• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

    Contents

    2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి.

    అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్

    టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు అర్జున్‌ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 2022లో ఒక్క సినిమా కూడా రాకపోయినా టాప్‌లో ఉన్నాడంటే పుష్ప-2 రిలీజైతే రానున్న రోజుల్లో అతడి పాపులారిటీ ఎలా ఉంటుందో చూడాలి. మరో ఆసక్తికర అంశంమేంటంటే చిరంజీవి ఇప్పటికీ యంగ్‌ యాక్టర్స్‌కు పోటీనిస్తూ టాప్‌-5లో నిలవడం. ‘లైగర్‌’ హిట్‌ పడుంటే విజయ్‌ దేవరకొండ కూడా టాప్‌-3లో ఉండేవాడు, అప్పుడు పోటీ మరింత ఆసక్తికరంగా మారేది. నాని, రామ్‌ పోతినేని, నాగ చైతన్య, నితిన్‌ ఇలా అందరూ దాదాపుగా ఒకే స్థాయిలో ఉన్నారు. ‘కార్తికేయ-2’ విజయంతో నిఖిల్ సిద్ధార్థ్‌ 30 స్థానానికి దూసుకెళ్లాడు.

    For English Version

    50 Most Searched Telugu Actors Of 2022

    For Top 30 Actresses in Telugu

    2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 30 తెలుగు హీరోయిన్స్

    1. అల్లు అర్జున్

    2022 ఏడాదిలో గూగుల్ సెర్చ్‌లో ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్  అగ్రభాగాన నిలిచాడు. గతేడాది విడుదలై అఖండ విజయం సాధించిన పుష్ప.. అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. బన్నీ కోసం పలు కార్పోరేట్ కంపెనీలు ఆయనతో యాడ్స్ చేసేందుకు క్యూ కట్టాయి.

    2. మహేష్ బాబు

    2022 గూగుల్ సెర్చ్‌లో మహేష్ బాబు రెండో స్థానంలో నిలిచారు. గతేడాది రిలీజై బ్లాక్ బాస్టర్ హిట్ సర్కారువారి పాట మూవీతో ఆయన బ్రాండ్ విలువ మరింత పెరిగింది.

    3. ప్రభాస్

    రాధేశ్యామ్ మూవీ యావరేజ్ హిట్ సాధించినా.. బాహుబలి క్రేజ్ ప్రభాస్‌ను టాప్ 3లో నిలిపింది.

    4. చిరంజీవి

    రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి సరైన హిట్ పడకున్నా ఆయన తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటునే ఉన్నారు.

    5. రామ్‌చరణ్

    RRR సృష్టించిన ప్రభంజనంతో చెర్రీ పేరు మార్మోగిపోయింది. ఇంటర్‌నెట్‌లో నాటు నాటు పాట తెచ్చిన పాట ఊపుతో చరణ్‌ అందిరి నోట్ల పడ్డారు.

    6. జూ. ఎన్టీఆర్

    RRR ఎన్టీఆర్ నటనకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు పెరిగారు. ఏకంగా ఆస్కార్ ఉత్తమ నటుల షార్ట్ లిస్ట్ జాబితాలో చేరారు.

    7. విజయ్ దేవరకొండ

    లైగర్‌తో విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో టాక్‌ ఆప్‌ ది టౌన్‌గా మారారు. ఆయన ఫిజిక్ అందరి దృష్టిని ఆకర్షించింది. 

    8. పవన్ కళ్యాణ్

    రాజకీయాల్లోకి వెళ్లినా పవన్ కళ్యాణ్ మానియా ఏమాత్రం తగ్గలేదు. భీమ్లానాయక్‌తో సూపర్ హిట్ అందుకున్నారు.

    9. దుల్కర్ సల్మా

    మలయాళ హీరో అయినా తెలుగులో సీతారామం స్ట్రేయిట్ ఫిల్మ్ చేసి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు.

    10. నాగార్జున

    గతేడాది విడుదలైన ఘోస్ట్ పెద్ద విజయం సాధించకున్నా.. బిగ్‌బాస్ వంటి హోస్టింగ్ వల్ల నాగార్జున టాప్ 10లో నిలిచారు.

    11. రవితేజ

    మాస్ మహారాజా రవితేజ 2022లో 3 సినిమాలు తీశాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా చిత్రాలు విడుదలయ్యాయి. ‘ధమాకా’తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.

    12. నందమూరి బాలకృష్ణ

    2022లో బాలకృష్ణ సినిమాలేవీ చేయలేదు. అయినప్పటికీ ‘అన్‌స్టాపబుల్’ షో ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.

    13. నాని

    ‘అంటే సుందరానికి’ సినిమా ద్వారా నాని మోస్తరు విజయాన్ని సాధించాడు.  హిట్2 సినిమా నిర్మాణంతో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు.

