‘ఆర్ఆర్ఆర్’ బృందం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి చేరుకుంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు, ఎం.ఎం.కీరవాణి దంపతులు, కార్తికేయ, శ్రీసింహా తదితరులు స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఎయిర్‌పోర్టులో అభిమానులు వీరిని చుట్టుముట్టారు. మరోవైపు, రామ్‌చరణ్ కూడా ఈరోజు సాయంత్రం దిల్లీలో జరిగే ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’ కార్యక్రమంలో చరణ్ అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో రామ్‌చరణ్ భేటీ కానున్నారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.