[VIDEO:](url) ఉపాసనతో ఎక్కడికి వెళ్లినా ఓ చిన్న రామాలయాన్ని వెంట తీసుకెళ్తానని రామ్‌చరణ్ వెల్లడించాడు. ఈ ఆలయం తమతో ఉంటే కొండంత ధైర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి దైవకృపే కారణమని తెలిపాడు. ‘ఉదయం ప్రార్థనలతోనే మాకు రోజు ప్రారంభం అవుతుంది. ఇది మా సంప్రదాయం. భారతీయులమని మాకు గుర్తు చేస్తుంది. శక్తిని ప్రసాదిస్తుంది. ఇలా చేయడాన్ని కృతజ్ణతగా భావిస్తాం’ అని చెప్పాడు. చెర్రీ ఎక్కువగా అయ్యప్ప మాలను ధరిస్తుంటాడు. తరుచుగా ఆలయాలకు వెళ్తుంటాడు. అమెరికాకు వెళ్లినా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నందుకు చరణ్ దంపతులను ప్రశంసిస్తున్నారు.
-
Courtesy Twitter:@rameshlaus
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్