    14. నాగచైతన్య

    బంగార్రాజు, థాంక్యూ, లాల్‌సింగ్ చడ్డా సినిమాల్లో చైతూ నటించాడు. అంతకుమించి సమంతతో బ్రేకప్ ఫీవర్ 2022లోనూ కొనసాగింది.

    15. రామ్ పొత్తినేని

    వారియర్ సినిమాతో తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులను పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ విజయం సాధించనప్పటికీ.. ఆ సినిమాలో రామ్ వేసిన ఐకానిక్ డ్యాన్స్ యూత్‌లో తన క్రేజ్‌ను పెంచింది.

    16. దగ్గుపాటి వెంకటేష్

    ఎఫ్3 సినిమాతో 2022లో వెంకటేష్ హిట్ కొట్టాడు. రానా నాయుడు వెబ్‌సిరీస్‌లో వృద్ధుడి పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడమూ హాట్ టాపిక్‌గా మారింది.

    17. నితిన్

    మాచర్ల నియోజకవర్గం సినిమాతో నితిన్ ప్రేక్షకులను పలకరించాడు. అంతకుమించి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నితిన్‌ని కలవడం సంచలనం అయింది.

    18. బ్రహ్మానందం

    భీమ్లా నాయక్, పంచతంత్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో బ్రహ్మానందం నటించాడు. వీటి కన్నా మీమ్స్‌ ద్వారా బ్రహ్మి కోసం శోధించసాగారు. 

    19. అఖిల్ అక్కినేని

    2022లో అఖిల్ సినిమాలేమీ రాలేదు. కానీ, ఏజెంట్ సినిమా అప్డేట్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు.

    20. రానా దగ్గుపాటి

    భీమ్లా నాయక్, విరాటపర్వం ద్వారా రానా 2022ని ముగించాడు.

    21. ప్రకాశ్ రాజ్

    సినిమాలు, రాజకీయాలతో ప్రకాశ్ రాజ్ నిత్యం వార్తల్లో నిలిచారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు.  

    22. గోపిచంద్

    గతేడాది పెద్దగా హిట్లు లేకున్నా గోపిచంద్ మాత్రం ప్రేక్షకుల హృదయాల్లోనే ఉన్నారు.

    23. సునిల్

    కమెడియన్ నుంచి హీరోగా.. హీరో నుంచి పుష్ప సినిమా ద్వారా విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునిల్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తన ఉనిఖిని కాపాడుకున్నాడు. 

    24. అడవి శేషు

     మేజర్ లాంటి పాన్ ఇండియా హిట్‌తో అడవి శేషు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని మంచి ఇమేజ్ సంపాదించాడు.

    25. మోహన్‌ బాబు

    సన్‌ ఆఫ్‌ ఇండియా సినిమాతో చివరిసారిగా పలకరించిన మోహన్‌ బాబు, సినిమా ఆడకపోయినా జనంలో మాత్రం బాగా ఫేమస్‌ అయ్యారు.

    26. వరుణ్ తేజ్

     గతేడాది విడుదలైన గని డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. ఈ మెగా ప్రిన్స్ మాత్రం నటనతో మంచి మార్కులు సంపాదించాడు.

    27. శర్వానంద్

    వైవిధ్యమైన కథలను ఎంచుకునే శర్వానంద్ ప్రయోగాలతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.

    28. విశ్వక్ సేన్

    అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాలు విశ్వక్‌సేన్‌కి విజయాలని కట్టబెట్టాయి. యాక్షన్ కింగ్ అర్జున్‌తో ఓ సినిమా వివాదం, ఓ టీవీ షోలో వ్యాఖ్యాతతో వివాదం వంటివాటితో వార్తల్లో నిలిచాడు. 

    29. నాగశౌర్య

    కృష్ణ వ్రింద విహారి సినిమాను చేశాడు నాగశౌర్య. ఈ సినిమా ప్రమోషన్లను పాదయాత్ర ద్వారా చేపట్టి జనాల దృష్టిని ఆకర్షించాడు.

    30. నిఖిల్ సిద్ధార్థ

    కార్తికేయ2 సినిమాతో నిఖిల్ మంచి గుర్తింపు సాధించాడు. బాలీవుడ్‌లోనూ సినిమా ఆడటంతో నెటిజన్ల కంట పడ్డాడు.

    31. సాయిధరమ్ తేజ్

    సాయిధరమ్ తేజ్ సినిమాలేమీ విడుదల కాలేవు. కానీ, బైక్ యాక్సిడెంట్ వల్ల తేజ్ వార్తల్లో నిలిచాడు.

    32. జగపతిబాబు

    విలన్‌గా కెరీర్‌లో రెండో ఇన్నింగ్సుని మొదలు పెట్టిన జగపతిబాబు 2022లో పలు సినిమాలతో అలరించాడు. గుడ్‌లఖ్ సఖి, రాధేశ్యామ్, గని సినిమాల్లో నటించాడు.

