స్టార్ హీరోకు హైకోర్టులో చుక్కెదురు
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌కు కేరళ హైకోర్టులో చుక్కెదురైంది. ఏనుగు దంతాల కేసులో వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పెరంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా అతడికి చేదు అనుభవమే ఎదురైంది. తనపై వేసిన ప్రాసిక్యూషన్‌ను కొట్టివేయాలన్న మోహన్‌లాల్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కాగా గతంలో మోహన్‌లాల్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా ఏనుగు దంతాలు కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.