ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ ₹10,000కోట్లు
2022లో ఇండియన్ బాక్సాఫీస్ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. 2019లో తొలిసారి ₹10,000 కోట్ల మార్కును దాటిన ఇండియన్ సినిమా వసూళ్లు…. ఆ తర్వాత కరోనా దెబ్బకు 2020,21లో డీలా పడ్డాయి. 2022లో మరోసారి బాక్సాఫీస్ కలెక్షన్లు ₹10,637 కోట్లు వసూలు చేసింది. అయితే ఇందులో తెలుగు సినిమా మార్కెట్ 13నుంచి 20శాతానికి పెరిగింది. మొత్తంగా హిందీ సినిమా మార్కెట్ 44 నుంచి 33 శాతం వాటాను సౌత్ సినిమాలకు కోల్పోయింది. KGF-2, RRR 2022 బిగ్గెస్ట్ సినిమాలుగా అవతరించాయి.