• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘గేమ్‌ ఛేంజర్‌’ సాంగ్ లీక్‌.. ఇద్దరి అరెస్టు

  రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. అయితే కొద్ది రోజుల క్రితం ఈ చిత్రంలోని ‘జరగండి జరగండి’ అనే పాట సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. మేకర్స్ ఫిద్యాదుతో దీనిపై విచారణ జరిపిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇద్దరి నిందితులను అరెస్ట్‌ చేశారు. వారిపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

  రామ్‌ చరణ్‌కు అరుదైన గుర్తింపు

  టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. ఆస్కార్‌ కమిటీ తాజాగా వెల్లడించిన మెంబర్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌ జాబితాలో రామ్‌ చరణ్‌కు చోటు దక్కింది. రామ్ చరణ్‌ను ‘యాక్టర్స్‌ బ్రాంచ్‌’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆస్కార్ అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ఈ లిస్ట్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే జూ. ఎన్టీఆర్‌కు అందులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

  “గేమ్ చేంజర్” నుంచి అప్‌డేట్

  రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్‌ “గేమ్ చేంజర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషం తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై తాజా అప్‌డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌ని దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు 50వ చిత్రాని తన బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు.

  విజయ్ ‘లియో’లో రామ్‌చరణ్..?

  దళపతి విజయ్ నటించిన ‘లియో’లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించారనే చర్చ జరుగుతోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలుండగా.. ఇందులో రామ్‌చరణ్ నటించారనే చర్చతో భారీ హైప్ వస్తోంది. ఓవర్సీస్ బుకింగ్ సైట్స్‌లో లీడ్ క్యాస్టింగ్‌లో రామ్‌చరణ్ పేరు ఉండటడే ఈ చర్చకు ప్రధాన కారణం. ఈ నెల 19న భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ మూవీని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించాడు. అయితే రామ్‌చరణ్ నటించారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

  నిఖిల్ హీరోగా ‘ద ఇండియా హౌస్’

  రామ్‌చరణ్ కొత్త బ్యానర్ ‘వీ మెగా పిక్చర్స్’ తొలిసారిగా చేయబోతున్న చిత్రం ‘ద ఇండియా హౌస్’. నిఖిల్ సిద్ధార్థ హీరోగా, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలు పంచుకోనుంది. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా టీజర్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. స్వాతంత్ర సమరంలో వెలుగులోకి రాని సంఘటన ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు.

  చితకబాది డబ్బులిచ్చిన చెర్రీ ఫ్యాన్స్

  మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెలపై సునిశిత్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహానికి గురైన చరణ్ ఫ్యాన్స్ అతడిని చితకబాది బుద్ధి చెప్పారు. అనంతరం అతడితో బహిరంగ క్షమాపణలు చెప్పించారు. చివర్లో సునిశిత్‌కు చెర్రీ ఫ్యాన్స్ డబ్బులివ్వడం విశేషం. ఖర్చులకు ఉంచుకోమంటూ వారు అతడికి డబ్బులు ఇచ్చారు. మరోసారి స్టార్ హీరోల వ్యక్తిగత విషయాలపై జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. End of the video & issue RC fans … Read more

  అరుదైన ఘనత సాధించిన చిరు, రామ్‌చరణ్

  మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏషియన్ అల్ ఆఫ్ ఫేమ్‌ 2023కి గాను చోటు దక్కించుకున్నారు. ఇతర అంతర్జాతీయ సినీ ప్రముఖుల సరసన మెగా హీరోలు నిలిచారు. మరో విశేషమేమిటంటే సౌత్‌ నుంచి ఎంపికైన తొలి నటులుగా గుర్తింపు పొందారు. ఈ అవార్డ్స్ వేడుకలను ఆస్కార్ వేడుకలు నిర్వహించిన ఐకానిక్ బిల్ట్ మోర్ హోటళ్లో నిర్వహిస్తున్నారు. ఈ న్యూస్‌తో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. Today Asian Hall of Fame officially announces the 2023 … Read more

  సునిశిత్‌ను చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్

  సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్‌ను మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు చితకబాదారు. చెర్రీ భార్య ఉపాసనపై సునిశిత్ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఫ్యాన్స్ అతడిపై దాడి చేశారు. అనంతరం అతడితో ఉపాసనకు క్షమాపణలు చెప్పించారు. కాగా ఓ ఇంటర్క్యూలో సునిశిత్ మాట్లాడుతూ ‘‘నేను, ఉపాసన కలసి గోవా వెళ్లాం. రామ్‌చరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. అతడే ఉపాసనను ప్రేమలో పడేయమని చెప్పాడు. చిరంజీవి పెద్ద కూతురు సుష్మితాతో కూడా లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లా’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన సునిశిత్ ను చితకబాదిన రాంచరణ్ ఫ్యాన్స్ … Read more

  టీజర్ బాగా నచ్చింది: రామ్‌ చరణ్

  యంగ్ హీరోయిన్ నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. టీజర్ చాలా బాగుందని తాను ఎంజాయ్ చేసినట్లు, మైండ్‌కు చాలా రీప్రెషింగ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న గేమ్‌ ఛేంజర్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

  ‘ఏంటమ్మా’ వీడియో సాంగ్ విడుదల

  ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా నుంచి ‘ఏంటమ్మా’ సాంగ్ రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ కలిసి నటిస్తున్న చిత్రమిది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సాంగ్‌ని తీర్చిదిద్దారు. రామ్‌చరణ్ కేమియోగా వచ్చాడు. లుంగీలెత్తి సల్లు భాయ్, వెంకటేశ్, రామ్‌చరణ్ చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ అందించగా విశాల్ దడ్లానీ, పాయల్ దేవ్ ఈ పాటను ఆలపించారు. తెలుగు, హిందీ లైన్స్‌తో గీతం సాగుతోంది. ఈ సినిమా నుంచి ఇటీవల బతుకమ్మ పాటను విడుదల చేశారు.