• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Chiranjeevi: మెగాస్టార్‌కు ‘భారత రత్నే’ కరెక్ట్‌.. సర్‌ప్రైజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్న టాలీవుడ్!

  మెగాస్టార్‌ చిరంజీవి (Konidela Chiranjeevi)కి భారత ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం రిపబ్లిక్‌ డే సందర్భంగా మెగాస్టార్‌కు ‘పద్మ విభూషణ్‌’ (Padma Vibhushan) అవార్డును ప్రకటించి సముచిత గౌరవాన్ని చాటుకుంది. దీంతో టాలీవుడ్ ప్రముఖ నటులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  చిరుకు భారతరత్న రావాలి! తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తాజాగా చిరుని కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన్ను సన్మానించి … Read more

  స్నేహితుడికి అండగా నిలిచిన చిరు

  మెగాస్టార్‌ చిరు తన బాల్య మిత్రుడికి అండగా నిలిచారు. మొగల్తూరుకు చెందిన పువ్వాడ రాజా అనే వ్యక్తి, చిరంజీవి చిన్ననాటి స్నేహితులు. తన మిత్రుడి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న చిరు చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఇటీవల చేర్పించారు. తాజాగా ఆస్పత్రికి వెళ్లిన చిరు.. వైద్యుల నుంచి రాజా ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఫొటోను నిర్మాత బండ్ల గణేశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ‘మీరు గ్రేట్‌ సర్‌..’ అంటూ గణేశ్‌ తన పోస్టుకు … Read more

  మెగాస్టార్ అభిమానిగా పుష్ప రాజ్

  పుష్ప-2 మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. పుష్ప-2లో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా కనిపించనున్నాడని తెలిసింది. 2000 దశకంలో టాలలీవుడ్‌ను మెగాస్టార్ రూల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ టైంలో జరిగిన స్టోరీ కావడంతో పుష్ప రాజ్ మెగాస్టార్‌కు పెద్ద ఫ్యాన్‌గా తెరకెక్కిస్తున్నారంట. ప్రస్తుతం ఆ సీన్లకు సంబంధించి షూట్ చేస్తున్నారు. ‘ఇంద్ర’ రిలీజ్ టైంలో పుష్పరాజ్ గెటప్‌, చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని తెరకెక్కిస్తున్నారు.

  VNRTri0: నితిన్‌, రష్మిక, వెంకీ కుడుముల సినిమా లాంఛ్‌… త్వరలోనే షూటింగ్‌

  నితిన్‌, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మరో చిత్రం లాంఛ్ అయ్యింది. VNRTrioగా సినిమాను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.సంక్రాంతికి సూపర్ హిట్లు అందించిన దర్శకులు బాబి, గోపిచంద్‌ మలినేనితో పాటు హను రాఘవపూడి, బుచ్చిబాబు కూడా హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సినిమా నిర్మితమవుతోంది. వేరే లెవెల్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ను కూడా క్రేజీగా చేశారు. ఓ ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి రిలీజ్ చేసింది చిత్రబృందం. లేట్ అయ్యానా ? అని వెంకీ అడగ్గా… … Read more

  భోళా శంకర్ లుక్ అదుర్స్

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రబృందం శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. ఇందులో చిరంజీవి తాండవం ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. చిరు సరసన తమన్నా కథానాయికగా చేస్తోంది. కీర్తి సురేశ్‌ చెల్లిగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

  గాడ్ ఫాదర్ టైటిల్ సంగ్ రిలీజ్

  గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ ఫుల్ వీడియోని మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్‌ సిక్వెన్స్‌తో ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా ఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. హీరో మెగాస్టార్ చిరంజీవి తనకే సాధ్యమైన యాక్షన్ పెర్ఫార్మన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో నయనతార, సముద్రఖని, సునిల్ ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

  గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ రిలీజ్

  గాడ్ ఫాదర్ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్‌లో మెగాస్టార్ లుక్స్ ఇదివరకు చూడని స్టైల్‌లో ఉన్నాయి. చిరు మాస్ వైబ్రెంట్స్ అదిరిపోయాయి. విశ్వరూపధారి అంటూ సాగిన లిరిక్స్ బాగున్నాయి. సాంగ్ BGM సూపర్‌గా ఉంది. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ సాంగ్‌ను చూసిన అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.

  గాంధీలో మెగాస్టార్ సినిమా చూపుతూ బ్రెయిన్ సర్జరీ

  హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం అత్యంత కీలకమైన బ్రెయిన్‌ సర్జరీ చేశారు. అయితే ఆమెకు మెగాస్టార్‌ సినిమా చూపుతూ చికిత్స చేశారు. మహిళ మెదడులో పెరుగుతున్న ప్రమాదకర కణితిని తొలగించే క్రమంలో మహిళకు చికిత్స చేశారు. అయితే ఆమెకు పూర్తిస్థాయిలో మత్తు ఇవ్వలేదు. ఆమె తనకు మెగస్టార్‌ ‘అడవి దొంగ’ సినిమా చూపించాలని కోరగా ఆ సినిమా చూపుతూ చికిత్స చేశారు. సర్జరీ జరుగుతున్నంత సేపు ఆమె సినిమా చూస్తూనే ఉన్నారు. శస్త్ర చికిత్స విజయవంతమైంది. వీడియో కోసం watch on … Read more

  రాఖీ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తన తర్వాతి చిత్రం ‘భోళా శంకర్’ ద్వారా చిన్న వీడియోతో చిరు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో చిరు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ‘అక్కా చెల్లెల్లందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు ప్రేమతో మీ సోదరుడు చిరంజీవి’ అంటూ ఆయన మాటల్లో చెప్పారు. భోళా శంకర్ సినిమాను మెహెర్ రమేశ్ తెరకెక్కిస్తుండగా, AK ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.