‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ ఎనర్జిటిక్ స్టెప్పులు చూశాక లోలోపల ఎంతో ఈర్ష్య కలిగిందని చిరంజీవి వెల్లడించారు. ‘నిజం విత్ స్మిత’ టాక్ షోలో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది విడుదలైన ఆచార్య సినిమాలో చిరు, చెర్రీ కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాటలో తన డ్యాన్స్‌ని ఎవరూ చూడరేమోనని భావించినట్లు చిరు చెప్పారు. కానీ, తండ్రిగా తనకు కొంత గౌరవం ఇచ్చాడని(డ్యాన్స్‌లో పోటీ పరంగా) చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ షో రేపు సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్‌లో తన గురించి కొన్ని విషయాలను చిరు పంచుకున్నారు.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్