    33. అల్లరి నరేష్ 

    నాంది సినిమాతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చిన అల్లరి నరేష్ గతేడాది చివర్లో ఇట్లు మారేడుపల్లి ప్రజానికంతో ప్రేక్షకులను అలరించాడు.

    34. నందమూరి కళ్యాణ్ రామ్ 

    బింబిసార వంటి ఇండస్ట్రి హిట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ మళ్లీ ట్రాక్ ఎక్కి తన సత్తా ఏంటో చూపించాడు.

    35. ఆది సాయికుమార్

    తీస్‌మార్ ఖాన్, అతిథిదేవో భవ వంటి సినిమాలు పెద్దగా విజయం సాధించినప్పటికీ యూత్ ఫాలోయింగ్‌ను మాత్రం మిస్‌ చేసుకోలేదు.

    36. సుధీర్ బాబు

    సుధీర్‌ బాబు నుంచి 2022లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఒకే సినిమా రిలీజైంది. అది సరిగా ఆడకపోయినా సుధీర్‌ బాబు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

    37. సిద్ధు జొన్నలగడ్డ

    డీజే టిల్లు మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్‌ను షేక్ చేసిన సిద్ధు జొన్నల గడ్డ యూత్‌లో మంచి పాపులారిటీ సంపాదించాడు.

    38. సత్యదేవ్ 

    గాడ్‌ఫాదర్ సినిమాలో విలన్‌గా చేసి సత్యదేవ్ ప్రాచుర్యం పొందాడు. గుర్తుందా శీతాకాలం సినిమాతోనూ మెప్పించాడు.

    39. మంచు విష్ణు

    మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా 2022లో విడుదలైంది. మా అసోసియేషన్ ఎన్నికలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ ద్వారా విష్ణు వార్తల్లో నిలిచాడు.

    40. సందీప్ కిషన్

    2022లో A1 ఎక్స్‌ప్రెస్‌తో తన సినీ కెరీర్‌లో 25 సినిమాలను సందీప్ కిషన్ పూర్తి చేశాడు. ఈ సినిమాకు తానే ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. గతేడాది గల్లీ రౌడీ, వివాహ భోజనంబు వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 

    41. కృష్ణ భగవాన్‌

     ఎక్కువగా సినిమాలు చేయకపోయినా జబర్ధస్త్‌కు రావడం, అక్కడ తన టైమింగ్‌తో పంచ్‌లతో మరోసారి పాపులర్‌ అయ్యాడు.

    42. కిరణ్ అబ్బవరం

    సెబాస్టియన్, సమ్మతమే సినిమాల్లో నటించాడు కిరణ్ అబ్బవరం. ఇవి రెండూ ఆశించిన విజయం సాధించలేదు.

    43. అల్లు శిరీష్

    ఊర్వశివో రాక్షసివో సినిమాతో హిట్ కొట్టాడు అల్లు శిరీష్. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో రిలేషన్‌లో ఉన్నాడంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.

    44. సుమంత్

    మళ్లీ మొదలైంది, సీతారామం చిత్రాల ద్వారా సుమంత్ మళ్లీ తెరపై కనిపించాడు. సీతారామం ద్వారా హిట్ కొట్టాడు.

    45. ఆలీ

    లైగర్, ఎఫ్3, తదితర సినిమాల్లో ఆలీ నటించాడు. ఎఫ్3 సినిమాలో పాల బేబీ క్యారెక్టర్‌తో అలరించాడు. రాజకీయాల్లోనూ ఆలీ యాక్టివ్‌గా ఉన్నాడు.

    46. రాజ్ తరుణ్

    స్టాండప్ రాహుల్ సినిమా ద్వారా రాజ్‌తరుణ్ 2022లో ఆశించిన విజయం సొంతం చేసుకోలేకపోయాడు.

    47. రాజేంద్రప్రసాద్

    సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన కామెడీ పంచ్‌లతో కడుపుబ్బ నవ్విస్తున్నారు.

    48. ​​వైష్ణవ్ తేజ్

    సుప్రీం హీరో వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా మూవీతో గతేడాది ప్రేక్షకులను అలరించాడు. 

    49. నవీన్ పొలిశెట్టి

    జాతిరత్నాలు మూవీతో హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి క్రేజ్ యూత్‌లో కొనసాగుతోంది.

    50. వెన్నెల కిశోర్

    ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఆర్టిస్ట్ వెన్నెల కిశోర్. 2022లో వివిధ సినిమాల్లో కనిపించాడు. 

    For English Version

    50 Most Searched Telugu Actors Of 2022

    For Top 30 Actresses in Telugu

    2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 30 తెలుగు హీరోయిన్స్

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv