• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 

    ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 2022లో జరిగిన విషయాలేంటో ఓ సారి చూద్దాం. దివికేగిన దిగ్గజాలు ఈ ఏడాది వినోదరంగంలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్‌ స్టార్ కృష్ణ, లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచారు. గ్రేట్ సింగర్స్‌ కేకే అనుకోకుండా చనిపోవటం, సిద్దూ మూసేవాలా హత్య ఫ్యాన్స్‌ను కన్నీటి పర్యంతం చేశాయి. కెేరాఫ్ బ్లాక్ బస్టర్స్‌ 2022లో వివిధ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. RRR, KGF-2, బ్రహ్మస్త్ర, విక్రమ్, PS-1, కాంతారా వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. … Read more

    2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

    ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

    తెలుగు సినిమా హిట్స్ , ఫ్లాప్స్-2022

    తెలుగు సినీ పరిశ్రమ ఈ ఏడాది భారీ హిట్లను కొట్టింది. ఆర్ఆర్ఆర్‌తో మెుదలైన ప్రభంజనం హిట్-2 చిత్రం వరకు కొనసాగింది. బింబిసార, ఒకే ఒక జీవితం వంటి సినిమాలు ప్రేక్షకుల్ని టైం ట్రావెల్ చేయిస్తే…సీతారామం లాంటి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం యువతను ఉర్రూతలూగించింది. రెండో అర్ధభాగంలో కార్తీకేయ-2 పాన్ ఇండియా లెవల‌్‌లో హిట్ కొట్టింది. విక్రమ్, కాంతారా వంటి పరభాష చిత్రాలు తెలుగులో విడుదలై సంచలనాలే సృష్టించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్, విజయ్ లైగర్ బాక్సాఫీస్ వద్ద … Read more

    జపనీస్‌లో ఎన్టీఆర్ స్పీచ్‌

    “RRR” ప్రమోషన్స్‌లో భాగంగా ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌, రాజమౌళి జపాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఫుడ్‌ను వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తూనే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక ఎన్టీఆర్‌ గురించి మనకు తెలియందేముంది…ఏక సంథాగ్రాహి. ఒక్కసారి విన్నాడంటే పట్టేస్తాడు. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఇప్పుడు జపనీస్‌లోనూ మాట్లాడుతున్నాడు. జపాన్‌లో ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ జపనీస్‌లో మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. NTR speaking in Japanese … Read more

    విశ్వక్‌సేన్ అలాంటి నటుడు: చరణ్

    సినిమా హిట్టయినా.. ఫ్లాపయినా వ్యక్తిత్వమే మనల్ని స్టార్‌గా నిలబెడుతుందని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తెలిపాడు. అలాంటి నటుడు విశ్వక్‌సేన్ అని.. అందుకే తనంటే ఇష్టమని చెర్రీ వెల్లడించాడు. ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన రాంచరణ్ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకున్నాడు. ‘రజినీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లాగా విశ్వక్‌సేన్ వ్యక్తిత్వం ఒకేలా ఉంటుంది. పర్సనాలిటీ నిండుగా ఉన్న హీరో విశ్వక్‌సేన్. ట్రైలర్ చూశా. బాగుంది. పండుగకు ఇంతకన్నా మంచి సినిమా ఏముంటుంది. ఎంతోమంది అభిమానులను విశ్వక్‌సేన్ సంపాదించుకున్నాడు’ అని చెర్రీ … Read more

    ఆస్కార్‌ బరిలో ‘దోస్తీ’ పాట

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమా పేరును మార్మోగేలా చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అద్భుత నటకు జూ.ఎన్టీఆర్‌ ఆస్కార్‌ బరిలో ఉంటాడని సినీ విశ్లేషకులు ఇప్పటికే చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాలోని దోస్తీ పాట కూడా అకాడమీ అవార్డుల బరిలో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. దోస్తీ పాటను తెలుగులో హేమచంద్ర ఆలపించగా, హిందీలో అమిత్‌ త్రివేది పాడారు. గంభీరంగా సాగే ఈ పాట విడుదలైన అన్ని భాషల్లోనూ శ్రోతలను అలరించింది.

