‘ఏంటమ్మా’ వీడియో సాంగ్ విడుదల
‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా నుంచి ‘ఏంటమ్మా’ సాంగ్ రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ కలిసి నటిస్తున్న చిత్రమిది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సాంగ్‌ని తీర్చిదిద్దారు. రామ్‌చరణ్ కేమియోగా వచ్చాడు. లుంగీలెత్తి సల్లు భాయ్, వెంకటేశ్, రామ్‌చరణ్ చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ అందించగా విశాల్ దడ్లానీ, పాయల్ దేవ్ ఈ పాటను ఆలపించారు. తెలుగు, హిందీ లైన్స్‌తో గీతం సాగుతోంది. ఈ సినిమా నుంచి ఇటీవల బతుకమ్మ పాటను విడుదల చేశారు.