• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇవే?

    ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే … Read more

    VNRTri0: నితిన్‌, రష్మిక, వెంకీ కుడుముల సినిమా లాంఛ్‌… త్వరలోనే షూటింగ్‌

    నితిన్‌, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మరో చిత్రం లాంఛ్ అయ్యింది. VNRTrioగా సినిమాను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.సంక్రాంతికి సూపర్ హిట్లు అందించిన దర్శకులు బాబి, గోపిచంద్‌ మలినేనితో పాటు హను రాఘవపూడి, బుచ్చిబాబు కూడా హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సినిమా నిర్మితమవుతోంది. వేరే లెవెల్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ను కూడా క్రేజీగా చేశారు. ఓ ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి రిలీజ్ చేసింది చిత్రబృందం. లేట్ అయ్యానా ? అని వెంకీ అడగ్గా… … Read more

    రామ్‌ చరణ్‌కు అమిత్ షా సన్మానం

    మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సత్కరించారు. RRRలో నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశానికే గర్వకారణమని కొనియాడారు. షాలువా కప్పి అభినందించారు. ఆస్కార్ వేడుకల అనంతరం అమిత్ షా ఆహ్వానం మేరకు చిరంజీవితో కలిసి ఆయన షా నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    రాజశేఖర్‌కు నా సెల్యూట్: చిరంజీవి

    [VIDEO:](url) హైదరాబాద్‌లో రోడ్డుపై కుప్పకూలిన యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్‌ను ట్విట్టర్‌లో చిరంజీవి అభినందించారు. ‘హార్ట్‌ స్ట్రోక్‌తో సడెన్‌గా పడిపోయిన యువకుడికి సమయానికి CPR అందించి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్‌కు నా సెల్యూట్‌. రాజశేఖర్ గారు మీరు మీ కర్తవ్యాన్ని మించి.. సాటి మనిషిని కాపాడారు. మావత్వంలోనూ, రక్షించడంలోనూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఉదాహరణగా నిలిచారు’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. The unwavering commitment towards the public! The exceptional actions of Cyberabad Traffic Police Constable Rajasheker of … Read more

    భోళా శంకర్ లుక్ అదుర్స్

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రబృందం శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. ఇందులో చిరంజీవి తాండవం ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. చిరు సరసన తమన్నా కథానాయికగా చేస్తోంది. కీర్తి సురేశ్‌ చెల్లిగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

    భావోద్వేగానికి గురైన చిరంజీవి

    కళాతపస్వి కె. విశ్వనాథ్‌ మరణంతో సినీలోకం విషాదంలో ఉంది. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

    ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఐదో సాంగ్ లాంఛ్

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ నుంచి మరో సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాట ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలు యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచాయి. కాగా ఈ మూవీని డైరెక్టర్ బాబీ రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల 12న ఈ మూవీ విడుదల కానుంది.

    2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

    2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

    రవితేజ క్యారెక్టర్ వేరే లెవెల్; చిరంజీవి

    ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో మాస్ మహరాజా క్యారెక్టర్ వేరే లెవెల్ అని మెగాస్టార్ చిరంజీవి అన్నాడు. రవితేజ నటన ఈ చిత్రానికే హైలెట్ అవుతుందని చెప్పారు. ‘వాల్తేరు వీరయ్య’ ప్రి రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా పక్కా కమర్షియల్ అని చెప్పారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని పేర్కొన్నారు. డైరెక్టర్ బాబీ ఈ చిత్రానికి తీవ్రంగా శ్రమించారని తెలిపారు. శృతిహాసన్, కేథరిన్ నటన అద్భుతమన్నారు. కాగా ‘వాల్తేరు వీరయ్య’ ఈ నెల 13న రిలీజ్ కానుంది.

    LIVE: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్

    మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విశాఖలో ఘనంగా జరుగుతోంది. ఆంధ్రా యూనివర్సిటీలో కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ ఇద్దరు కలిసి వేడుకకు హాజరయ్యారు. శృతిహాసన్‌కు అనారోగ్యం కారణంగా రాలేదని తెలుస్తోంది. చిత్రానికి బాబి దర్శకత్వం వహించగా…దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. జనవరి 13న సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.