సంగీతాన్ని తన పేరుగా మార్చుకున్న తెలుగు అగ్ర సంగీత దర్శకుడు MM కీరవాణి. బాహుబలి, RRR చిత్రాల ద్వారా తెలుగు సంగీతాన్ని అంతర్జాతీయ యవనికపై మర్మోగించారు. స్వచ్ఛమైన బాణితో నిగూఢికృతమైన నాటు నాటు గీతానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డును పొంది తెలుగు సంగీత వైభవాన్ని చాటారు. RRRకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించిన కీరవాణి గురించి అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా వెతుకుతోంది. మరి కీరవాణి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయలు మీకోసం.
కీరవాణి ఎప్పుడు ఎక్కడ పుట్టారు?
కీరవాణి 1961 జూలై 4న ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో కోడూరు శివశక్తి దత్తా, భానుమతి దంపతులకు జన్మించారు.
కీరవాణి భార్య పిల్లలు ఎవరు?
కీరవాణి భార్య పేరు శ్రీవల్లి. వీరికి కాలభైరవ, భైరవ కీరవాణి, శ్రీసింహ ముగ్గురు కుమారులున్నారు. శ్రీసింహ టాలీవుడ్ హీరో. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. కాలభైరవ సింగర్‌గా రాణిస్తున్నాడు.
కీరవాణి ఇంటి పేరు కోడూరు అయితే MM కీరవాణి ఏంటి?
కీరవాణి అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి. టాలీవుడ్‌లో ఎం. ఎం. కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్‌గా పేరుపొందాడు.
మరకతమణి కీరవాణి అర్థం ఏమిటి?
మరకతమణి కీరవాణి పేరును తన తండ్రి శివశక్తి దత్తా పెట్టారని కీరవాణి చెప్పారు. మరకతమణి అంటే రత్నమని అర్థం. మరకతమణి మీనాక్షి దేవతకు ఇష్టం. కీరవాణి అంటే సంగీతంలోని ఒక రాగం పేరు అని చెప్పారు.
కీరవాణి వృత్తి జీవితం?
కీరవాణి కేరీర్ మొదట్లో రాజమణి, చక్రవర్తి వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌లో 1989లో మనసు – మమత ద్వారా ఎం. ఎం. కీరవాణిగా వెండితెరకు పరిచయం అయ్యారు. అదే బ్యానర్‌లో వచ్చిన పీపుల్స్ ఎన్‌కౌంటర్, అశ్విని చిత్రాలకు మ్యూజిక్ అందించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం ఆయనకు మంచి బ్రేక్ నిచ్చింది. తర్వాత కె. రాఘవేంద్రరావుతో 27కి పైగా సినిమాలు చేశాడు. ఆతర్వాత రాజమౌళి దర్శకుడిగా వచ్చిన అన్ని సినిమాలకు ఆయనే సంగీతం అందిస్తున్నాడు.
కీరవాణి ఎన్ని సినిమాలకు సంగీతం అందించారు?
ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 100కుపై చిత్రాలకు సంగీతం సమకూర్చారు. మాతృదేవోభవ, మేజర్ చంద్రకాంత్, క్షణక్షణం, అన్నమయ్య, ఛత్రపతి, శ్రీరామదాసు,సింహాద్రి, పెళ్లిసందడి, నేనున్నాను, బాహుబలి, RRR సినిమాలు ఆయనకు గొప్ప పేరు తెచ్చాయి.
కీరవాణి ఎత్తు, బరువు ఎంత?
కీరవాణి ఆజానుబావుడు 5.9 అడుగుల పోడవు, 70 కేజీల బరువు ఉంటారు.
కీరవాణి ఫిలాసఫీ ఎమిటి?
రోజు తప్పులు చేస్తూ ఉండండి కానీ చేసిన తప్పులు తిరిగి చేయకండి. వాటి నుంచి అనుభవాన్ని గడించండి.
కీరవాణి జీవన శైలీ ?
వినయంగా ఉండటం ఇష్టం. తనకన్న చిన్నవారినైనా గౌరవ వాచకంతో సంబోధించడం. మార్యద ఇచ్చిపుచ్చుకోవడాన్ని నమ్ముతారు.
కీరవాణికి మిగిలి ఉన్న కోరిక?
కీరవాణికి కథా రచన అంటే ఇష్టం. తన చివరి రోజుల్లో పుస్తకాలు చదువుతూ రచనా వ్యాసాంగం చేయాలనేది ఆయన కోరిక
కీరవాణికి ఇష్టమైన నవలా రచయిత?
కీరవాణికి రచయిత ఓషో అంటే చాలా ఇష్టం. ఆయన కథల సంపుటి నుంచి చాలా నేర్చుకున్నట్లు పలు సందర్భాల్లో చెప్పారు.
కీరవాణికి ఇష్టమైన దర్శకుడు?
SS రాజమౌళి, కె రాఘవేంద్రరావు. SS రాజమౌళి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలకు కీరవాణినే సంగీతం అందించారు.
కీరవాణికి ఇష్టమైన సింగర్?
ఘంటశాల అంటే కీరవాణికి చాలా ఇష్టం. ఆయన వాణి వింటూ మైమరచి పోతానని చెప్పారు.
కీరవాణికి ఇష్టమైన కార్లు?
కీరవాణి దగ్గర BMW M4, AUDI Q5, VOLVO XC 90 వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.
కీరవాణి ఇళ్లు ఎక్కడ?
కీరవాణి తన కుటుంబంతో కలిసి హైదరాబాద్- జూబ్లి హిల్స్‌లో ఉంటున్నారు. జూబ్లీ హిల్స్‌లో సాంప్రదాయ కళారీతులతో తన ఇళ్లును నిర్మించుకున్నారు.
కీరవాణికి ఎన్ని భాషలు తెలుసు?
కీరవాణి తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుతారు.
కీరవాణికి ఎంతమంది సోదరులు?
కీరవాణికి ఇద్దరు సోదరులు ఉన్నారు. నటుడు, రచయితగా SS కాంచి స్థిరపడ్డారు. మరొక సోదరుడు కళ్యాణ్ మాలిక్ సంగీత దర్శకుడిగా ఉన్నారు. సోదరి MM శ్రీలేఖ సైతం మ్యూజిక్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.
కీరవాణికి ఇష్టమైన ఆహారం?
కీరవాణికి నాటు కోడి పులుసు అంటే ఇష్టం
అవార్డులు- అంతర్జాతీయ గుర్తింపు
1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నారు. వీటితో పాటు 8 ఫిల్మ్ పేర్ అవార్డులు, 11 నంది అవార్డులు వచ్చాయి. తాజాగా RRR చిత్రంలోని నాటు నాటు పాటకు గాను బెస్ట్ వర్జినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!