మోహన్‌లాల్ నటించిన భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రం ‘మరక్కర్’. అరేబియా సముద్ర సింహం క్యాప్షన్. నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. భారీ తారాగణంతో పాటు..ట్రైలర్లు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. విడుదలకి ముందే పలు జాతీయ అవార్డుల్ని సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
పోర్చుగీసులు భారత్‌కి వచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి రాజ్యాలను ఆక్రమించుకునే నేపథ్యంలో ఉద్బవించిన యుద్ధ వీరుడు కుంజాలి మరక్కర్ జీవితం గురించి ప్రస్తావించే సినిమా ఇది. 6 వ శతాబ్ధం నాటి రోజుల్లో జరిగిన కథ ఇది. పోర్చుగీసులు స్థానిక రాజ్యంపై దాడిచేసి మరక్కర్ కుటుంబాన్ని అతి దారుణంగా చంపుతారు. అయితే, ఆ దాడి నుంచి బయటపడిన మరక్కర్ అడవిలోకి పారిపోతాడు. కొంతకాలానికి తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పరుచుకొని.. తన కుటుంబాన్ని చంపిన పోర్చుగీసు నాయకుడిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. సముద్ర యుద్ధ వ్యూహాల్లో ఆరితేరుతాడు. కొచ్చిన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో సముద్రంలో వాళ్లని అడ్డుకోవడం కోసం కొచ్చిన్ రాజు మరక్కర్‌ను సముద్ర సైన్యానికి లెఫ్టినెంట్‌గా నియమిస్తాడు. మరి కుంజాలి మరక్కార్ పోర్చుగీసు వారితో సముద్రంలో ఎలా పోరాటం చేశాడు? అందులో గెలుపు సొంతమైందా తర్వాత ఏం జరిగింది తెరపై చూడాలి.
ఈ కథలో చెప్పాల్సింది చాలా ఉన్నప్పటికీ ..దర్శకుడు ప్రియదర్శన్ దానిపై దృష్టిపెట్టలేదు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్, 16 వ శతాబ్దం నాటి వాతావరణాన్ని సృష్టించేందుకు, యుద్ధ సన్నివేశాలపైనే ఎక్కువ ఫోకస్ చేశారనిపిస్తుంది. సినిమా నెమ్మదిగా సాగుతుండటంతో ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ఏ దశలోనూ కథ కనెక్ట్ కాలేదు.
ఇక మోహన్‌లాల్ అనుభవంతో తన పాత్రకు జీవం పోశారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో, ఎమోషనల్ సీన్స్‌లో ఆయన ప్రతిభ కనబరిచాడు. సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ వారిని సరిగా ఉపయోగించుకోలేదు. కీర్తిసురేశ్, మంజువారియర్ పాత్రలు అయితే పరిమితంగా ఉంటాయి. చరిత్రలో ఇలా జరిగింది అని చెప్పడానికి ప్రయత్నించారే తప్ప..దాన్ని ఆసక్తిగా తెరకెక్కించడంపై చేసిన కసరత్తలు సరిపోలేదు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్ , దర్శకుడు ప్రియదర్శన్ కూతురు.. కల్యాణి ప్రియదర్శన్ నటించారు. వారు ఉన్నంతసేపు చూడటానికి చాలా బాగుంటుంది. అర్జున్ సర్జా, సునీల్‌శెట్టి తదితర ప్రముఖ నటులు ఉన్నప్పటికీ కథనం సరిగా లేకపోవడంతో సినిమాకు ప్లస్ కాలేదు. అక మరక్కర్ తల్లిగా సుహాసిని ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ పాటు, ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. సంగీతం మెప్పిస్తుంది.
రేటింగ్: 2/5
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!