• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Chiranjeevi: మెగాస్టార్‌కు ‘భారత రత్నే’ కరెక్ట్‌.. సర్‌ప్రైజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్న టాలీవుడ్!

  మెగాస్టార్‌ చిరంజీవి (Konidela Chiranjeevi)కి భారత ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం రిపబ్లిక్‌ డే సందర్భంగా మెగాస్టార్‌కు ‘పద్మ విభూషణ్‌’ (Padma Vibhushan) అవార్డును ప్రకటించి సముచిత గౌరవాన్ని చాటుకుంది. దీంతో టాలీవుడ్ ప్రముఖ నటులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

  చిరుకు భారతరత్న రావాలి!

  తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తాజాగా చిరుని కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన్ను సన్మానించి ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. చిరుకి పద్మభూషణ్‌ రావడం గర్వకారణం అన్నారు. త్వరలో చిరంజీవికి పౌరసన్మానం కూడా చేస్తామన్నారు. చిరుకు పద్మ విభూషణ్ మాత్రమే కాదు.. భవిష్యత్తులో భారత రత్న (Chiranjeevi Bharat Ratna) కూడా రావాలంటూ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కళామ్మతల్లికి, సమాజానికి చేరు చేస్తున్న సేవలకు గాను చిరంజీవికి భారత రత్నే ఇస్తేనే సముచితంగా ఉంటుందని అటు నెటిజన్లు సైతం కామెంట్స్‌ చేస్తున్నారు.

  ‘చిరు కోసం స్పెషల్‌ ఈవెంట్’

  మంత్రితో పాటే నిర్మాత దిల్ రాజు (Dil Raju) కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం సందర్భంగా ఒక స్పెషల్ ఈవెంట్‌ని తాము ప్లాన్ చేయాలని చూస్తున్నామని తెలిపారు. చిరంజీవి దక్కిన ఈ అరుదైన గౌరవానికి తెలుగు సినిమా తరపున ఒక గ్రాండ్ ట్రీట్ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఈవెంట్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. 

  టాలీవుడ్‌ ఏకం కాబోతోందా!

  గతంలో చిరంజీవి ‘పద్మ భూషణ్’ అందుకున్నప్పుడు ఆయన్ని సన్మానిస్తూ టాలీవుడ్ ఓ ఈవెంట్ చేసింది. అప్పుడు కొంతమంది సినీ ప్రముఖులే ఆ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈసారి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం చిరుకి రావడంతో సినీ పెద్దలు గ్రాండ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ (Tollywood) అంతా ఒకేచోటికి రాబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్స్, సీనియర్ నటీనటులు, దర్శకులు, సాంకేతిక సిబ్బంది.. ఇలా చాలా మందిని ఈవెంట్‌కు రప్పించాలని చూస్తున్నట్లు టాక్. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగిన టాలీవుడ్ ఖ్యాతిని ఈ ఈవెంట్‌ ద్వారా అన్ని ఇండస్ట్రీలకు విస్తరింపజేయాలని భావిస్తున్నారు. 

  చిరు.. ఫుల్‌ బిజీ బిజీ

  ఇక చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) తర్వాత చిరంజీవి (Chiranjeevi) మెహ‌ర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో ‘భోళా శంకర్’(Bholaa Shankar) సినిమా చేశారు. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఇక భోళా శంకర్ తర్వాత చిరంజీవి.. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్టతో ‘విశ్వంభర’ అనే ఓ భారీ ఫాంటసీ మూవీని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. రెగ్యులర్‌ షూట్‌లో పాల్గొంటూ చిరు బిజీ బిజీగా ఉన్నారు. ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

  బాలయ్య డైరెక్టర్‌తో సినిమా!

  విశ్వంభర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక చిరంజీవి ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని అపజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv