[VIDEO:](url) అభిమానులంటే ఎన్టీఆర్‌కి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ యోగక్షేమాలను ఆరా తీసే నటుల్లో యంగ్ టైగర్ ఎల్లప్పుడూ ముందుంటాడు. తాజాగా ఇది మరోసారి నిరూపితం అయింది. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని దూసుకుంటూ వచ్చి ఎన్టీఆర్‌తో ఫొటో దిగడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాడీ గార్డులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని నిలువరించి అభిమానితో ఫొటోకు పోజులిచ్చాడు. ఈ వీడియో చూసి ‘ఇది సార్ ఎన్టీఆర్ అంటే’ అని కామెంట్ చేస్తున్నారు.