    విజయేంద్ర ప్రసాద్ కథల్లో గుండెలు పిండేసిన సీన్స్

    విజయేంద్ర ప్రసాద్. పేరుకు తగ్గట్టే ఆయన కథలు విజయానికి చిరునామా. దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ‘ఈగ’ మినహా కథలన్నీ విజయేంద్రప్రసాద్ కలం నుంచి జాలువారినవే. ఆయన కథలు తెరపై చూస్తుంటే నరాలు ఉప్పొంగుతాయి, గుండెలు పిండేసినట్టుంటుంది, మనమే తెరలోకి వెళ్లి ఏదోటి చేసేయాలన్నంత భావోద్వేగం రగులుతుంది. అదే విజయేంద్ర ప్రసాద్ కథా రహస్యం. తాజాగా ఆయన సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. అయితే ఆయన సాహిత్య సారథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో అద్భుతమైన కొన్ని సీన్లు ఓసారి నెమరేసుకుందాం. … Read more

    HBD లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం. కీర‌వాణి

    నేడు లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం కీర‌వాణి పుట్టిన‌రోజు. కీర‌వాణి జులై 4, 1961న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొవ్వూరులో జ‌న్మించాడు. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ చిత్రాల‌కు కూడా మ్యూజిక్ అందించాడు. అన్న‌మ‌య్య సినిమాకు నేష‌న‌ల్ అవార్డును పొందాడు. దాంతోపాటు ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 11 నంది అవార్డులు అందుకున్నాడు. రాజ‌మౌళి అన్ని సినిమాల‌కు సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి. ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కించిన‌ సినిమాలు ప్ర‌పంచ‌స్థాయిలో స‌త్తా చాటాయంటే అందులో కీర‌వాణి మ్యూజిక్ కూడా ఒక భాగం అని చెప్పాలి. ఆయ‌న … Read more

    RRR క్లైమాక్స్ ఫారెస్ట్ ఫైటింగ్‌ సీన్ మేకింగ్ వీడియో

    RRR సినిమాలో ప్ర‌తి ఫ్రేమ్ అద్భుత‌మే. ముఖ్యంగా యాక్ష‌న్ సీన్స్‌లో కూడా ఎమోష‌న్స్‌ను ర‌క్తిక‌ట్టించారు. క్లైమాక్స్‌లో అడ‌విలో జ‌రిగే యాక్ష‌న్ సీన్‌కు సంబంధించిన ఒక వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలోవైర‌ల్‌గా మారింది. మ‌కుట విజువ‌ల్ ఎఫెక్ట్స్ సంస్థ ఆ సీన్‌లో ఉప‌యోగించిన విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఆక్రియేటివిటీని చూస్తే ఎవ‌రైనా వావ్ అనాల్సిందే. ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.1100 కోట్లు వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు నెట్‌ప్లిక్స్‌లో మోస్ట్ పాపుల‌ర్ ఇండియ‌న్ మూవీగా నిలిచింది.

    ఫస్టాఫ్ బాక్సాఫీస్ బాద్‌షాలెవ‌రు? బోల్తా కొట్టిందెవరు?

    దర్శకధీరుడి సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్, బాక్సాఫీస్ దగ్గర డీజే టిల్లు బ్లాక్ బస్టర్ బరాత్,  అడివిశేష్ ‘మేజర్’ సూపర్ హిట్ ఆపరేషన్ ఒకవైపు.. ‘మెగా’ అంచనాలతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ‘ఆచార్య’ లాంటి సినిమాలు మరోవైపు… 2022 తొలి అర్ధభాగంలో తెలుగు సినిమా ప్రయాణం అనూహ్యంగా సాగింది. అంచనాలే లేకుండా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే…భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అలాగే ఆర్నెళ్లలో రెండే రెండు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లు వస్తే అందులో ఒకటి … Read more