[VIDEO](url): బాలీవుడ్ క్వీన్ దీపిక పదుకొణె అమెరికా బయలు దేరింది. ఆస్కార్ వేడుకలకు హాజరయ్యేందుకు ముంబై నుంచి పయనమయ్యింది. ఈ క్రమంలో ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. థాంక్యూ అంటూ మెసేజ్‌ని షేర్ చేసిందీ పఠాన్ బ్యూటీ. 95వ ఆస్కార్ వేడుకలకు దీపిక పదుకొణె అవార్డ్ ప్రజెంటర్‌గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. భారత్ నుంచి ప్రజెంటర్ల లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక సెలిబ్రిటీ దీపికనే. మార్చి 12న(భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) లాస్‌ఏంజెలెస్‌లో ఆస్కార్ వేడుక జరగనుంది.