• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మెగాస్టార్ వాచ్ ఖరీదు రూ.1.86 కోట్లు

  మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన హాజరవుతున్న వేడుకలకు వివిధ వాచ్‌లు పెట్టుకోవడం ఫ్యాన్స్ కంటపడింది. దీంతో వాచ్ బ్రాండ్స్‌, ఖరీదు గురించి తెలుసుకుంటున్న వారు షాక్‌కు గురవుతున్నారు. చిరు దగ్గర చాలా వాచ్‌లు ఉన్నాయట. అందులో రోలేక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ధర రూ. 1.86 కోట్లు. లాంగే కంపెనీకి చెందిన మరో గడియారం కాస్ట్ రూ. 33 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది.

  భావోద్వేగానికి గురైన చిరంజీవి

  కళాతపస్వి కె. విశ్వనాథ్‌ మరణంతో సినీలోకం విషాదంలో ఉంది. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

  సీనియర్ కెమెరామెన్‌కు చిరంజీవి సాయం

  మెగాస్టార్ చిరంజీవి మరోసారిన తన ఉదారతను చాటుకున్నారు. సీనియర్ కెమెరామెన్ దేవరాజ్‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి రూ. 5 లక్షలు సాయం చేశారు. ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు చిరంజీవి. 1980-90ల్లో ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాల కోసం కెమెరామెన్‌గా పనిచేసి, దక్షిణాదిలో దేవరాజ్‌ మంచిపేరు సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్,ఏఎన్‌ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశారు.

  రూ. 250 కోట్లకు చేరువలో వాల్తేరు వీరయ్య కలెక్షన్లు

  మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదలై దాదాపు మూడు వారాలు గడుస్తున్నా కలెక్షన్లు నిలకడగానే కొనసాగుతున్నాయి. 18వ రోజు కూడా దాదాపు కోటికిపైగా వసూలు చేసింది. ప్రస్తుతం రూ. 250 కోట్లకు చేరువలో ఉంది. ఏపీ, తెలంగాణ, హీందీ, కన్నడ రూ. 158 కోట్లు రాబట్టిందని నిర్మాతలు తెలిపారు. ఓవర్సీస్‌లో రూ.28 కోట్లు వచ్చాయి. దీంతో మెుత్తం రూ. 210 కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం దాదాపు రూ.45 కోట్లు లాభాన్ని డిస్టిబ్యూటర్లకు పంచిపెట్టింది.

  వాల్తేరు వీరయ్య ఫంక్షన్‌లో తొక్కిసలాట

  హనుమకొండలో జరుగుతున్న వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్ కళాశాలలో జరుగుతుండగా.. గేట్లు తెరవటంతో చాలామంది దూసుకెళ్లారు. దీంతో ఒకరినొకరు తోసుకోవటంతో కిందపడ్డారు. దీంతో ప్రమాదం జరిగింది. ఇందులో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  ‘వాల్తేరు వీరయ్య’ రేటింగ్స్; చిరు జోక్స్

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిరు యూఎస్‌లోని తన అభిమానులతో జూమ్ కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని ఫన్నీ విషయాలను పంచుకున్నారు.‘‘వాల్తేరు వీరయ్య’ యూఎస్ ప్రీమియర్స్ చూసి ఇక్కడి వెబ్‌సైట్‌లు 2.5 రేటింగ్స్ ఇచ్చాయి. చూసి నవ్వుకున్నాను. కానీ ఆ తర్వాతే తెలిసింది.. 2.5 అంటే 2.5 మిలియన్ డాలర్లు అని. యూఎస్‌లో అంత రెవెన్యూ వస్తుందని వారు ముందే చెప్పారు.’’ అంటూ ఫన్నీగా తెలిపారు.

  వాల్తేరు వీరయ్యకు మరిన్ని థియేటర్లు?

  సంక్రాంతి హిట్‌గా నిలిచిన వాల్తేరు వీరయ్య మూవీని తెలుగురాష్ట్రాల్లో మరిన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. వీక్ డేస్‌లోనూ ఈ సినిమా డీసెంట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీంతో థియేటర్లను పెంచి మరింత మంది ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతో చిరంజీవి మాస్ కమ్ బ్యాక్ ఇచ్చారని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

  బాబీకి గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి !

  వాల్తేరు వీరయ్య చిత్రం ఘన విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తనకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీకి విలువైన కానుక ఇచ్చాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాబీని ఇంటికి విందుకు పిలిచాడట చిరంజీవి. అనంతరం రెండు కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. కానీ, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. వాల్తేరు వీరయ్య మూడ్రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరటమే కాకుండా సంక్రాంతి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

  20 ఏళ్ల తర్వాత చిరంజీవికి మెగా హిట్

  మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో వసూళ్ల దాహం తీర్చుకుంటున్నారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నా… ఇండస్ట్రీ హిట్‌ దక్కలేదు. ప్రస్తుతం సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుంది. ఇంద్ర సినిమా తర్వాత ఓ స్ట్రెయిట్ సినిమా ఇంతలా ఆడలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత చిరంజీవి కల నెరవేరింది. ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. ఇక ఈ హిట్‌తో వరుసగా స్ట్రెయిట్‌ చిత్రాలను లైన్‌లో పెడుతున్నారు.

  భోళా శంకర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

  మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రంపై దృష్టి సారించారు. వేదాలం రీమేక్‌గా తెరకెక్కుతున్న భోళా శంకర్‌ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం కొత్త షెడ్యూల్‌ ప్రారంభించారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. చిరు సరసన తమన్నా నటిస్తోంది. కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా..మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.