• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సీతారాములే మా బలం: రామ్‌చరణ్

  [VIDEO:](url) ఉపాసనతో ఎక్కడికి వెళ్లినా ఓ చిన్న రామాలయాన్ని వెంట తీసుకెళ్తానని రామ్‌చరణ్ వెల్లడించాడు. ఈ ఆలయం తమతో ఉంటే కొండంత ధైర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి దైవకృపే కారణమని తెలిపాడు. ‘ఉదయం ప్రార్థనలతోనే మాకు రోజు ప్రారంభం అవుతుంది. ఇది మా సంప్రదాయం. భారతీయులమని మాకు గుర్తు చేస్తుంది. శక్తిని ప్రసాదిస్తుంది. ఇలా చేయడాన్ని కృతజ్ణతగా భావిస్తాం’ అని చెప్పాడు. చెర్రీ ఎక్కువగా అయ్యప్ప మాలను ధరిస్తుంటాడు. తరుచుగా ఆలయాలకు వెళ్తుంటాడు. అమెరికాకు వెళ్లినా సనాతన ధర్మాన్ని … Read more

  ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ లైవ్ పర్ఫార్మెన్స్

  [VIDEO:](url) ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై తెలుగు సింగర్స్ ‘నాటు నాటు’ పాట పాడి అదరగొట్టారు. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ పాడుతుంటే డ్యాన్సర్స్ కాలు కదుపుతుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలటంలేదు. స్టేజిపై పర్ఫార్మెన్స్ చేస్తుంటే వీక్షకులు చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేశారు. 2.30నిమిషాల పాటు గాయకులు ఈ పాటను ఆలపించారు. అంతకుముందు ఈ పాటను ఆలపించడానికి సింగర్స్‌ని విభిన్నంగా ఆహ్వానించారు. కొంతమంది వచ్చి ‘నాటు నాటు’ పాట స్టెప్పు వేసుకుంటూ యాంకర్‌ని అటువైపు లాక్కెళ్లారు. That performance of #NatuNatu set the … Read more

  ఆస్కార్‌కు బయలుదేరిన దీపిక పదుకొణె

  [VIDEO](url): బాలీవుడ్ క్వీన్ దీపిక పదుకొణె అమెరికా బయలు దేరింది. ఆస్కార్ వేడుకలకు హాజరయ్యేందుకు ముంబై నుంచి పయనమయ్యింది. ఈ క్రమంలో ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. థాంక్యూ అంటూ మెసేజ్‌ని షేర్ చేసిందీ పఠాన్ బ్యూటీ. 95వ ఆస్కార్ వేడుకలకు దీపిక పదుకొణె అవార్డ్ ప్రజెంటర్‌గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. భారత్ నుంచి ప్రజెంటర్ల లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక సెలిబ్రిటీ దీపికనే. మార్చి 12న(భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) లాస్‌ఏంజెలెస్‌లో ఆస్కార్ వేడుక జరగనుంది.     … Read more

  శిరస్సువంచి పాదాలకు నమస్కరిస్తా: ఎన్టీఆర్

  [VIDEO:](url) ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో జరిగిన మీట్‌లో ఎన్టీఆర్ భావోద్వేగపూరిత ప్రసంగం చేశాడు. ఏమిచ్చినా అభిమానుల రుణం తీర్చుకోలేనని అభిప్రాయపడ్డాడు. ‘రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. ఏ రక్త సంబంధం లేకున్నా నాకోసం, నాతో నిలబడ్డారు. మీరు చూపిస్తున్న ప్రేమ కన్నా మీపై రెట్టింపు ప్రేమను నాలో దాచుకున్నాను. శిరస్సువంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరకుంటున్నా’ అని ఎన్టీఆర్ … Read more

  అమెరికాకు బయలుదేరిన జూ.ఎన్టీఆర్

  [VIDEO:](url) ఆస్కార్ వేడుకకు హాజరయ్యేందుకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికా పయనమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామును శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలు దేరారు. మార్చి 12న లాస్‌ ఏంజెలెస్‌లో ఆస్కార్ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ బృందం హాజరు కానుంది. అమెరికాకు వెళ్లాక ఎన్టీఆర్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్‌లైట్ అవార్డును స్వీకరించనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ వేడుకకు తారక్ హాజరుకాలేదు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ ఆస్కార్ రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. Young tiger … Read more