[VIDEO:](url) ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై తెలుగు సింగర్స్ ‘నాటు నాటు’ పాట పాడి అదరగొట్టారు. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ పాడుతుంటే డ్యాన్సర్స్ కాలు కదుపుతుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలటంలేదు. స్టేజిపై పర్ఫార్మెన్స్ చేస్తుంటే వీక్షకులు చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేశారు. 2.30నిమిషాల పాటు గాయకులు ఈ పాటను ఆలపించారు. అంతకుముందు ఈ పాటను ఆలపించడానికి సింగర్స్‌ని విభిన్నంగా ఆహ్వానించారు. కొంతమంది వచ్చి ‘నాటు నాటు’ పాట స్టెప్పు వేసుకుంటూ యాంకర్‌ని అటువైపు లాక్కెళ్లారు.