• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కల నిజమవుతోంది: రాహుల్, కాళభైరవ

    [VIDEO:](url) ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం, స్టేజిపై లైవ్ ప్రదర్శనకు ఆహ్వానం అందుకోవడంపై సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ సంబరపడ్డారు. ఇది నమ్మశక్యం కానిదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నిజంగా ఇది నమ్మశక్యం కానిది. ఇదే వాస్తవం అని తెలుసుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది. కల నిజం అవుతోంది’ అని కాళభైరవ చెప్పాడు. ‘మా కల నెరవేరింది’ అంటూ రాహుల్ సిప్లిగంజ్ చెప్పారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో పాడతారు. Kaala Bhairava & … Read more

    ఆర్ఆర్ఆర్‌ చిత్రం రీ రిలీజ్‌ ట్రైలర్‌

    రామ్‌, భీమ్ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్‌ఆర్‌ చిత్రాన్ని రి రిలీజ్ చేస్తున్నారు. మార్చి 3న 200 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ మేరకు చిత్ర యూనిట్‌ రీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గతేడాది విడుదలైన రాజమౌళి కళాద్భుతం… సుమారు 1200 కోట్లు వసూలు చేసింది.. మరి ఇప్పుడు ఎంత కొళ్లగొడుతుందో చూడాలి.

    హాలివుడ్‌ సినిమాలు చేస్తా: రామ్‌ చరణ్‌

    [VIDEO](url): HCA అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన నటుడు రామ్‌ చరణ్‌… ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నాటు నాటు పాటను ప్రమోట్‌ చేస్తున్నాడు. అందులో భాగంగానే గుడ్‌మార్నింగ్‌ అమెరికా టాక్‌షోలో పాల్గొన్నాడు. తాజాగా మరో ఇంటర్నేషనల్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో హాలివుడ్‌లో నటిస్తారా అని ప్రశ్నించగా. “ ప్రస్తుతం ఇండియాలోనే సినిమాలు చేస్తున్నా. తప్పకుండా హాలివుడ్‌లోనూ చేస్తా. ఇండియా టాలెంట్‌ను ఇక్కడ కూడా చూపించాలనుకుంటున్నా. మంచి అవకాశం వస్తే తప్పకుండా హాలివుడ్‌లో నటిస్తా” అని సమాధానమిచ్చారు. Proven Winner ? @AlwaysRamCharan … Read more

    అమెరికాలో భారీ ఎత్తున ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రీ రిలీజ్‌!

    ‘RRR’ చిత్రాన్ని అమెరికాలో మాసివ్‌ రీ రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ సిద్ధమవుతోంది. మార్చి 3న సుమారు 200 థియేటర్స్‌లో కంప్లీట్‌గా తెలుగు వర్షన్‌లో మూవీని రిలీజ్‌ చేయనున్నారు. యూఎస్‌లోని ఫేమస్‌ ‘ఏస్‌ హోటల్‌’ స్క్రీన్‌లో కూడా ఈ సినిమాను మార్చి 1న రిలీజ్‌ చేయాలని యూనిట్ ప్లాన్‌ చేస్తోంది. దీనికి డైరక్టర్ రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎం.ఎం.కీరవాణి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలుస్తోంది. కాగా ‘RRR’ రీ రిలీజ్‌కు సంబంధించి సరికొత్త [ట్రైలర్‌ ](url)విడుదల కాగా దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. #RRR FINAL … Read more

    ఆస్కార్స్ కోసం అమెరికాకు రామ్‌చరణ్.. భారతీయ చిత్ర పరిశ్రమలో దక్షిణాది చిత్రాల హవా

    మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అమెరికా బయలుదేరాడు. ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అగ్రరాజ్యానికి పయనమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్, డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కూడా విమానం ఎక్కనున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డుకు పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని భారత ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఘనత డైరెక్టర్ రాజమౌళికే చెందుతుంది. ట్రెండ్ మారుతోంది ఒకప్పుడు భారతీయ … Read more

