ష్యంగా తీసినట్లు అనిపిస్తుంది. నిధి చూట్టూ కథ అనగానే సహజంగానే అడ్వెంచరస్ సీన్స్ ఆశిస్తాం. కానీ బరోజ్‌లో అలాంటి ఉత్కంఠరేపే సన్నివేశాలు ఏమీ కనిపించలేదు. ఇసబెల పాత్ర కూడా పెద్దగా అంత బలంగా రాసుకోలేదు. కథలో ఎంతో కీలకమైన భావోద్వేగాలను దర్శకుడు మిస్ చేశారు. అయితే త్రీడీ విజువల్స్, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మెప్పించాయి. అయితే చిన్నారులకు మాత్రం బరోజ్ నచ్చే అవకాశముంది.
సాంకేతికంగా..
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. నిర్మాణం విషయంలో రాజీపడలేదు. సంతోష్ శివన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సంగీతం హాలీవుడ్ స్థాయిలో ఉంది. పాశ్చాత్య పోకడలకి తగ్గట్టే సాగుతుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. సాగదీత సన్నివేశాలను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
- కథా ప్రపంచం
- త్రీడీ విజువల్స్
- టెక్నికల్ విభాగం
మైనస్ పాయింట్స్
- ఆసక్తిలేని కథనం
- కొరవడిన భావోద్వేగాలు
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం