• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్షణాల్లో కుప్పకూలిన పురాతన టవర్‌

    [VIDEO](url): గుజరాత్‌ సూరత్‌లోని ఓ పాత పవర్‌హౌజ్‌లోని కూలింగ్‌ టవర్‌ను అధికారులు నేలకూల్చారు. కంట్రోల్డ్‌ బ్లాస్టింగ్‌ ద్వారా క్షణాల్లో టవర్‌ను నేలమట్టం చేశారు. టవర్ నేలమట్టం కావడంతోనే ఒక్కసారిగా దుమ్ము చెలరేగింది. ఆ ప్రాంతంలోని పక్షులు ఎక్కడివక్కడ ఎగిరిపోయాయి. #WATCH | Gujarat: An old cooling tower of Utran Power House in Surat demolished with a controlled blast. pic.twitter.com/SeFug7Skk5 — ANI (@ANI) March 21, 2023

    ఇది సార్ ఎన్టీఆర్ అంటే.. వీడియో వైరల్

    [VIDEO:](url) అభిమానులంటే ఎన్టీఆర్‌కి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ యోగక్షేమాలను ఆరా తీసే నటుల్లో యంగ్ టైగర్ ఎల్లప్పుడూ ముందుంటాడు. తాజాగా ఇది మరోసారి నిరూపితం అయింది. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని దూసుకుంటూ వచ్చి ఎన్టీఆర్‌తో ఫొటో దిగడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాడీ గార్డులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని నిలువరించి అభిమానితో ఫొటోకు పోజులిచ్చాడు. ఈ వీడియో చూసి ‘ఇది సార్ ఎన్టీఆర్ అంటే’ … Read more

    ఇదండీ ఫిజిక్స్ అంటే.. ఈ వీడియోను చూశారా?

    [VIDEO:](url) సైన్స్‌లో రారాజుగా ఫిజిక్స్‌ని పిలుస్తుంటాం. భౌతిక శాస్త్ర నియమాలను ఆసరాగా చేసుకుని మ్యాజిక్ చేయొచ్చు. చాలామంది మెజీషియన్లకు ఫిజిక్స్ ఒక జీవనాధారం. అయితే, ఊహకు అందని కొన్ని చర్యలు ఫిజిక్స్ ద్వారా సాధ్యమవుతాయి. ఇందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఇందులో కొన్ని ప్రయోగాలను చేసి చూపించారు. ఒక సొల్యూషన్‌లో వేస్తే రాగి తీగ వ్యాకోచం చెందడం, మరో సొల్యూషన్‌లో ఉంచితే తిరిగి యథాస్థితికి చేరడం; మాగ్నెటైజేషన్ ద్వారా ఓ వస్తువు తిరిగేలా చేయడం, చిన్నపాటి బొంగరాన్ని గాలిలో తిరిగేలా చేయడం.. ఇలా అన్నీ … Read more

    మళ్లీ తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది; ఉపేంద్ర

    పాన్ ఇండియా సినిమా ‘కబ్జా’ తో మార్చ్‌ 17న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు ఉపేంద్ర. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రిలీజ్ ఫంక్షన్‌ నిర్వహించారు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉందన్న ఉపేంద్ర.. తన పాత సినిమాల్లోని డైలాగ్స్‌తో అలరించాడు. అలాగే ఆస్కార్‌ గెలుచుకున్న RRR చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పాడు.

    హోలీ సంబరాల్లో టీమిండియా

    [VIDEO](url): టీమిండియా ఆటగాళ్లు హోలీ సంబరాల్లో మునిగితేలారు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఆటగాళ్లు పండగ సందర్భంగా సరదాగా గడిపారు. ఆటగాళ్లంతా రంగుల్లో మునిగితేలారు. సంబరాలకు సంబంధించిన వీడియోను శుభ్‌మన్‌ గిల్‌ తన ఇన్‌ స్టా ఖాతాలో పంచుకున్నాడు. https://www.instagram.com/reel/CpfQCNhpkuz/?utm_source=ig_web_copy_link

    ధోనీ సిక్సర్ల మోత మొదలైంది

    [VIDEO](url): IPL 2023కి సమయం సమీపిస్తోంది. మార్చి 31న మహా క్రీడాసమరం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అనేక జట్లు శిక్షణా శిబిరాలను కూడా మొదలుపెట్టాయి. CSKను నాలుగు సార్లు చాంపియన్‌గా నిలబెట్టిన MS ధోనీ కూడా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. చెపాక్‌ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్‌లో భాగంగా సిక్స్‌ కొట్టిన ఓ వీడియోను అభిమాని ట్విట్టర్లో పంచుకున్నాడు. ధోని సిక్సర్ల మోత మొదలైందంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. Dhoni smashing the ball 🏏💥@MSDhoni #MSDhoni @ChennaiIPL pic.twitter.com/C4qSIq2UJ3 — DHONI Era™ 🤩 (@TheDhoniEra) … Read more

    బీభత్సం సృష్టించిన డ్రైవర్ లేని ట్రాక్టర్‌

    [VIDEO:](url) ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన షాక్‌కు గురిచేస్తోంది. ఓ షోరూం ఎదుట పెట్టిన ట్రాక్టర్‌ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయ్యి లోపలికి దూసుకెళ్లింది. అడ్డుగా ఉన్న అద్దాలు, వాహనాలను ధ్వంసం చేసింది. అప్రమత్తమైన సిబ్బంది దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఫలితంగా కొద్దిపాటి నష్టంతోనే బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది ట్రాక్టరా లేదా భూతమా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. #टैक्टर_पर_भूत…!#Bijnor में जूते के शो- रूम के सामने खड़ा ट्रैक्टर अचानक से अपने आप … Read more

    పిల్లికి పుట్టినరోజు వేడుకలు చేసిన కుటుంబం

    [VIDEO:](url) పిల్లలకు పుట్టిన రోజు వేడుకలు చేయటం సహజం. కానీ, ఓ కుటుంబం వాళ్లు ప్రేమగా పెంచుకుంటున్న పిల్లికి కూడా జన్మదిన వేడుకలు జరిపించింది. ఇంటిని అందంగా డెకరేట్ చేయటంతో పాటు పిల్లిని ముస్తాబు చేశారు. అతిథులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేయించి ఫటోలు, వీడియోలు చేశారు. ఈ వీడియోను నెటిజ్లు తెగ షేర్ చేస్తున్నారు. https://www.instagram.com/p/CokbnstMBAO/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again Screengrab Instagram:cats_of_instagram Screengrab Instagram:cats_of_instagram

    ఫొటోలు తీయబోయి కాలువలో పడిన మహిళ

    [VIDEO](url): సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పెళ్లిలో ఓ మహిళ వధూవరుల ఫొటోలు తీస్తూ డ్రైనెజ్ కాలువలో పడిపోయింది. ఈ వైరల్ వీడియోను కోటి మందికిపైగా వీక్షించారు. ఈ ఘటన ఎక్కడో జరిగిందో మాత్రం తెలియదు. కాలువలో పడిన మహిళకు మాత్రం ఏమికాలేదని తెలిసింది. https://www.instagram.com/p/CotmH2QPKB3/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

    అది నాలుకనా? నాగు పామా?

    కొందరి నాలుకలు చాలా పొడవుగా ఉంటాయి. వాటితో ముక్కును సులభంగా తాకుతుండటం చూసి ఉంటాం. కానీ, ఓ నాలుకను చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. పాము లాంటి నాలుకను పూర్తిగా బయటకు లాగింది. నాలుగు సెకన్లే ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. అది నాలుకా ? లేదా నాగుపామా? అంటూ పోస్టులు పెడుతున్నారు. Screengrab Twitter:uncensoredpromo Screengrab Twitter:uncensoredpromo