    చెర్రీ డ్యాన్స్ చూసి ఈర్ష్య పడ్డా: చిరంజీవి

    ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ ఎనర్జిటిక్ స్టెప్పులు చూశాక లోలోపల ఎంతో ఈర్ష్య కలిగిందని చిరంజీవి వెల్లడించారు. ‘నిజం విత్ స్మిత’ టాక్ షోలో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది విడుదలైన ఆచార్య సినిమాలో చిరు, చెర్రీ కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాటలో తన డ్యాన్స్‌ని ఎవరూ చూడరేమోనని భావించినట్లు చిరు చెప్పారు. కానీ, తండ్రిగా తనకు కొంత గౌరవం ఇచ్చాడని(డ్యాన్స్‌లో పోటీ పరంగా) చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ షో రేపు సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్‌లో తన … Read more

    MM కీరవాణి గురించి ఇప్పటి వరకు  మీకు  తెలియని ఆసక్తికరమైన విషయాలు

    ws_FmKZUswaUAAzyHB

    సంగీతాన్ని తన పేరుగా మార్చుకున్న తెలుగు అగ్ర సంగీత దర్శకుడు MM కీరవాణి. బాహుబలి, RRR చిత్రాల ద్వారా తెలుగు సంగీతాన్ని అంతర్జాతీయ యవనికపై మర్మోగించారు. స్వచ్ఛమైన బాణితో నిగూఢికృతమైన నాటు నాటు గీతానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డును పొంది తెలుగు సంగీత వైభవాన్ని చాటారు. RRRకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించిన కీరవాణి గురించి అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా వెతుకుతోంది. మరి కీరవాణి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయలు మీకోసం. కీరవాణి ఎప్పుడు ఎక్కడ పుట్టారు? కీరవాణి 1961 … Read more

    అవార్డు అందుకున్న ఎం.ఎం.కీరవాణి

    ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి దుమ్మురేపింది. లాస్ఏంజెలెస్ ఫిల్స్మ్ క్రిటిక్స్ అసోసియేషన్(LAFCA) ఉత్తమ మ్యూజిక్ స్కోర్ అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్‌మూవీ’ తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా వెల్లడించింది. లాఫ్కా అవార్డు అందుకున్నట్లుగా పోజు పెట్టిన ఎం.ఎం.కీరవాణి ఫోటోను పోస్ట్ చేసింది. ‘బెస్ట్ మ్యూజిక్ అవార్డు అందుకున్న మా సంగీత దర్శకుడు కీరవాణికి శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్‌లోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. View this … Read more

    జర్నలిస్టును సర్‌ప్రైజ్ చేసిన తారక్

    అమెరికా జర్నలిస్టును జూనియర్ ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ చేశాడు. సదరు జర్నలిస్టు పుట్టినరోజు అని తెలుసుకుని ఓ బహుమతిని అందించాడు. ఆర్ఆర్ఆర్ విజయం గురించి ‘వెరైటీ’ సంస్థకు చెందిన జర్నలిస్టు తారక్‌తో సంభాషిస్తున్నాుడు. ఈ క్రమంలో చివరికి తారక్.. ‘ఈ రోజు మీ బర్త్ డే కదా’ అని అడిగాడు. ‘అవునని’ జర్నలిస్టు సమాధానం చెప్పగా చేతికి చిన్న బహుమతిని అందించాడు. ‘ఇది తప్పకుండా మీకు నచ్చుతుంది’ అంటూ తారక్ హామీ ఇవ్వడం కొసమెరుపు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలో ఈ ఘటన జరిగింది. ఉత్తమ … Read more

    తెలుగు పరిశ్రమ గురించి తెలుస్తుంది: రాజమౌళి

    ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్న రాజమౌళి అదిరిపోయే [స్పీచ్](url) ఇచ్చారు. “ ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. మీరు నా చిత్ర యూనిట్‌లో ప్రతి ఒక్కరిని గౌరవించారు. దక్షిణాదిలోని చిన్న తెలుగు పరిశ్రమను చాలామంది దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి చిత్రపరిశ్రమ ఉందని చాలామందికి తెలీదు. దీనివల్ల వారందరికీ తెలుస్తుంది. భారతీయులు ఎంత ఆదరించారో ఇక్కడ కూడా అదే రెస్పాన్స్‌ వచ్చింది” అన్నారు. ❤️‍?❤️‍?❤️‍? SS RAJAMOULI ???pic.twitter.com/kCq3TVX5nY — RRR Movie (@RRRMovie) January … Read more